32 కి.మీ పైగా మైలేజ్, రూ. 6.49 లక్షలు, 5 సీట్లు - ఈ మారుతి కారు కోసం ఎగబడుతున్న కొనుగోలుదారులు!

చిన్నదే కానీ దీని లుక్స్ అందరినీ అట్రాక్ట్ చేస్తుంటాయి. ప్రతి ఒక్కరి హృదయాన్ని గెలుచుకున్న మారుతి సుజుకి స్విఫ్ట్ మరోసారి వార్తల్లో నిలిచింది. తన స్టైలిష్ లుక్, అద్భుతమైన మైలేజ్, సరసమైన ధరతో ఎన్నో ఏళ్లుగా భారతీయ కార్ మార్కెట్‌ను ఏలుతున్న ఈ హ్యాచ్‌బ్యాక్.. తాజాగా విడుదలైన అమ్మకాల గణాంకాలతో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది.

మధ్యతరగతి ప్రజల ఆశాకిరణంలా, నగర వీధుల్లో దూసుకుపోయే చురుకైన నేస్తంలా స్విఫ్ట్ అందరికీ దగ్గరైంది. మారుతి సుజుకి స్విఫ్ట్ ఒక పాపులర్ హ్యాచ్‌బ్యాక్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాని ఆకర్షణీయమైన డిజైన్, అత్యాధునిక ఫీచర్లతో ఇది మార్కెట్‌లో మంచి సంఖ్యలో అమ్ముడవుతోంది.

Maruti Suzuki Swift Review

తాజాగా విడుదలైన మార్చి 2025 కార్ల అమ్మకాల గణాంకాల ప్రకారం, దేశీయ మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో కొత్త 'స్విఫ్ట్' రెండవ స్థానంలో నిలిచింది. హ్యుందాయ్ క్రెటా (18,059 యూనిట్లు) మొదటి స్థానంలో ఉంది. గత నెల (మార్చి 2025)లో మారుతి సుజుకి ఇండియా ఏకంగా 17,746 యూనిట్ల స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లను విజయవంతంగా విక్రయించింది.

2024 మార్చిలో విక్రయించిన 15,728 యూనిట్లతో పోలిస్తే, ఏడాది ప్రాతిపదికన 13శాతం వృద్ధిని నమోదు చేసింది.ఇది మాత్రమే కాదు, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 16,269 యూనిట్లు, జనవరిలో 17,081 యూనిట్ల స్విఫ్ట్ కార్లు అమ్ముడయ్యాయి. 2024 చివరి మూడు నెలల్లో కూడా 'మారుతి స్విఫ్ట్' హ్యాచ్‌బ్యాక్‌లు మంచి అమ్మకాలు సాధించాయి.

Maruti Suzuki Swift Front

డిసెంబర్‌లో 10,421 యూనిట్లు, నవంబర్‌లో 14,737 యూనిట్లు, అక్టోబర్‌లో 17,539 యూనిట్లను విక్రయించింది. ప్రస్తుతం దేశీయంగా కొనుగోలుకు అందుబాటులో ఉన్న కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ప్రారంభ ధర రూ. 6.49 లక్షలు, గరిష్ట ధర రూ. 9.64 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది ఎల్‌ఎక్స్‌ఐ, వీఎక్స్‌ఐ, వీఎక్స్‌ఐ (ఓ), జెడ్‌ఎక్స్‌ఐ & జెడ్‌ఎక్స్‌ఐ ప్లస్ అనే వివిధ వేరియంట్లలో లభిస్తుంది.

సిజ్లింగ్ రెడ్, లస్టర్ బ్లూ, నావెల్ ఆరెంజ్, మాగ్మా గ్రే, స్ప్లెండిడ్ సిల్వర్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో కూడా అందుబాటులో ఉంది. ఈ కారు లోపల, వెలుపల చాలా ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఇందులో 5 సీట్లు ఉండటం వల్ల ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. వారాంతాల్లో, సెలవుల్లో ఎక్కువ సామాను తీసుకెళ్లడానికి 265 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది.

Maruti Suzuki Swift Engine

కొత్త మారుతి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ 1.2-లీటర్ పెట్రోల్ & సీఎన్‌జీ ఇంజన్ ఆప్షన్‌లతో వస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్/ 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపిక కూడా ఉంది. ఈ కారు బైక్‌కు ఏ మాత్రం తీసిపోని ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంది, లీటరుకు 24.8 నుండి 32.85 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది.

కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ కారు అనేక ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంది. ముఖ్యంగా ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్-ఇన్‌స్ట్రుమెంట్ క్లస్ట, వైర్‌లెస్ ఛార్జర్ వంటివి ఉన్నాయి. సేఫ్టీ కోసం ఈ కారు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈబీడీ (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లను కలిగి ఉంది.

Maruti Suzuki Swift Boot Space

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, April 8, 2025, 15:15 [IST]
English summary
Over 32 km mileage 6 49 lakh 5 seater buyers flock to this maruti car
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+