రూ.6.29 లక్షలకే 7 సీటర్.. ఎదురుచూపులకు ఇక బ్రేక్ పడ్డట్లే.. డీలర్‌షిప్‌ల వద్దకు ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్!

ప్రముఖ కార్ల తయారీదారు రెనాల్డ్ ఇండియా (Renault India) తనకు ఉన్నటువంటి కొన్ని మోడళ్లతోనే మార్కెట్లో సత్తా చూపిస్తుంది. గతంలో డస్టర్ ద్వారా తిరుగులేని కంపెనీగా అవతరించిన కంపెనీ ఇప్పుడు తన సేల్స్‌ను మరింత పెంచుకోవడానికి ప్రసిద్ధ మోడల్ అయినటువంటి ట్రైబర్ (Triber) ను మరింత కొత్తగ మార్చి 2025లో రీడిజైన్‌ చేసి ఫేస్‌లిఫ్ట్ MPVగా ఇప్పుడు మన ముందుకు తీసుకువచ్చింది. కొద్ది రోజుల క్రితం ఈ కారును మార్కెట్లో లాంచ్ చేయగా ఇప్పుడు రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ MPV డెలివరీలు దేశవ్యాప్తంగా ప్రారంభం కావడానికి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే వివిధ నగరాల్లో డీలర్‌షిప్‌లకు ఈ కార్ల డెలివరీలు ప్రారంభమయ్యాయి. ఈ కారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, డెలివరీలు త్వరలోనే వేగం పెంచనున్నట్లు సమాచారం.

2025లో రీడిజైన్‌తో వచ్చింది రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ MPV. దీని లుక్స్, ఫీచర్లు, ధర అన్నీ చూసి వినియోగదారులు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. మునుపటి వెర్షన్‌తో పోలిస్తే, ఇది మరింత ఆధునికంగా, స్టైలిష్‌గా కనిపిస్తోంది. ఎక్స్‌టీరియర్ డిజైన్‌లోనూ, ఇంటీరియర్ సౌకర్యాల్లోనూ అనేక మార్పులు చేశారు. ఈ కొత్త ట్రైబర్, డజన్లకొద్దీ ఫీచర్లతో వస్తోంది. ఇది మధ్యతరగతి కుటుంబాలు కొనుగోలు చేయగలిగే విధంగా అందుబాటు ధరలోనే లభిస్తుంది.

Renault 2025 Triber Facelift

మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్, వెనుకకు ఏసీ వెంట్స్, ఇంకా సేఫ్టీ విషయంలోనూ మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, ABS, EBD వంటి ముఖ్యమైన భద్రతా వ్యవస్థలు అందిస్తున్నారు. ఈ ఫీచర్లన్నీ మధ్యతరగతి కుటుంబాల కోసం మంచి ఎంపికగా దీన్ని నిలబెట్టాయి. తక్కువ ధరలో మెరుగైన ఫీచర్లను అందిస్తూ, మిడ్-రేంజ్ కార్ కోసం చూస్తున్న కుటుంబాలకు చక్కటి ఎంపికగా నిలుస్తోంది.

దీని ధర రూ. 6.29 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ వేరియంట్ ధర రూ. 9.16 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఈ కొత్త ట్రైబర్ నాలుగు వేరియంట్లలో అందుబాటులో అథెంటిక్, ఎవల్యూషన్, టెక్నో, ఎమోషన్‌లలో అందుబాటులో ఉంది. ప్రతి వేరియంట్‌కి ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయి, వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేయబడ్డాయి. ఈ కారు ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ చాలా ఆకట్టుకునే విధంగా ఉంటుంది.

Renault Triber Facelift

బయటి నుంచి చూస్తే, దీని కొత్త ట్రైబర్ స్టైలిష్ లుక్స్‌తో అదిరిపోయేలా ఉంటుంది. LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, కనుబొమ్మ ఆకారంలో ఉన్న LED DRLs, కొత్తగా డిజైన్ చేసిన 2D రెనాల్ట్ లోగో, అలాగే శక్తివంతమైన LED ఫాగ్ లాంప్స్ దీన్ని ప్రత్యేకంగా చూపిస్తున్నాయి. ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ MPVని ప్రత్యేకంగా ఫ్యామిలీల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించారు. ఇందులో 7-సీటింగ్ లేఅవుట్ ఇవ్వబడినది, ఇది ఎక్కువ మంది ప్రయాణించడానికి బెస్ట్.

ప్రతి వరుసలో ప్రయాణికులకు తగినంత లెగ్‌రూమ్, హెడ్‌రూమ్ లభిస్తుంది, అందులోను మూడవ వరుస సీట్లకూ మరింత సౌకర్యం ఉండేలా డిజైన్ చేశారు. అలాగే, ఈ కారు బూట్ స్పేస్ విషయంలోనూ చాలా ప్రాక్టికల్‌గా ఉంటుంది. పూర్తి సీటింగ్‌లో కూడా ఇది 84 లీటర్ల స్టోరేజ్ స్పేస్‌ను అందిస్తుంది. అయితే, అవసరమైతే మూడవ వరుస సీట్లను మడతపెట్టి, 625 లీటర్ల వరకు విస్తరించుకోవచ్చు.

Triber Facelift

కొత్త రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ కేవలం స్టైలిష్ డిజైన్‌తోనే కాకుండా పవర్‌ట్రెయిన్‌‌తో కూడా ఆకట్టుకుంటోంది. ఇందులో 1-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఇవ్వబడింది, ఇది 72 PS పవర్, 96 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది నగరాలలోనూ, హైవే ప్రయాణాల్లోనూ సరళమైన మరియు స్మూత్ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ ఇంజన్‌కు 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జత చేశారు.

More from DriveSpark

Article Published On: Saturday, August 2, 2025, 17:20 [IST]
English summary
Renault 2025 triber facelift mpv reaching dealership in india more details inside
Read more on: #renault #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+