తక్కువ ధరలో 7- సీటర్ కారు కోసం చూస్తున్నారా? దేశంలో జనాలు అందరూ ఇదే కావాలంటున్నారు!
రెనాల్ట్ ట్రైబర్ (Renault Triber) భారత మార్కెట్లో తన డిజైన్, వాల్యూ ఫర్ మనీ ప్రైస్ ట్యాగ్తో ప్రత్యేకమైన స్థానం సంపాదించింది. ఈ కారు ఒక MPV (మల్టీ పర్పస్ వెహికల్) అయినప్పటికీ, దాని లోపల ఏడు మంది సౌకర్యంగా కూర్చునే స్థలం కలిగి ఉంటుంది. 2019లో మొదటిసారి భారతదేశంలో లాంచ్ అయిన ఈ ట్రైబర్, ప్రస్తుతం కూడా కుటుంబాలకు బడ్జెట్‌లో 7 సీటర్ ఆప్షన్‌గా అత్యంత ప్రజాదరణ పొందుతోంది. తాజాగా ఈ కారుకు సంబంధించిన సేల్స్ వివరాలు చూసినట్లయితే ఇది 2025 ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు నెలలో మెరుగైన సేల్స్‌ను నమోదు చేసింది. రెనాల్ట్ ట్రైబర్ మార్కెట్లో మళ్లీ తన పాత జోష్‌ను తెచ్చుకుంటోంది. తక్కువ ధరలో లభించే 7-సీటర్ కారు కావడంతో పాటు, ఇటీవల విడుదలైన ఫేస్‌లిఫ్ట్ మోడల్ ట్రైబర్‌కు కొత్త ఊపిరి నింపింది.
2025లో మొదటి త్రైమాసికం అంతగా బాగోలేదు కానీ, రెండవ త్రైమాసికం ముగిసే నాటికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ట్రైబర్ అమ్మకాలు దాదాపు ఒకే స్థాయిలో ఉండిపోయాయి, వరుసగా 1,401, 1,411, 1,421 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ సంఖ్యలు ట్రైబర్‌కు కొంత వెనుకబాటుగా కనిపించాయి. కానీ కంపెనీ కొత్త రూపంతో, ఫీచర్లతో, కొంత తక్కువ ధరతో ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేయడంతోనే మార్పు కనిపించింది.

జూలై నెలలో కొత్త ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ అవ్వగానే, అమ్మకాలు ఒక్కసారిగా 1,987 యూనిట్లకు పెరిగాయి. ఇది మునుపటి నెలలతో పోలిస్తే స్పష్టమైన పెరుగుదల. కొత్త డిజైన్, మెరుగైన ఇంటీరియర్‌లు, వినియోగదారులకు ఆకట్టుకునే కొత్త ఫీచర్లు ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఆగస్టు నెలలో అమ్మకాలు కొద్దిగా తగ్గినా 1,870 యూనిట్లు అమ్ముడవ్వడం కూడా చిన్న MPV సెగ్మెంట్‌లో బలమైన స్థానం కాపాడుకున్నట్లే.
ఇది కొద్దిపాటి తగ్గుదల మాత్రమే అయినప్పటికీ, ట్రైబర్ మార్కెట్లో తన స్థిరతను కొనసాగిస్తోందని స్పష్టంగా చూపిస్తుంది. ఇక సెప్టెంబర్ 2025 నెలకు సంబంధించిన ట్రైబర్ అమ్మకాల నివేదిక ఇంకా విడుదల కాలేదు. అయితే, మార్కెట్ వర్గాలు, డీలర్‌ల నుండి వస్తున్న సమాచారం ప్రకారం, కొత్త ఫేస్‌లిఫ్ట్‌కు ఉన్న డిమాండ్ ఇంకా కొనసాగుతోందని చెబుతున్నారు. అంటే, ఈ నెలలో కూడా రెనాల్ట్ ట్రైబర్ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

తక్కువ ధర, 7 సీటర్ సౌకర్యం, ఫీచర్లతో ఉన్న ఫేస్‌లిఫ్ట్ మోడల్ మధ్యతరగతి కుటుంబాల దృష్టిని ఆకర్షిస్తోంది. చిన్న బడ్జెట్‌లో పెద్ద కారు అనిపించే ట్రైబర్, రెనాల్ట్‌కు మళ్లీ అమ్మకాలలో బలమైన పునరాగమనం తెచ్చే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. తక్కువ ధర, కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్, తాజాగా అమల్లోకి వచ్చిన GST తగ్గింపు, ఈ మూడు అంశాలు కలసి ట్రైబర్ అమ్మకాలను మరింత వేగంగా పెంచే దిశగా నడిపిస్తున్నాయి.
ప్రారంభంలో రెనాల్ట్ ట్రైబర్ బేస్ వేరియంట్ ధర రూ.6.29 లక్షలు ఉండేది. కానీ సెప్టెంబర్ 22న కేంద్ర ప్రభుత్వం కార్లపై GST తగ్గింపు ప్రకటించిన తర్వాత, ట్రైబర్ ధరల్లో కూడా గణనీయమైన మార్పు చోటుచేసుకుంది. తగ్గిన పన్ను రేట్ల ఫలితంగా ట్రైబర్ ప్రారంభ ధర ఇప్పుడు కేవలం రూ.5.76 లక్షలకు చేరింది. ఇది కేవలం ధర తగ్గింపే కాకుండా, కొనుగోలుదారుల కోసం ఒక పెద్ద లాభం అని చెప్పాలి.

ఇదే విధంగా, ట్రైబర్ టాప్ వేరియంట్ ధర కూడా తగ్గింది. ఇప్పుడు రూ.8.60 లక్షలకు తగ్గింది. ఈ కారు ఇతర విషయాల గురించి చూసినట్లయితే, దీనిలో 7 సీటర్ ఉంటుంది. రెండు కుటుంబాలు కలిగిన వారు ఈ కారులో హాయిగా ప్రయాణించచ్చు. లాంగ్ టూర్స్, ఫ్యామిలీ ట్రిప్స్‌కు వెళ్లాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్. ఇది మైలేజ్ కూడా సుమారు 19-20 కి.మీ/లీటర్ వరకు ఇస్తుంది.


Click it and Unblock the Notifications








