ఒక్క ఛార్జ్‌తో 300 కి.మీ! ధర కేవలం రూ.3.5 లక్షలు.. పెట్రోల్, డీజిల్, Cng ఆటోలకు ఇక గుడ్‌బై!

భారతదేశం ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకు అతిపెద్ద గమ్యస్థానంగా మారింది. ప్రపంచంలో ఉన్న ఆటోమొబైల్ కంపెలన్నీ కూడా మన దేశం వైపే చూస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం దేశీయంగా ప్రజలు క్రమంగా ఈవీలకు మారుతున్నారు. దీంతో డిమాండ్ మేరకు తయారీదారులు వరుసగా ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నారు. ఒకప్పుడు సింగిల్ ఛార్జ్‌తో 50 కిమీలు వెళ్ళే వాహనాలు ఉండగా, ఇప్పుడు టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. బ్యాటరీలపై కంపెనీలు ప్రత్యేకంగా దృష్టి సారించి హై కెపాసిటీ కలిగిన వాటిని అందిస్తున్నారు. వీటిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లచ్చు. ప్రస్తుతం కార్లలో ఇలాంటి వాటిని అందిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇదే టెక్నాలజీతో ఆటోరిక్షాలను కూడా లాంచ్ చేస్తున్నారు.

ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలు మధ్యస్ధ రేంజ్‌ను అందిస్తున్నాయి. అయితే వీటిని తలదన్నేలా ఏకంగా 300 కిమీలకు పైగా రేంజ్ ఇచ్చే ఒక కొత్త ఎలక్ట్రిక్ ఆటో రిక్షా ఇప్పుడు మార్కెట్లోకి అడుగుపెట్టింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన తయారీదారు ఒమేగా సేకి(Omega Seiki) ప్రైవేట్ లిమిటెడ్ తాజాగా ఈవీ ఆటో రిక్షాను విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ పేరు ఒమెగా సేకి ఎన్ఆర్జీ (Omega Seiki NRG).

300 Km Range Three Wheeler

దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇండియాలో ఇప్పటివరకు అమ్మకానికి అందుబాటులో ఉన్న మరే ఇతర త్రీ-వీలర్ వాహనం అందించని విధంగా ఒక్కసారి ఛార్జ్ చేసినట్లయితే ఎక్కడ ఛార్జింగ్ కోసం ఆగకుండా 300 కి.మీ వరకు ప్రయాణించగలగడం దీని స్పెషాలిటీ. ఈ రేంజ్ అందించడం కోసం ఈ ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలో 15 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఈ ఇ-ఆటో భారతీయ త్రీ వీలర్ విభాగంలో రేంజ్ పరంగా పెద్ద సంచలనం.

ఒమెగా సేకి ఎన్ఆర్జీ ధర కూడా సగటు పేద, మధ్యతరగతి వినియోగదారుడు కొనుగోలు చేసే విధంగా అతి తక్కువగా రూ.3.55 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. ఆన్‌రోడ్ వచ్చేసరికి కాస్త ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికి ఇది అందరికి అనుకూలమైన బడ్జెట్‌లో లభిస్తుంది. దేశంలో చాలా మంది తమ కుటుంబ పోషణ కోసం ఆటోరిక్షాలు నడుపుతుంటారు. ఇలాంటి వారికి బెస్ట్ ఆప్షన్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఎన్ఆర్జీ ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలో అందించిన ఎలక్ట్రిక్ మోటార్ గురించి చూసినట్లయితే ఇది 12.8 kW పవర్‌ను, 430 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 47 కి.మీలు మాత్రమే. ఇది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అయినప్పటికి పెర్ఫామెన్స్ విషయంలో ఎలాంటి రాజీ పడదని కంపెనీ పేర్కొంటుంది. ఎక్కువ రేంజ్‌ను అందించడం కోసం తక్కువ సామర్థ్యం గల మోటారును అమర్చారు.

ఈ ఎలక్ట్రిక్ ఆటోరిక్షా 45 నిమిషాల ఛార్జింగ్‌తో 150 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. అయితే ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా ఇది వీలవుతుంది. ఇ-ఆటో కొనుగోలుదారులకు కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వినియోగదారులకు ఐదేళ్లు లేదా 2 లక్షల కిలోమీటర్ల వారంటీ ప్లాన్‌ను ఇస్తున్నట్టు పేర్కొంది. ఒమెగా సేకి కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరంలోనే 5,000 యూనిట్లకు పైగా విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Take a Poll

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, March 19, 2025, 10:55 [IST]
English summary
Omega seiki 300 km range nrg electric three wheeler launched in india at rs 3 55 lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+