ఈ కారు కొనాలి అంటే బ్యాంక్‌లో బ్యాలెన్స్ చెక్ చేసుకోవాల్సిందే! రేంజ్ రోవర్ కొత్త మోడల్ అదిరిపోతుంది
భారత మార్కెట్లో మరో విలాసవంతమైన కారు అడుగుపెట్టింది. లగ్జరీ కార్లకు పేరుగాంచిన రేంజ్ రోవర్ (Range Rover) తన అత్యంత స్టైలిష్, అధునాతన ఫీచర్లతో కూడిన వెలార్ ఆటోబయోగ్రఫీ (Velar Autobiography)ను తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ లగ్జరీ SUV ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది, డిజైన్ పరంగా ఆకట్టుకునేలా ఉండడమే కాకుండా, ఆధునిక టెక్నాలజీతో నిండిపోయి ఉంది. కారు ఎక్స్‌టీరియర్ నుంచి మొదలుకుని ఇంటీరియర్ వరకు అత్యాధునిక అంశాలు ఇవ్వబడ్డాయి. దీని ధర విషయానికి వస్తే, ఈ కొత్త ఆటోబయోగ్రఫీ వేరియంట్ రూ.89.90 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభమవుతోంది. ఇదే సమయంలో, వెలార్ డైనమిక్ SE వేరియంట్‌ను కూడా మార్కెట్‌లోకి విడుదల చేయగా, దాని ప్రారంభ ధర రూ.84.90 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించబడింది.
ఈ రెండు మోడళ్లూ లగ్జరీ కార్ విభాగంలో విస్తృత ఎంపికలుగా నిలుస్తాయి. ఇంత ధర పెట్టి పేద, మధ్య తరగతి వారు కొనుగోలు చేయడం కష్టం. సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు మొదలగువారు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. పనితీరు పరంగా చూసుకుంటే, కొత్త వెలార్ ఆటోబయోగ్రఫీ రెండు శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్లతో అందించబడింది. మొదటిది P250 పెట్రోల్ ఇంజిన్, ఇది 183.9 కిలోవాట్ల పవర్, 365 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇక రెండోది D200 డీజిల్ మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్, ఇది 150 కిలోవాట్ల పవర్, 430 Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ ఇంజిన్లు వేర్వేరు డ్రైవింగ్ అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దబడ్డాయి, నగర రోడ్లపై మృదువైన ప్రయాణం నుంచి, అలాగే, హైవే వేగాలకు కూడా సజావుగా స్పందిస్తాయి. రేంజ్ రోవర్ సొగసైన స్టైల్, విశిష్టమైన ఇంటీరియర్, ఆధునిక ఫీచర్ల వలే, వెలార్ ఆటోబయోగ్రఫీ కూడా అత్యున్నత లగ్జరీను అందించడమే లక్ష్యంగా తయారైంది.
ఇది లగ్జరీ, డిజైన్, టెక్నాలజీ మిశ్రమంగా రూపొందించిన మోడల్. ఎక్స్‌టీరియర్‌లో సిగ్నేచర్ ఫ్లోటింగ్ రూఫ్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, అలాగే సిగ్నేచర్ డేఅరైమ్ రన్నింగ్ లైట్స్‌తో కూడిన పిక్సెల్ LED హెడ్‌లైట్లు విలక్షణమైన ప్రెజెన్స్‌ను అందిస్తాయి. అందుకు తోడుగా, స్లైడింగ్ పనోరమిక్ రూఫ్, 20-అంగుళాల శాటిన్ డార్క్ గ్రే అల్లాయ్ వీల్స్, బర్నిష్డ్ కాపర్ యాక్సెంట్స్, బ్లాక్ కాంట్రాస్ట్ రూఫ్ ఈ వాహనాన్ని రోడ్డుపై మరింత స్టైలిష్‌గా, ప్రీమియంగా చూపిస్తాయి.

ఇంటీరియర్‌లో అడుగు పెట్టగానే లగ్జరీ అనుభవం ప్రతి టచ్ పాయింట్ వద్ద కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ముందు సీట్లు 20-విధాలుగా అడ్జస్ట్ చేసుకునే మసాజ్ ఫంక్షన్‌తో వస్తుండగా, స్వెడ్‌క్లాత్ హెడ్‌లైనింగ్, షాడో గ్రే యాష్ వెనీర్ ఫినిష్ ఈ కారును మరింత అందంగా తీర్చిదిద్దుతుంది. వెనుక ప్రయాణికులకూ పవర్ రీక్లైనింగ్ సీట్లు, యాంబియంట్ లైటింగ్‌ను తమ అభిరుచికి అనుగుణంగా సెటప్ చేసుకునే అవకాశం ఉంటుంది.
వెలార్ ఆటోబయోగ్రఫీలో ఫోర్-జోన్ క్లైమేట్ కంట్రోల్ అందించబడింది, దీని ద్వారా ప్రతి ప్రయాణికుడు తాను కోరుకున్న ఉష్ణోగ్రతలో ప్రయాణించవచ్చు. అంతేకాకుండా, క్యాబిన్ ఎయిర్ ప్యూరిఫికేషన్ ప్లస్ సిస్టమ్ వలన శుద్ధమైన గాలి అందిస్తూ ఆరోగ్యకరమైన ప్రయాణానికి దోహదపడుతుంది. ఇంకా ఫీచర్లుగా 3D సరౌండ్ కెమెరా, టెర్రైన్ రెస్పాన్స్ 2, ఎలక్ట్రానిక్ ఎయిర్ సస్పెన్షన్, హీట్ సెన్సింగ్, అడాప్టివ్ డైనమిక్స్ వంటివి అందించబడ్డాయి.
వెలార్ ఆటోబయోగ్రఫీ అనేది రేంజ్ రోవర్ లగ్జరీ ప్రాముఖ్యతను చాటి చెప్పేలా ఉంటుంది. విలాసవంతమైన, అత్యాధునిక సదుపాయాలు కలిగిన కారును కొనుగోలు చేయాలని చూస్తోన్న వారికి ఇది చాలా మంచి ఆప్షన్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కారుకు సంబంధించిన ఇతర వివరాల కోసం మీ దగ్గరలోని షోరూమ్‌లో సంప్రదించగలరు.


Click it and Unblock the Notifications








