రూ.90,000 తగ్గింపు.. ఫ్యామిలీ కార్లపై భారీ డిస్కౌంట్.. డిమాండ్ పెరగకముందే షోరూమ్‌కు వెళ్లండి!
ఫ్రెంచ్ ఆటోమేకర్ రెనాల్ట్ (Renault), భారతీయ మార్కెట్లో ఒకప్పుడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా డస్టర్ వంటి మోడల్స్‌తో SUV కస్టమర్ల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. కానీ, డస్టర్‌ను నిలిపివేసిన తర్వాత, రెనాల్ట్ మార్కెట్ దృష్టిని కొంత మేరకు కోల్పోయింది. క్విడ్, ట్రైబర్, కైగర్ వంటి మోడల్స్ కొన్ని అమ్మకాలూ సాధించాయి కానీ, అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేకపోయాయి. అయితే, సామాన్య వినియోగదారుల అవసరాల పట్ల ఎప్పుడూ దృఢంగా ఉన్న రెనాల్ట్, ఇప్పుడు తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు కొత్త ప్రణాళికలతో ముందుకు వస్తోంది. అందుకే కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి కంపెనీ జూన్ నెలలో ప్రత్యేక తగ్గింపు ఆఫర్స్ తీసుకొచ్చింది.
వర్షాకాలం ప్రారంభమవుతుండటంతో, తమ టూవీలర్ వాహనాలను మార్చుకుని తక్కువ ధరలో కొత్త కారును కొనాలనే ఆలోచనలో ఉన్న వినియోగదారులను ఆకర్షించేందుకు రెనాల్ట్ ప్రత్యేకంగా 'డిస్కవరీ డేస్ (discovery days)' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది జూన్ 6 నుంచి 16, 2025 వరకు దేశవ్యాప్తంగా అన్ని రెనాల్ట్ షోరూమ్‌లలో నిర్వహించనున్నారు. ఈ ప్రచారంలో భాగంగా, కస్టమర్లు రెనాల్ట్ షోరూమ్‌లకు వచ్చి కార్లను తక్కువలో సొంతం చేసుకోవచ్చు.

ఈ డిస్కవరీ డేస్ కార్యక్రమం ద్వారా రెనాల్ట్, కేవలం కార్లను మాత్రమే కాదు, వినియోగదారులకు పూర్తిగా కంఫర్ట్ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో ముందుకు వస్తోంది. షోరూమ్ సందర్శన సమయంలో ప్రత్యేకమైన ఆఫర్లు, ఫైనాన్సింగ్ ప్యాకేజీలు, స్మార్ట్ బాయ్‌బ్యాక్ స్కీములు వంటి అనేక ప్రోత్సాహకాలు వినియోగదారుల కోసం సిద్ధంగా ఉన్నాయి. లిమిటెడ్ కాలం వరకు అందుబాటులో ఉండే ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోగలరు.
పథకం కింద, రెనాల్ట్ ట్రైబర్ MPV, క్విడ్ హ్యాచ్‌బ్యాక్, కిగర్ SUV వేరియంట్లపై ఎంపిక చేసిన మోడళ్లకు రూ.90,000 వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే, వడ్డీ లేని రుణ సదుపాయం, ప్రాసెసింగ్ ఫీజుపై 50% తగ్గింపు, ఇప్పటికే రెనాల్ట్ కస్టమర్లుగా ఉన్నవారికి లాయల్టీ బోనస్ కింద అదనపు ప్రయోజనాలు, మిత్రులను, కుటుంబ సభ్యులను రిఫరీ చేసినట్లయితే ప్రత్యేకంగా రిఫెరల్ బోనస్ ఉన్నాయి. ఇవి 2024, 2025 మోడళ్లకు వర్తిస్తాయి.

రెనాల్ట్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ క్విడ్ 2024 మోడల్‌పై రూ.90,000 వరకు ఆఫర్‌లతో అందుబాటులో ఉంది. మరోవైపు, మీరు 2025 మోడళ్లను కోరుకుంటే, రూ.60,000 ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో రూ.15,000 నగదు తగ్గింపు, రూ.35,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉన్నాయి. భారతదేశంలో క్విడ్ ప్రస్తుతం ధర రూ. 4.67 లక్షల నుండి రూ. 6.45 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
7-సీటర్ ట్రైబర్ ప్రస్తుతం 2024 మోడల్ రూ.90,000 వరకు ప్రయోజనాలతో అందుబాటులో ఉంది. ఇందులో రూ. 50,000 నగదు తగ్గింపు, రూ. 40,000 ఎక్స్ఛేంజ్ తగ్గింపు. 2025 మోడల్‌పై రూ. 90,000 వరకు ఇలాంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో రూ. 40,000 నగదు తగ్గింపు, రూ. 40,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ. 0,000 కార్పొరేట్ ఆఫర్ ఉన్నాయి. దీని RXT, RXZ వేరియంట్‌లు ప్రత్యేక రుణ ఆఫర్‌లకు అర్హత కలిగినవి.

వీటి ప్రారంభ ధర రూ. 6.15 లక్షల నుండి రూ. 8.98 లక్షల(ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది. రెనాల్ట్ కిగర్ 2024 మోడళ్లపై రూ.90,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో రూ.50,000 నగదు తగ్గింపు, రూ.40,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉన్నాయి. 2025 మోడళ్లపై రూ.90,000 ఆదా చేసుకోగలుగుతారు. కంపెనీ రూ.40,000 నగదు తగ్గింపు, రూ.40,000 ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలు, రూ.10,000 కార్పొరేట్ ఆఫర్ అందిస్తుంది. పూర్తి వివరాల కోసం షోరూములో సంప్రదించగలరు.


Click it and Unblock the Notifications








