ఒకప్పుడు హిట్టు.. ఇప్పుడెందుకు ఫట్టు?.. టాటా కంపెనీ ఆ మోడల్‎ను జనాలు ఎందుకు కొనట్లేదు?

టాటా హారియర్... ఈ పేరు వింటేనే ఒక బలమైన, పవర్ఫుల్ ఎస్‌యూవీ మన కళ్లముందు కదలాడుతుంది. తన అద్భుతమైన డిజైన్, అత్యాధునిక ఫీచర్లతో ఈ కారు ఎంతో మంది ఆటోమొబైల్ ప్రేమికుల మనసులను కొల్లగొట్టింది. భద్రత విషయంలో కూడా టాటా హారియర్‌కు తిరుగులేని పేరుంది. అందుకే ఒకప్పుడు చాలా మంది కస్టమర్లు ఈ ఎస్‌యూవీని తమ సొంతం చేసుకోవడానికి ఎగబడ్డారు.

అయితే, గత కొన్ని నెలలుగా ఈ పాపులర్ ఎస్‌యూవీ అమ్మకాల గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. మార్చి 2025లో కూడా ఇదే నిరాశపరిచే పరిస్థితి కనిపించింది. ఇంతకీ ఈ శక్తివంతమైన ఎస్‌యూవీని కొనేవారు తగ్గిపోవడానికి అసలు కారణాలేంటో లోతుగా ఈ కథనంలో తెలుసుకుందాం.

Tata Harrier Sales

గత నెల అంటే మార్చి 2025లో టాటా మోటార్స్ దేశవ్యాప్తంగా కేవలం 1,265 యూనిట్ల హారియర్ ఎస్‌యూవీలను మాత్రమే విక్రయించగలిగింది. సరిగ్గా ఏడాది క్రితం అంటే 2024 మార్చిలో ఏకంగా 2,054 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే కేవలం ఒక్క సంవత్సరంలోనే అమ్మకాలు ఏకంగా 38 శాతం కుప్పకూలాయి. ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయం.

ఈ ఏడాది మొదటి రెండు నెలలైన జనవరి, ఫిబ్రవరిలో కూడా టాటా హారియర్ అమ్మకాలు ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. ఫిబ్రవరిలో కేవలం 1,376 యూనిట్లు, జనవరిలో 1,488 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంతకుముందు నెలలైన గత ఏడాది డిసెంబర్‌లో 1,307 యూనిట్లు, నవంబర్‌లో 1,374 యూనిట్లు, అక్టోబర్‌లో 1,947 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి.

Tata Harrier FRont

ఈ గణాంకాలను చూస్తుంటే హారియర్ అమ్మకాలు క్రమంగా తగ్గుతున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. ఇంత భారీ స్థాయిలో టాటా హారియర్ అమ్మకాలు పడిపోవడానికి గల కచ్చితమైన కారణాలను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. కానీ, ఆటోమొబైల్ రంగంలోని నిపుణులు, విశ్లేషకులు కొన్ని ముఖ్యమైన కారణాలను ఊహిస్తున్నారు.

మార్కెట్‌లో ఇతర ఆటోమొబైల్ కంపెనీల నుండి వస్తున్న తీవ్రమైన పోటీ ఒక ప్రధాన కారణం కావచ్చు. అంతేకాకుండా, టాటా హారియర్ ధర దాని ప్రత్యర్థులతో పోలిస్తే కాస్త ఎక్కువగా ఉండటం కూడా అమ్మకాలు తగ్గడానికి ఒక కారణంగా భావిస్తున్నారు. కొత్త టాటా హారియర్ ప్రత్యేకతలు ఏమిటంటే: ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర దాదాపు రూ. 15 లక్షల నుండి మొదలవుతుంది.

Tata Harrier Inner

ఇక టాప్-ఎండ్ వేరియంట్ ధర అయితే ఏకంగా రూ. 26.50 లక్షల వరకు పలుకుతోంది (ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమే). ఈ కారులో ఐదుగురు సౌకర్యవంతంగా కూర్చొని దూర ప్రయాణాలు చేయవచ్చు. ఎక్కువ లగేజీ పెట్టుకోవడానికి వీలుగా 445 లీటర్ల విశాలమైన బూట్ స్పేస్‌ను కూడా కలిగి ఉంది.

ఈ పవర్ఫుల్ ఎస్‌యూవీ 2-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లతో లభిస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే, ఇది లీటరుకు 14.60 కిలోమీటర్ల నుండి 16.8 కిలోమీటర్ల వరకు ఇస్తుంది. కొత్త హారియర్ ఎస్‌యూవీ తన మునుపటి మోడల్ కంటే మరింత ఆకర్షణీయమైన, స్టైలిష్ డిజైన్‌ను కలిగి ఉంది.

Tata Harrier Sales Decline

ఇది సన్‌లిట్ యెల్లో, కోరల్ రెడ్, పెబల్ గ్రే, లూనార్ వైట్, ఒబెరన్ బ్లాక్, సీవీడ్ గ్రీన్ వంటి అనేక రంగుల్లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది. పవర్ ఫుల్ టాటా హారియర్‌లో అనేక అత్యాధునిక, ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.

ముఖ్యంగా టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ చార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తాయి. భద్రత విషయానికి వస్తే, ఇందులో ఏకంగా 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏడీఏఎస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), 360-డిగ్రీ కెమెరా వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, April 16, 2025, 14:06 [IST]
English summary
Powerful but unpopular why this famous tata suv is losing buyers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+