తక్కువ ధర.. కొత్త లుక్.. అదిరిపోయే ఫీచర్లు..హ్యుందాయ్ నుంచి మరో సూపర్ హిట్.. మోడల్ ఫీచర్స్ ఇవే
హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఒక పాపులర్ కాంపాక్ట్ ఎస్యూవీ. ఇది చాలా ఆకర్షణీయంగా ఉండడమే కాకుండా, బడ్జెట్ ధరలో కూడా లభిస్తుంది. వినియోగదారులు కూడా పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు. తాజాగా కంపెనీ ఈ కారులో ఎస్ స్మార్ట్, ఎస్‌ఎక్స్ స్మార్ట్ అనే రెండు కొత్త వేరియంట్లను విడుదల చేసింది. వాటి ధర, ప్రత్యేకతల గురించిన ముఖ్యమైన అంశాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ధర (Price): హ్యుందాయ్ ఎక్స్‌టర్ కారు కొత్త వేరియంట్లు చాలా తక్కువ ధరలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. మధ్యతరగతి ప్రజలు కూడా సులభంగా ఇంటికి తీసుకెళ్లవచ్చు. 'ఎస్ స్మార్ట్' ధర రూ.7.68 లక్షలు ఉండగా, 'ఎస్‌ఎక్స్ స్మార్ట్' ధర రూ.8.16 లక్షలు (ఎక్స్-షోరూమ్).

కొత్త ఎస్ స్మార్ట్ (S Smart) వేరియంట్ ప్రత్యేకతలు: ఈ వేరియంట్‌లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, రేర్ ఏసీ వెంట్స్, ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, టీపీఎంఎస్ (టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్), 15-అంగుళాల అల్లాయ్ వీల్స్ వంటి అనేక లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి.
కొత్త ఎస్‌ఎక్స్ స్మార్ట్ (SX Smart) వేరియంట్ ఎలా ఉంది: ఈ వేరియంట్ కూడా చాలా బాగుంది. బటన్ స్టార్ట్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 15-అంగుళాల స్టీల్ వీల్స్, టీపీఎంఎస్ (టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్), ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, షార్క్ ఫిన్ యాంటెన్నాతో సహా వివిధ ఫీచర్లను కలిగి ఉంది.

పనితీరు (Performance): ఈ రెండు వేరియంట్లు పవర్ఫుల్ రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌లను కలిగి ఉన్నాయి. 1.2-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 81 PS హార్స్‌పవర్‌ను, 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లను కలిగి ఉంది. మరొకటి 1.2-లీటర్ CNG ఇంజిన్‌ను కలిగి ఉంది.
ఇది 67 PS హార్స్‌పవర్‌ను, 95.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనితో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఉంటుంది. ఈ కార్లు లీటరుకు 19.2 నుంచి 27 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తాయి.

మరిన్ని వివరాలు: హ్యుందాయ్ ఎక్స్‌టర్ కారు కొత్త వేరియంట్లు 9-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, రేర్ పార్కింగ్ కెమెరా వంటి అనేక ఫీచర్లను కలిగి ఉన్నాయి. వీటిలో 5 సీట్లు ఉండటంతో ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ఇవి 391 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉన్నాయి. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉన్నాయి.
మొత్తానికి, హ్యుందాయ్ ఎక్స్‌టర్ కారు సరికొత్త వేరియంట్లు విడుదల కావడం దేశీయ వినియోగదారులకు చాలా సంతోషాన్నిచ్చింది. ఈ రెండు వేరియంట్లు చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, సరసమైన ధరలో కూడా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ వేరియంట్‌లకు కొనుగోలుదారుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








