అత్యాధునిక డిజైన్, అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లు.. రేసింగ్ లవర్స్ కోసం మినీ కంట్రీమ్యాన్ వచ్చేశాడు

ఒక కొత్త ఎస్‌యూవీ కొనాలని చూస్తున్నారా? అయితే భారత మార్కెట్‌లోకి లేటెస్టుగా ఎంట్రీ ఇచ్చిన ఒక కొత్త మోడల్ గురించి తెలుసుకోవాల్సిందే. బ్రిటీష్ బ్రాండ్ అయిన మిని, 2025లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన కార్లలో ఒకటైన మిని కంట్రీమ్యాన్ JCW ఆల్-4 (MINI Countryman JCW All-4) ని విడుదల చేసింది. అద్భుతమైన పవర్‌తో పాటు, ఆకర్షణీయమైన డిజైన్, అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లతో వస్తున్న ఈ కొత్త ఎస్యూవీ ధర, పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఒక శక్తివంతమైన, లగ్జరీ ఎస్యూవీ కొనాలని కలలు కనేవారికి నిజంగా గుడ్‎న్యూస్. బ్రిటిష్ బ్రాండ్ అయిన MINI, భారత మార్కెట్లో తమ రేసింగ్ ప్రపంచానికి ప్రతీకగా నిలిచే కంట్రీమ్యాన్ JCW ALL4ను విడుదల చేసింది. 2025లో ఎక్కువ మంది ఎదురుచూసిన కార్లలో ఇది ఒకటి.

Performance King MINI Countryman JCW ALL4 Launched in India Priced at Rs 64 90 Lakh

అద్భుతమైన పర్ఫార్మెన్స్, ఆకర్షణీయమైన ఫీచర్లు, అత్యుత్తమ భద్రతా వ్యవస్థలతో వస్తున్న ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.64.90 లక్షలుగా ఉంది. ఈ కొత్త కారు గురించి తెలుసుకోవలసిన పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం.

పవర్, ఇంజిన్ పర్ఫార్మెన్స్
మినీ కంట్రీమ్యాన్ JCW ALL4 ముఖ్య ఆకర్షణ దాని పవర్ఫుల్ ఇంజిన్. ఇందులో 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది ఏకంగా 300 హార్స్‌పవర్ (hp), 400 Nm పీక్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్, ఆల్-వీల్ డ్రైవ్ (ALL4) సిస్టమ్‌తో వస్తుంది.

Performance King MINI Countryman JCW ALL4 Launched in India Priced at Rs 64 90 Lakh

ఈ కలయిక అద్భుతమైన యాక్సిలరేషన్‌ను అందిస్తుంది. ఇంజిన్ మ్యాపింగ్‌ను ఆప్టిమైజ్ చేయడం, మెరుగైన ఏరోడైనమిక్ డిజైన్ కారణంగా ఇది మంచి మైలేజీని కూడా అందిస్తుంది.

డిజైన్, లుక్
ఈ ఎస్యూవీ డిజైన్ రేసింగ్ నేపథ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ముందు భాగంలో చెకర్డ్ ఫ్లాగ్ మోటిఫ్, పెద్ద ఎయిర్ ఇన్‌టేక్‌లు ఉన్న బ్లాక్-అవుట్ గ్రిల్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఫ్రంట్ బంపర్, ఎల్ఈడీ హెడ్‌లైట్లు అథ్లెటిక్ లుక్‌ను ఇస్తాయి.

Performance King MINI Countryman JCW ALL4 Launched in India Priced at Rs 64 90 Lakh

సైడ్ నుంచి చూస్తే 5-స్పోక్ అల్లాయ్ వీల్స్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు బోల్డ్ లుక్‌ను అందిస్తాయి. వెనుక భాగంలో క్వాడ్ ఎగ్జాస్ట్ టిప్స్, డిఫ్యూజర్-స్టైల్ బంపర్, పెద్ద రూఫ్ స్పాయిలర్ ఉండటం వలన ఇది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

ప్రీమియం ఇంటీరియర్, టెక్ ఫీచర్లు
మినీ కంట్రీమ్యాన్ జేఎస్‎డబ్ల్యూ క్యాబిన్ అద్భుతమైన డిజైన్, నాణ్యమైన మెటీరియల్‌తో రూపొందించబడింది. ఇందులో MINI OS9 తో కూడిన 9.4-అంగుళాల OLED టచ్‌స్క్రీన్ ఉంటుంది. లోపల లెదర్ అప్‌హోల్‌స్టరీ, ఎరుపు రంగు స్టిచింగ్‌తో కూడిన JCW స్పోర్ట్ సీట్లు, అల్యూమినియం లేదా కార్బన్-ఫైబర్ యాక్సెంట్లు లభిస్తాయి.

Performance King MINI Countryman JCW ALL4 Launched in India Priced at Rs 64 90 Lakh

కంఫర్ట్ కోసం మెమరీ ఫంక్షన్‌తో ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేయగలిగే ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉన్నాయి. అంతేకాక, హర్మాన్ కార్డాన్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, హెడ్-అప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ వంటి అధునాతన టెక్నాలజీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

అత్యుత్తమ భద్రతా వ్యవస్థ
ప్రయాణీకుల భద్రత కోసం మినీ కంట్రీమ్యాన్ జేఎస్‎డబ్ల్యూలో అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్లను అందించారు. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ (DSC), ట్రాక్షన్ కంట్రోల్ వంటివి ఉన్నాయి.

Performance King MINI Countryman JCW ALL4 Launched in India Priced at Rs 64 90 Lakh

ముఖ్యంగా ప్రమాదాలు జరగకుండా నివారించడానికి లేన్ డిపార్చర్ వార్నింగ్ (లేన్-కీపింగ్ అసిస్ట్‌తో), బ్లైండ్-స్పాట్ డిటెక్షన్, బ్రేక్ ఇంటర్‌వెన్షన్‌తో కూడిన ఫ్రంట్ కొలిజన్ వార్నింగ్ వంటి అడ్వాన్సుడ్ సిస్టమ్స్ ఉన్నాయి. వీటితో పాటు రియర్ క్రాస్-ట్రాఫిక్ అలర్ట్, 360-డిగ్రీ కెమెరా, హిల్ హోల్డ్ అసిస్ట్, క్రాష్ సెన్సార్‌లు కూడా ఈ ఎస్యూవీలో లభిస్తాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, October 15, 2025, 7:16 [IST]
English summary
Performance king mini countryman jcw all4 launched in india priced at rs 64 90 lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+