రెనాల్ట్ కార్ల ధరల్లో భారీ తగ్గుదల.. 22వ తేదీ తర్వాత మోడళ్ల వారీగా కొత్త ధరలు ఇలా ఉంటాయ్!
ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ సమావేశం దేశ వ్యాప్తంగా ఆటోమొబైల్ రంగంలో పెద్ద చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఈ సమావేశంలో కార్లపై జీఎస్టీ రేటును తగ్గించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 22 నుంచి ఈ కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. అంటే ఆ తేదీ తర్వాత మార్కెట్లో అమ్ముడవుతున్న ప్రతి కారుకు కొత్తగా తగ్గిన ధరలు వర్తించనున్నాయి. ఈ పరిణామం వాహన కొనుగోలు దారులకే కాకుండా కార్ల కంపెనీలకు కూడా ఒక పెద్ద ఊరటగా మారింది. ఈ పరిస్థితుల్లో ప్రధానంగా ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ ఇండియా విభాగం జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను తమ వినియోగదారులకు నేరుగా అందించాలనే ఉద్దేశంతో, తమ కార్ల ధరలను సవరించాలని నిర్ణయించింది.
రెనాల్ట్ ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ట్రైబర్, కైగర్, క్విడ్ వంటి మోడళ్లను విక్రయిస్తోంది. ఈ మూడు మోడళ్లే కంపెనీకి కీలకమైన అమ్మకాల ఆధారాలు కావడంతో, వాటిపై తగ్గిన జీఎస్టీ రేట్లను వినియోగదారులకు తక్షణమే అందించేలా ప్రణాళికలు రూపొందించింది. కంపెనీ విడుదల చేసిన తాజా ప్రకటన ప్రకారం, సెప్టెంబర్ 22 నుంచి తగ్గిన జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చిన తరువాత వేరియంట్ వారీగా ధరల్లో గణనీయమైన తేడా రానుంది.

సాధారణంగా ఆటోమొబైల్ రంగంలో పన్ను రాయితీలు మొదటగా డీలర్లు లేదా కంపెనీ లాభాల్లోనే ఆగిపోతాయి. కానీ రెనాల్ట్ ఈసారి పూర్తిగా వేరే దారిని ఎంచుకుంది. తగ్గిన పన్నును నేరుగా కస్టమర్లకు అందించాలనే నిర్ణయం తీసుకోవడం వినియోగదారులకు ఒక మంచి లాభంగా మారబోతోంది. దీని ఫలితంగా, ఇప్పటివరకు ఉన్న అమ్మకపు ధరలు, జీఎస్టీ తగ్గింపు తర్వాత ఉండే కొత్త ధరల మధ్య తేడా వినియోగదారుల కళ్ల ముందే స్పష్టంగా కనిపించనుంది.
రెనాల్ట్ ట్రైబర్ కారు విషయానికొస్తే,దీని అథెంటిక్ వేరియంట్ ధర రూ.6,29,995. ఇప్పుడు దాని ధర రూ.5,76,300. ఎవల్యూషన్ వేరియంట్ ప్రస్తుతం రూ.7,24,995. ఇప్పుడు ఈ కారు ధర రూ.6,63,200. టెక్నో వేరియంట్ ప్రస్తుతం రూ.7,99,995. దీని ధర రూ.7,31,800. ప్రస్తుతం ఎమోషన్ వేరియంట్ ధర రూ.8,64,995 కు అమ్ముడవుతోంది. దీని ధర రూ.7,91,200 కు అమ్ముడవుతోంది.

ఎమోషన్ AMT వేరియంట్ ధర రూ.9,16,995కు అమ్ముడవుతోంది. దీని ధర రూ.8,38,800కు అమ్ముడవుతోంది. ఎమోషన్ MT TT వేరియంట్ ధర రూ.8,87,995కు అమ్ముడవుతోంది. ఇప్పుడు ఈ కారు ధర రూ.8,12,300 చేరుతుంది. ఎమోషన్ AMT TT వేరియంట్ ధర రూ.9,39,995కు అమ్ముడవుతోంది. ఇప్పుడు దీని ధర రూ.8,59,800 అవుతుంది. కైగర్ కారు విషయానికొస్తే, ఆథెంటిక్ MT ప్రస్తుతం రూ.6,29,995 ధరకు అమ్ముడవుతోంది.
ఇప్పుడు ఈ కారు రూ.5,76,300. ఎవల్యూషన్ MT ధర రూ.6,49,500 అవుతుంది. ఎవల్యూషన్ AMT వేరియంట్ రూ.6,95,200 ధరకు చేరుతుంది. టెక్నో MT వేరియంట్ రూ.7,50,100 ధరకు అమ్ముడవుతోంది. ఎమోషన్ MT వేరియంట్ రూ.8,37,000 ధరకు, ఎమోషన్ DT MT వేరియంట్ రూ.8,58,000 ధరకు, ఎమోషన్ MT వేరియంట్ రూ.8,37,000 ధరకు, ఎమోషన్ DT MT రూ.8,58,000 ధరకు చేరుతుంది.

టెక్నో AMT వేరియంట్ రూ.7,95,800 ధరకు, టెక్నో TT AMT వేరియంట్ రూ.8,58,000కు, ఎమోషన్ MT 1L T వేరియంట్ రూ.9,14,000, ఎమోషన్ TT MT 1L T వేరియంట్ రూ.9,14,000 ధరకు, టెక్నో సివిటి 1ఎల్ టి వేరియంట్ రూ.9,14,000 ధరకు, టెక్నో సివిటి 1ఎల్ టి వేరియంట్ రూ.9,14,000, టెక్నో విటి సివిటి ఎంటి 1ఎల్ టి వేరియంట్ రూ.9,14,000 ధరకు చేరుతుంది.
ఎమోషన్ సివిటి 1ఎల్ టి రూ.10,33,600 ధరకు, ఎమోషన్ DT CVT 1L T రూ.10,33,600 ధరకు చేరుతుంది. రెనాల్ట్ క్విడ్ RXE MT వేరియంట్ రూ.4,29,900. RXL MT వేరియంట్ రూ.4,66,500. RXL AMT రూ.4,99,900. RXD MT వేరియంట్ రూ.5,48,800కి, క్లైంబర్ రూ.5,37,900 ధరకు, క్లైంబర్ AMT వేరియంట్ రూ.5,79,000 ధరకు, క్లైంబర్ DT వేరియంట్ రూ.4,29,900 ధరకు, క్లైంబర్ AMT DT రూ.4,29,900 ధరకు చేరుతుంది.


Click it and Unblock the Notifications








