కార్లు, బస్సులు అవసరం లేదు..ఒక్కసారి ఛార్జి చేసుకుని దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లొచ్చు

ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతుంది. ఈ వృద్ధికి అనుగుణంగా కంపెనీలు తమతమ మోడల్స్‎ను మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి. కార్లు, బైకుల మాదిరి ఎలక్ట్రిక్ ఆటోలు కూడా మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒమేగా సీకి కంపెనీ ఇటీవల NRG ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌ను విడుదల చేసింది. ఈ వాహనం చాలా స్పెషాలిటీలను కలిగి ఉంది. మార్కెట్‌లో కొత్త సంచలనాన్ని సృష్టించే అవకాశం ఉంది.

ఒమేగా ఇటీవల ఇండియాలో సీకి NRG ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌ను విడుదల చేసింది. 3-వీలర్ డ్రైవర్స్ ప్రతి రోజూ 100నుంచి 150కి.మీ. మేర డ్రైవ్ చేస్తారు కాబట్టి, అధిక మైలేజీని అందించే ఎలక్ట్రిక్ 3-వీలర్స్ నేడు తప్పనిసరి. రద్దీ సమయాల్లో సగటున రోజుకు 200 కి.మీ. వరకు ప్రయాణిస్తుంటాయి. ఈ విషయంలో ఇండస్ట్రీలో అగ్రగామిగా ఉన్న ఒమేగా సీకి NRG e-3W ఈ విభాగంలోని డ్రైవర్లకు మంచి వాహనంగా చెప్పవచ్చు.

Omega Sei ki

ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 కి.మీ.ల రేంజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. త్రీ-వీలర్ డ్రైవర్లు ప్రతిరోజూ 100 నుండి 150 కి.మీ వరకు ప్రయాణిస్తారు, కాబట్టి ఇది వారికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి 5,000 ఒమేగా సీకి NRG ఎలక్ట్రిక్ ప్యాసింజర్ త్రీ-వీలర్స్ విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఒమేగా సీకి కంపెనీ ఈ త్రీ వీలర్‎ను ప్రధానంగా ఫ్లీట్ యజమానులు, డ్రైవర్లు, చిన్న వ్యాపారాలను నిర్వహించే వారిని దృష్టిలో ఉంచుకుని రూపొందించింది. ఈ వాహనం పర్యావరణ అనుకూలమైనది, ఇంధన ఆధారిత వాహనాలకు మంచి ప్రత్యామ్నాయం. ఒమేగా సీకి NRG ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ భారతదేశ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లో కొత్త మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.

NRG Three Wheeler

ఆ కంపెనీ ఢిల్లీ NCR, పూణేలలో పెద్ద ఎత్తున తయారీ సౌకర్యాలను ఏర్పాటు చేసింది. ఇప్పుడు చెన్నైలో విస్తరించాలని చూస్తుంది. ప్రస్తుతం భారతదేశం అంతటా 250 కి పైగా డీలర్‌షిప్‌లు ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఈ కంపెనీ తన ప్రొడక్ట్స్ పోర్ట్‌ఫోలియోలో ఎలక్ట్రిక్ 2,3, 4 వీలర్ వెహికల్స్ కలిగి ఉన్న మొదటి సంస్థ. కంపెనీ ఈ వాహనాన్ని రూ. 3.55 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు విడుదల చేసింది.

ఇది పేటెంట్ పొందిన కాంపాక్ట్ 15 kWh బ్యాటరీ ప్యాక్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది ఐదేళ్ల బ్యాటరీ లైఫ్‌తో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ త్రీ వీలర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 కి.మీ ప్రయాణించగలదు. ఇది ఇండియాలో వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. డిందని కంపెనీ తెలిపింది.

Omega Sei ki NRG Three Wheeler

ఒమేగా సీహార్స్, NRG క్లీన్ ఎలక్ట్రిక్ అభివృద్ధి చేసిన 15 kWh LFP బ్యాటరీ ప్యాక్ అయిన FLO 150 ద్వారా పవర్ పొందుతుంది. ఈ బ్యాటరీ క్లీన్ ఎలక్ట్రిక్ కొత్త డైరెక్ట్ కాంటాక్ట్ లిక్విడ్ కూల్డ్ (DCLC) సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది అద్భుతమైన థర్మల్ మేనేజ్ మెంట్, కంప్లీట్ ప్రొటెక్షన్ అందిస్తుందని కంపెనీ నమ్మకంగా చెబుతుంది.

స్పెషల్ ఫీచర్స్ : ఈ ఎలక్ట్రిక్ వెహికల్‎ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 కి.మీ. రేంజ్ అందించే కెపాసిటీ, ప్రాఫిటబిలిటీపరంగా ఫ్లీట్ యజమానులు, డ్రైవర్లు, చిన్న వ్యాపారాలకు ఒక పెద్ద గేమ్ ఛేంజర్ అవుతుంది. యూనివర్సల్ పబ్లిక్ భారత్ DC-001 ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఈ వాహనాన్ని కేవలం 45 నిమిషాల్లో 150 కి.మీ.ల రేంజ్‌కు ఛార్జ్ చేయగలదు.

రూ. 3.55 లక్షల బడ్జెట్ ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న ఈ వెహికల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 కి.మీ.లు ప్రయాణించగలదు. మంచి పర్ఫామెన్స్ కోసం 15 kWh లాంగ్ రేంజ్ బ్యాటరీ ప్యాక్ అందించారు. దీర్ఘకాలిక మన్నికను నిర్ధారించడానికి 5 సంవత్సరాల లేదా 2,00,000 కి.మీ వారంటీని కూడా కంపెనీ అందిస్తోంది.

More from DriveSpark

Article Published On: Monday, March 24, 2025, 10:30 [IST]
English summary
Omega seiki launches nrg electric three wheeler with 300km range
Read more on: #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+