ఒక్క చిల్లి పైసా కూడా ఎక్స్ ట్రా ఇవ్వక్కర్లేదు.. బేరాలే లేవు.. ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో BMW గేమ్ చేంజర్

BMW భారతదేశంలో అత్యంత ఖరీదైన కార్లను విక్రయిస్తుంది. ఈ కంపెనీ తయారు చేసే ఉత్పత్తులు లగ్జరీ ఫీచర్లతో పాటు అద్భుతమైన పర్ఫార్మెన్స్‌ను కూడా అందిస్తాయి. ఇప్పుడు ఈ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలను కూడా విక్రయిస్తోంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లపై ప్రజల్లో మోజు పెరుగుతున్న నేపథ్యంలో ఆ విభాగాన్ని కూడా సొంతం చేసుకోవడానికి BMW ఈ కొత్త వ్యూహాన్ని అమలు చేసింది.

ఈ నేపథ్యంలో BMW తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ కారు i7 కోసం కొత్త ధరల విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం కారు కొనే కస్టమర్‌లు ఎక్స్-షోరూమ్ ధరతో పాటు ఏ రాష్ట్రంలో నమోదు చేసుకుంటారో దాని కోసం వేరుగా రిజిస్ట్రేషన్ ఫీజు, పన్నులు అన్నీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు BMW ఈ విధానాన్ని మార్చేసింది.

BMW

భారతదేశం మొత్తం ఈ కారును కొంటే ఒకే ధర అనే కొత్త ప్లాన్‌ను BMW ప్రకటించింది. దీని ప్రకారం ఇకపై ఈ కారును కొనే కస్టమర్‌లకు కారు ధర తర్వాత వచ్చే అదనపు ఖర్చులను BMW కంపెనీనే భరిస్తుందని తెలిపింది. ఈ ప్లాన్ భారతదేశంలోని అన్ని BMW షోరూమ్‌లలో అందుబాటులో ఉండేలా రూపొందించబడింది.

ప్రస్తుతం BMW i7 కారు రూ. 2.05 కోట్ల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో అమ్ముడవుతోంది. ఇప్పుడు ఈ ధరలోనే GST (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్), కాంప్రెస్డ్ సెస్ కూడా కలిపి ధరను నిర్ణయించింది. దీనికి అదనంగా కస్టమర్‌లు TCS (ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్), ఇన్సూరెన్స్, ఇతర స్థానిక పన్నులను మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ కారు రిజిస్ట్రేషన్ ఖర్చును కంపెనీయే భరిస్తుందని ప్రకటించారు.

BMW i7 కారు పూర్తిగా ఎలక్ట్రిక్‌తో నడుస్తుంది. ఈ కారులో స్ప్లిట్ హెడ్‌లైట్, డే టైమ్ రన్నింగ్ లైట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు లోపల కర్వ్డ్ డిస్‌ప్లే, లైవ్ కాక్‌పిట్ ప్రొఫెషనల్ సెటప్, వెనుక ప్రయాణీకుల కోసం ఎగ్జిక్యూటివ్ క్లాస్ అమెంటిస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

BMW

వెనుక సీట్లను 42.5 డిగ్రీల వరకు వెనక్కి వాల్చే సౌకర్యం ఉంది. ఇది కాకుండా మసాజ్ సీట్లు, థియేటర్ లాంటి అనుభూతిని అందించే ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

ఈ కారులో BMW కంపెనీ 5వ తరం ఇ-డ్రైవ్ సెటప్ (e-Drive setup) అందించబడింది. ఇది 449 hp పవర్‌ను, 650 Nm టార్క్ సామర్థ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని కేవలం 5.5 సెకన్లలో అందుకుంటుంది. ఈ కారు పూర్తి ఛార్జ్‌పై 603 కి.మీ.ల దూరం ప్రయాణించగలదు.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: BMW కంపెనీ కారు ధరను ప్రజలకు అర్థమయ్యేలా, గందరగోళం లేకుండా చేయడం అభినందనీయం. ఈ ధరల విధానాన్ని ఇతర కార్లకు, ఇతర కంపెనీలు కూడా ఇలాంటి ధరల విధానాన్ని ప్రవేశపెడితే ఇది ఖచ్చితంగా ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, May 28, 2025, 15:50 [IST]
English summary
No extra penny bmw announces revolutionary new pricing for i7 electric car
Read more on: #bmw #india #auto #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+