సేఫ్టీ లేదని ఎలాంటి టెన్షన్ పడకండి.. రూ. 5.65 లక్షలకే లభించే ఈ కారులో ఇకపై 6 ఎయిర్‌బ్యాగ్స్!
"మారుతి కార్లలో సేఫ్టీ లేదు" అని ఇకపై ఎవరూ అనడానికి వీల్లేదు. మారుతి సుజుకి తన పాపులర్ కారు వాగన్‌ఆర్‌లో ఏకంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందిస్తోంది. కేవలం రూ. 5.65 లక్షల ప్రారంభ ధరతో వస్తున్న ఈ కారును కొనడానికి ఇంతకంటే మంచి కారణం ఇంకేం కావాలి చెప్పండి? ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ కథనంలో చూద్దాం.
మనదేశంలో ఓ నేషనల్ లెవల్ కారు అంటూ ఉందంటే అది నిస్సందేహంగా మారుతి సుజుకి వాగన్‌ఆర్ అవుతుంది. ఎన్నో ఏళ్లుగా సామాన్యుడి కారు కలలను నిజం చేస్తూ, అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్‌లలో ఇది ఒకటి. టాల్‌బాయ్ డిజైన్‌తో దశాబ్దాలు గడిచినా, ఇప్పటికీ తన ప్రజాదరణను ఏ మాత్రం కోల్పోకుండా కొనసాగుతున్న అతికొద్ది మోడళ్లలో వాగన్‌ఆర్ ఒకటి.

తక్కువ ధర, అద్భుతమైన మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, విశాలమైన ఇంటీరియర్, సులభమైన డ్రైవింగ్ వంటి అనేక కారణాలు ప్రజలను వాగన్‌ఆర్ వైపు ఆకర్షిస్తాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి మరొక ముఖ్యమైన అంశం చేరింది. మారుతి సుజుకి ఇప్పుడు దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందిస్తోంది.
మారుతి కార్లు సురక్షితం కావు అని విమర్శించే వారికి ఇది గట్టి సమాధానం కాబోతుంది. కొత్త వాగన్‌ఆర్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్ ఫీచర్‌గా రావడం నిజంగా ఒక విప్లవాత్మక మార్పు అని చెప్పవచ్చు. ఈ మోడల్ ప్రస్తుతం భారతదేశంలోని అన్ని సేఫ్టీ ప్రమాణాలను పూర్తిగా పాటిస్తూ మార్కెట్లోకి వస్తుంది.

ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు, వాగన్‌ఆర్‌లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), ఏబీఎస్, ఈబీడీ, సీట్ బెల్ట్ ప్రీ-టెన్షనర్‌లు, ఫోర్స్ లిమిటర్లు, బజర్‌తో కూడిన సీట్ బెల్ట్ రిమైండర్, స్పీడ్ అలెర్ట్ సిస్టమ్, స్పీడ్ సెన్సిటివ్ ఆటో డోర్ లాక్, రియర్ పార్కింగ్ సెన్సర్‌లు, చైల్డ్ ప్రూఫ్ రియర్ డోర్ లాక్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లను కూడా మారుతి సుజుకి అందిస్తోంది.
ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే.. 6 ఎయిర్‌బ్యాగ్‌లను చేర్చినప్పటికీ కంపెనీ ధరను పెంచలేదు. కొత్త మారుతి వాగన్‌ఆర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.65 లక్షల నుంచి రూ. 8.50 లక్షల వరకు ఉంది. కొత్త భద్రతా ఫీచర్లను చేర్చడంతో పాటు, కంపెనీ ఈ ఫ్యామిలీ కారులో ఇతర ముఖ్యమైన మార్పులేమీ చేయలేదు. ఈ వాహనం 1.0 లీటర్ త్రీ-సిలిండర్ పెట్రోల్, 1.2 లీటర్ ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది.

1.2 లీటర్ ఇంజన్ 83 bhp పవర్, 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. అదే సమయంలో 1.0 లీటర్ 3-సిలిండర్ యూనిట్ 66.62 bhp పవర్‌తో 89 Nm టార్క్‌ను అందిస్తుంది. ఇందులో సీఎన్‌జీ బై-ఫ్యూయల్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ కారులో 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎంటీ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లను ఎంచుకోవచ్చు.
మైలేజ్ విషయానికి వస్తే, వాగన్‌ఆర్ పెట్రోల్ లీటరుకు 25.19 కిలోమీటర్ల ఇంధన సామర్థ్యాన్ని, సీఎన్‌జీ లీటరుకు 33.48 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది అని కంపెనీ పేర్కొంది. ఈ కారు LXI, VXI, ZXI, ZXI ప్లస్ అనే నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అన్ని మోడళ్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా లభించడం వల్ల ఈ కారు అమ్మకాలు మరింత పెరుగుతాయని చెప్పడంలో సందేహం లేదు.
7-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్ కంట్రోల్‌లు, టాకోమీటర్, రిమోట్ సెంట్రల్ లాకింగ్ వంటి ఆధునిక ఫీచర్లతో వస్తున్న మారుతి సుజుకి వాగన్‌ఆర్ డబ్బుకు తగిన విలువను అందిస్తుంది. ఇక ZXI+ టాప్ ఎండ్ వేరియంట్‌లో 14-ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ ఫాగ్ లాంప్‌లు, రియర్ వైపర్, వాషర్ వంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








