Auto Expo 2025 Event: ప్రధాని మోదీ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభం కానున్న అతిపెద్ద ఆటో ఎక్స్‌పో ఈవెంట్
ప్రపంచవ్యాప్తంగా వాహన పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్ ఈ రోజు ఎంతో ఘనంగా ప్రారంభం కానుంది. జనవరి 17 నుంచి మొదలు అవుతున్న కార్యక్రమం 22 జనవరి 2025 వరకు జరుగుతుంది. ప్రగతి మైదాన్‌లోని భారత్ మండప వేడుక ప్రారంభానికి సిద్ధం అయింది. ఈ షోను సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM)నిర్వహిస్తుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం 10 గంటలకు ఈ వేడుకును ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 5 లక్షల మందికి పైగా వస్తారని అంచనా. దీనిలో వాహన తయారీ కంపెనీలు తమ వాహనాలను ఆవిష్కరించబోతున్నాయి. ఇప్పటికే తయారీదారులు అక్కడికి చేరుకుని తమ బైక్స్, స్కూటర్లు, కార్లు, బస్సులు, వాణిజ్య వాహనాలను లాంచ్ చేయడానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్నారు.
ఈ ఈవెంట్‌లో దాదాపు దేశీయ, అంతర్జాతీయంగా 50కి పైగా కంపెనీలు పాల్గొంటున్నాయి. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో జరుగుతున్న ఈ ఈవెంట్‌కు రావాలనుకున్న వారు ప్రైవేటు వాహనాలు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ద్వారా చేరుకోవడానికి అవకాశం ఉంది. ఈ మండపానికి దగ్గరలో సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్ కూడా ఉంది. అక్కడి నుంచి నడక మార్గంలో కూడా ఈవెంట్‌కు చేరుకోవచ్చు.

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఆటో ఎక్స్‌పోలో పాల్గొనడానికి ఈవెంట్ నిర్వాకులు ఎలాంటి ఫీజు వసూలు చేయడం లేదు. ఈ కార్యక్రమానికి వెళ్లాలనుకునే వారు అధికారిక వెబ్‌సైట్ www.bharat-mobility.comని ఓపెన్ చేసి ఉచితంగా ఎంట్రీ పాస్‌లు పొందవచ్చు. మరో విషయం ఏమిటంటే జనవరి 17 నుంచి మొదలయి = 22 వరకు కూడా జరుగుతున్న కార్యక్రమంలో 17, 18 తేదీల్లో మీడియాకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది.
సాధారణ ప్రజలు ఈ ఈవెంట్‌ను సందర్శించాలనుకుంటే ఉచిత ఎంట్రీ పాస్‌ల ద్వారా జనవరి 19 నుండి 22 వరకు ఈ ఈవెంట్‌ను చూడవచ్చు. భారత్‌లో వాహన రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది. దీంతో ప్రపంచ దేశాల చూపు భారత్‌పై పడింది. కేంద్రం భారత్‌ను ఆటోమొబైల్ హాబ్‌గా మార్చడానికి కృత నిశ్చయంతో ఈ ఈవెంట్‌ను అట్టహసంగా నిర్వహిస్తుంది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం 10 గంటలకు ఈ వేడుకను ప్రారంభించిన తరువాత తయారీదారుల వాహనాలను సందర్శిస్తారు. వారి దగ్గర నుంచి పలు విషయాలను తెలుసుకుంటారు. మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. కొత్త కార్లు, వాణిజ్య వాహనాలు, టూవీలర్ల, రాక, వాటి కాన్సెప్ట్‌ల గురించి అందరికి తెలియజేసే ప్రెస్ కాన్ఫరెన్స్‌లు మధ్యాహ్నం 1:15 గంటలకు ప్రారంభమవుతాయి.
మారుతీ సుజుకీ ఎలక్ట్రిక్ కారు ఇ-విటారాతో ప్రారంభించి రాత్రి 7:30 గంటలకు స్కోడా వోక్స్‌వ్యాగన్ ఇండియాతో ఈ రోజు కార్యకలాపాలకు ముగింపు ఇస్తారు. ఈ రోజు హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు, MG కొత్త ప్రీమియం సెలెక్ట్ ఆఫర్లు సైబర్‌స్టర్, హారియర్ EV,సఫారి, హీరో టూవీలర్లు విడుదల కాబోతున్నాయి. ఈ ఆటో ఎక్స్‌పోకి సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ కోసం మా డ్రైవ్‌స్పార్క్ సోషల్ మీడియా పేజీలను ఫాలో అవ్వండి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.


Click it and Unblock the Notifications








