చిన్న బడ్జెట్.. పెద్ద ఫ్యామిలీ కార్! మీరు ఎదురుచూసింది ఇదేనా? డెలివరీలు మొదలయ్యాయి!
భారత మార్కెట్లో మిడ్-సైజ్ MPV సెగ్మెంట్‌కి సంబంధించి, రెనాల్ట్ ట్రైబర్ మంచి పేరును సంపాదించుకుంది. తాజాగా 2025 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌కి సంబంధించి భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మోడల్ ఇప్పటికే మార్కెట్లో సందడి చేస్తోంది. కొత్తగా వచ్చిన ఈ వేరియంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా రెనాల్ట్ షోరూమ్‌లకు రీచ్ అవుతోందని కార్దేఖో వెబ్‌సైట్ నివేదించింది. ఈ కారును బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు ఇది శుభవార్త అని చెప్పవచ్చు. 2025 ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ మరింత ఆకర్షణీయమైన రూపంలో, ఇంకా మరింత ఫీచర్‌లతో మార్కెట్లో అడుగుపెట్టింది. ఈ కారులో ప్రధాన ఆకర్షణగా నిలిచింది దీని ధర. ప్రారంభ వేరియంట్ ధర కేవలం రూ.6.30 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుండగా, టాప్ వేరియంట్ ధర రూ.9.40 లక్షల వరకు చేరుతుంది.
కారులో డిజైన్ మార్పులు, కొత్త ఫీచర్లు, ఫ్రెష్‌గా అనిపించే లుక్స్‌తో పాటు, పవర్‌ట్రెయిన్ పరంగా కూడా మార్పులు లేవు. 2025 ట్రైబర్ మోడల్‌లో మునుపటిలాగే 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను కొనసాగించారు. ఇది రోజువారీ డ్రైవింగ్‌కు అనువుగా ఉండేలా తీర్చిదిద్దబడింది. గరిష్టంగా 72 PS పవర్, 96 Nm టార్క్ అందించే ఈ ఇంజన్‌కు, 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్‌తో పాటు 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా లభిస్తోంది.

సామాన్య కుటుంబాలకు సరిపోయే ధరలో, మంచి స్పేస్, స్టైల్, సౌలభ్యం కావాలనుకునే వినియోగదారులకు ఇది ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఎంపికగా నిలవనుంది. కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో ట్రైబర్ మరోసారి మార్కెట్‌లో తన స్థానాన్ని బలపర్చుకునే అవకాశం ఉంది. 2025 రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్‌ను చూస్తే, ఇది కేవలం బడ్జెట్ 7-సీటర్ కారే కాదు... అన్ని రకాల కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపుదిద్దుకున్న మల్టీపర్పస్ వెహికల్‌గా చెప్పొచ్చు.
ప్రయాణంలో ఎలాంటి అసౌకర్యం లేకుండా, ఇంటిరియర్ టెక్నాలజీ నుండి భద్రతా ఫీచర్లు వరకు అన్నిటిలోనూ ఈ కారులో పూర్తి కేర్ తీసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. డెలివరీలు ప్రారంభమైన ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు, ఇది యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్‌తో వస్తోంది. అంటే, మ్యూజిక్ నుంచి నావిగేషన్ దాకా మీ స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని కార్లోకి తీసుకురావచ్చు.

అలాగే, 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ద్వారా డ్రైవింగ్ డేటా క్లియర్‌గా కనిపిస్తుంది. ఇక రిమోట్ కీలెస్ ఎంట్రీ, వైర్‌లెస్ సెల్‌ఫోన్ ఛార్జింగ్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ వంటి ఫీచర్లు ఈ సెగ్మెంట్‌లో అరుదుగా కనిపిస్తాయి కానీ ట్రైబర్ వాటిని స్టాండర్డ్‌గా అందిస్తోంది. సౌండ్ ప్రియుల కోసం 6-స్పీకర్ సిస్టమ్ అదనపు బోనస్ లా ఉంటుంది. ఇక భద్రత విషయంలో కూడా రెనాల్ట్ ఏమాత్రం రాజీపడలేదు.
ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, వెనుక పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ABS, EBD, ట్రాక్షన్ కంట్రోల్, ఆటోమేటిక్ వైపర్లు వంటి అన్ని ముఖ్యమైన సురక్షిత ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అంటే, దీన్ని ఒక పూర్తి స్థాయి ఫ్యామిలీ కార్‌గా, సిటీ డ్రైవింగ్‌కు సరైన ఎంపికగా, అలాగే వీకెండ్ ట్రిప్స్‌కి కూడా బాగానే ఉపయోగపడే వాహనంగా చెప్పవచ్చు.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది ప్రయాణికుల రక్షణ పరంగా కూడా అత్యుత్తమమైన కారు అని చెప్పవచ్చు. రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ అన్ని వేరియంట్లలో ప్రామాణికంగా వచ్చే 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఈ కారును అత్యంత ముఖ్యమైన భద్రతా లక్షణాలలో ఒకటి. లుక్, లెక్క, లగ్జరీ, సేఫ్టీ అన్నింటినీ బడ్జెట్‌లో సరిపెట్టాలంటే... 2025 రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ ఖచ్చితంగా మీ జాబితాలో ఉండాల్సిందే.


Click it and Unblock the Notifications








