215 కి.మీ. రేంజ్, స్టైలిష్ లుక్! ఇండియన్ మార్కెట్‌లోకి దూసుకొస్తున్న విన్‌ఫాస్ట్ VF3!
వెరైటీ డిజైన్‌తో, తక్కువ ధరలో వస్తున్న ఒక ఎలక్ట్రిక్ కారు ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది. వియత్నాంకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast) ఈ చిన్న కారును తయారు చేస్తోంది. ఈ కంపెనీ త్వరలో భారతీయ మార్కెట్‌లోకి ప్రవేశించడానికి రెడీ చేస్తోంది.
ఇందుకోసం తమిళనాడులోని తూత్తుకుడిలో భారీ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా నిర్మిస్తోంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కంపెనీ సరికొత్త 'VF3' పేరుతో ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ను ప్రదర్శించింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. 'టాటా నానో' కంటే కూడా చిన్నగా ఉండే ఈ కారు త్వరలోనే విడుదల కానుంది.

విన్‌ఫాస్ట్ VF3 (VinFast VF3) ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇది భారీ డిమాండ్‌ను కలిగి ఉంది. ఈ కారును కేవలం రెండు నెలల క్రితమే ఇండోనేషియాలో కూడా విడుదల చేయగా, అక్కడ ఏకంగా 400 యూనిట్లు అమ్ముడయ్యాయి. అక్కడ దీని ధర IDR 227.65 మిలియన్లు (సుమారు రూ.11.98 లక్షలు).
భారతీయ మార్కెట్‌లో ఈ కొత్త విన్‌ఫాస్ట్ VF3 EV ఈ ఏడాది అక్టోబర్ నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా, దీని ధర కూడా చాలా తక్కువగా ఉండవచ్చని భావిస్తున్నారు. సుమారు రూ.10 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర ఉండొచ్చని అంచనా. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి.

ఈ విన్‌ఫాస్ట్ VF3 ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ చాలా ఆధునికమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఆకర్షణీయమైన హెడ్‌లైట్లు, బ్లాక్ బంపర్‌లు, 'V' అక్షరంలా ఉండే టెయిల్ గేట్ దీని ప్రత్యేకతలు. ఈ కారు 3,190 మిమీ పొడవు, 1,679 మిమీ వెడల్పు, 1,652 మిమీ ఎత్తును కలిగి ఉంది. అలాగే 2,075 మిమీ వీల్‌బేస్‌తో వస్తుంది.
కొత్త విన్‌ఫాస్ట్ VF3 EV పవర్ ఫుల్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌ను కలిగి ఉంది. ఈ కారు 18.64 కిలోవాట్ (kWh) కెపాసిటీ కలిగిన బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 215 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ఇందులో ఉపయోగించిన ఎలక్ట్రిక్ మోటార్ 43.5 PS హార్స్‌పవర్, 110 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కొత్త విన్‌ఫాస్ట్ VF3 ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కేవలం 5.3 సెకన్లలో 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది రేర్ వీల్ డ్రైవ్ టెక్నాలజీని కలిగి ఉంది. ఈ కారులో నలుగురు వ్యక్తులు సులభంగా ప్రయాణించవచ్చు. 10-అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మాన్యువల్ AC, ఫ్రంట్ పవర్ విండోస్‌తో సహా అనేక ఫీచర్‌లను కలిగి ఉంది.
ఈ విన్‌ఫాస్ట్ VF3 ఎలక్ట్రిక్ కారు ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తుంది. సేఫ్టీ పరంగా మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) వంటి ఫీచర్లను కలిగి ఉంది. దేశీయంగా విడుదల కానున్న ఈ 'VF3' హ్యాచ్‌బ్యాక్‌కు MG కామెట్, టాటా టియాగో EV గట్టి పోటీనివ్వనున్నాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








