మీర్జాపూర్ గద్దె కింద ఇప్పుడు కార్ సీటు.. కాలీన్ భయ్యాకు కొత్త బాధ్యతలు ఇచ్చిన హ్యుందాయ్
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ (Hyundai), భారతదేశంలో తనకు ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. కస్టమర్ నమ్మకాన్ని గెలుచుకోవడంలో ఈ బ్రాండ్ అగ్రగామిగా నిలుస్తోంది. భారత మార్కెట్‌లో పెద్ద కస్టమర్ బేస్‌ను కలిగి ఉండటం ద్వారా, హ్యుందాయ్ తన వ్యాపార విస్తరణకు ఇది ఒక ముఖ్యమైన కేంద్రంగా మారిందని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 193 దేశాలలో హ్యుందాయ్ కార్లు అమ్ముడవుతున్నప్పటికీ, భారతదేశం సంస్థకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన మార్కెట్లలో ఒకటిగా నిలిచింది. దేశంలో మధ్యతరగతి ప్రజలు కొనగలిగే విధంగా అందుబాటు ధరలో, లేటెస్ట్ టెక్నాలజీ, ఆకట్టుకునే డిజైన్‌తో హ్యుందాయ్ తన ఉత్పత్తులను రూపొందిస్తుంది. దేశీయంగా టాటా మోటార్స్, మారుతీ సుజుకీ వంటి తయారీదారులకు పోటీగా అమ్మకాలను పెంచుకోవడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తుంది.
ప్రస్తుతం, భారతదేశంలో హ్యుందాయ్ నెలకు సుమారు 50,000 కార్లను విక్రయిస్తోంది. ఇది ఇప్పటికే మంచి సంఖ్యైనా, సంస్థ దీనిని మరింతగా పెంచే దిశగా యత్నిస్తోంది. విక్రయాలను పెంచేందుకు హ్యుందాయ్ వ్యూహాత్మక చర్యలు తీసుకుంటోంది. వెనుకబడిన ప్రాంతాల్లో డీలర్ నెట్‌వర్క్ విస్తరణ, ఆన్‌లైన్ కొనుగోలు అవకాశాలు, ఫైనాన్స్ వంటి అనేక సేవలను అందుబాటులోకి తెస్తోంది. అంతేకాకుండా, కొత్త మోడళ్లను ప్రవేశపెట్టడం, ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి వంటి అంశాలపైన కూడా దృష్టి సారించింది.

ఈ విధంగా, భారత మార్కెట్‌పై హ్యుందాయ్ పెట్టుబడి పెంచుతూ, వినియోగదారులకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. వీటితో పాటు హ్యుందాయ్ తన మార్కెటింగ్ వ్యూహాన్ని మరింత బలపర్చే క్రమంలో ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠిని తన బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఇది హ్యుందాయ్ తీసుకున్న మరో కీలక అడుగు. దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన నటుడైన పంకజ్ త్రిపాఠి, తన సహజమైన నటనతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు.
బీహార్ రాష్ట్రంలోని ఒక చిన్న గ్రామంలో జన్మించిన ఆయన, ఎంతో కష్టపడుతూ సినిమారంగంలో తనదైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌లలో తన సహజ నటనతో విశేషంగా మెప్పించిన పంకజ్ త్రిపాఠి తెలుగులో కూడా నటించారు. ముఖ్యంగా మీర్జాపూర్ అనే డబ్బింగ్ వెబ్‌సిరీస్ ద్వారా దేశవ్యాప్తంగానే కాకుండా తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు. ఇప్పుడు ఈయన ద్వారా హ్యుందాయ్ తన మార్కెటింగ్‌ను మరింత పెంచుకోవాలని చూస్తుంది.

వినియోగదారులను చేరువ అయ్యేలా పంకజ్ త్రిపాఠి తోడ్పాటు చేయగలరన్న నమ్మకంతో హ్యుందాయ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక, ఆయన నటించిన తాజా చిత్రం 'థగ్ లైఫ్' జూన్ 5న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా పంకజ్ త్రిపాఠి అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపే అవకాశం ఉంది. ఒకవేళ ఈ చిత్రం విజయవంతమైతే, హ్యుందాయ్ బ్రాండ్ ప్రతిష్ఠకు కూడా అదనపు గిరాకీ రావడం ఖాయం.
ఈ విధంగా, తన వ్యాపారాన్ని మరింత పెంచే ప్రయత్నంలో హ్యుందాయ్ ఇండియా, పంకజ్ త్రిపాఠిని బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసింది. పంకజ్ త్రిపాఠి, హ్యుందాయ్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన సందర్భంలో ఎంతో ఉద్వేగంతో మాట్లాడారు. ఈ కొత్త బాధ్యతను స్వీకరిస్తూ ఆయన ఓ భావోద్వేగపూరితమైన విషయాన్ని గుర్తు చేసుకున్నారు, తన జీవితంలో తొలి కారు హ్యుందాయ్ బ్రాండ్ నుంచే కొనుగోలు చేశానని తెలిపారు.

"నా మొదటి కారు హ్యుందాయ్ నుండి వచ్చింది," అంటూ తన గుర్తులను పంచుకున్న త్రిపాఠి, ఈ బ్రాండ్‌కు ఉన్న ప్రత్యేకత గురించి కూడా వివరించారు. "చాలా కాలంగా నమ్మకం, ఆవిష్కరణ, కస్టమర్ అవసరాలను అర్థం చేసుకుని వారికి అనుకూలమై వాహనాలను అందిస్తూ, వారి తరపున నిలబడిన హ్యుందాయ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించబడటం నాకు గౌరవంగా ఉంది," అని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications








