తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లతో 7సీటర్ కారు కావాలా.. అయితే మారుతి ఈ మోడల్ కొనేయండి
మారుతి సుజుకి ప్రస్తుతం ఇండియాలో నంబర్ వన్ కార్ ఆటోమొబైల్ బ్రాండ్‌గా కొనసాగుతోంది. వినియోగదారుల బడ్జెట్‌కు అనుగుణంగా అందుబాటు ధరలో కార్లను అందిస్తూ అన్ని వర్గాల ప్రజలను ఆకర్షిస్తోంది. మారుతి సుజుకి మధ్యతరగతి కార్లను మాత్రమే కాకుండా, ప్రీమియం కార్లను కూడా అందిస్తోంది. వీటిని తన నెక్సా డీలర్‌ల ద్వారా విక్రయిస్తుంది.
మంచి సౌకర్యాలతో పెద్ద కుటుంబం ప్రయాణించడానికి బడ్జెట్ ధరలో ప్రీమియం కారు కోసం చూస్తున్న వారికి కంపెనీ ముఖ్యమైన ప్రీమియం కారు మారుతి ఎక్స్‌ఎల్6 (Maruti XL6) బెస్ట్ ఆఫ్షన్ అని చెప్పొచ్చు. దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

6-సీట్ల MUV/MPV (మల్టీ యుటిలిటీ వెహికల్) అయిన మారుతి XL6 ధర రూ. 11.71 లక్షల నుండి 14.87 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది. ఇది 9 వేరియంట్స్, 10 రంగుల ఎంపికలలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. 1462సీసీ ఇంజిన్‌ను కలిగి ఉన్న ఈ కారును 2 ఇంజిన్ ఆప్షన్‌లతో కొనుగోలు చేయవచ్చు. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆఫ్షన్లను కలిగి ఉంటుంది.
అలాగే, ఇది సీఎన్‌జీ ఆప్షన్‌లో కూడా లభిస్తుంది. అయితే ఇది కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే కంపెనీ చెబుతున్న ప్రకారం సీఎన్‌జీ - మాన్యువల్‌లో 26.32 కి.మీ, పెట్రోల్ - మాన్యువల్‌లో 20.97 కి.మీ, పెట్రోల్ - ఆటోమేటిక్‌లో 20.27 కి.మీ మైలేజ్‌ను ఇస్తుంది.

మారుతి సుజుకి కంపెనీ XL6 కారును NCAP (న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) ద్వారా సేఫ్టీ రేటింగ్ కూడా పొందింది. ఈ కారు సేఫ్టీ టెస్టులో XL6 కారు 3-స్టార్ NCAP రేటింగ్‌ను పొందింది. ఈ కారు 4 ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది.
ఏ ట్రిమ్‌ను ఎంచుకున్నా, XL6 లోపల ఆల్-బ్లాక్ ఇంటీరియర్‌తో వస్తుంది. ఎంట్రీ-లెవెల్ జీటా ట్రిమ్‌ను మినహాయిస్తే, టాప్-స్పెక్ ఆల్ఫా, ఆల్ఫా+ వేరియంట్‌లు లెదర్ స్టీరింగ్ వీల్, లెదరెట్ సీట్లను కలిగి ఉన్నాయి. అన్ని వేరియంట్‌లు వన్-టచ్ రిక్లైన్, స్లైడ్‌తో రెండవ వరుస కెప్టెన్ సీట్లను కలిగి ఉన్నాయి.

మూడవ వరుస సీట్లను కూడా 50:50 స్ప్లిట్‌తో మడవవచ్చు, బూట్‌లో ఎక్కువ స్థలం కోసం వీటిని పూర్తిగా మడవవచ్చు. క్వాడ్ ఎయిర్‌బ్యాగ్ సెటప్‌లో రెండు ఫ్రంట్, రెండు ఫ్రంట్ సీట్ సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. తర్వాత, రెండవ వరుసలో ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు ఉన్నాయి.
ఇవి మాత్రమే కాకుండా TPMS, ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), హిల్-హోల్డ్ అసిస్ట్, EBDతో ABS, వెనుక పార్కింగ్ సెన్సార్‌లు ఉన్నాయి. ఫీచర్ల విషయానికి వస్తే, 7-ఇంచుల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్ అందించింది.

ఇవి మాత్రమే కాకుండా కారులో ఆటోమేటిక్ ఏసీ, హైట్ అడ్జస్టబుల్ చేయగల డ్రైవర్ సీట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ కూల్డ్ ట్విన్ కప్ హోల్డర్, మూడు వరుసల్లో 12V యాక్సెసరీ సాకెట్‌లు అందిస్తోంది. ఇవన్నీ మారుతి XL6 కారులో అందించే బెస్ట్ ఫీచర్లు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








