ఇన్నాళ్లు ఆగారు కదా.. ఇంకా రెండు నెలలు ఆగండి.. చాలా చౌకైన 7 సీటర్ కారు వచ్చేస్తోంది
భారతీయ మార్కెట్‌లో ఒకప్పుడు మంచి ఆదరణ పొందిన రెనో డస్టర్ (Renault Duster) మళ్లీ కొత్త అవతారంలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. కారు లవర్స్ అంతా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఈ డస్టర్ ఎస్‌యూవీ (SUV) వచ్చే ఏడాది జనవరి 26న అధికారికంగా ఆవిష్కరించబడుతుందని రెనో సంస్థ ప్రకటించింది. డస్టర్ విజయవంతంగా లాంచ్ అయిన తర్వాత, ఇదే ప్లాట్‌ఫామ్‌పై 7-సీటర్ కారుతో పాటు, తక్కువ బడ్జెట్‌లో ఒక ఎలక్ట్రిక్ కారును కూడా తీసుకురావాలని రెనో ప్లాన్ చేస్తోంది. ఈ కొత్త కార్ల ప్లాన్‌లో డస్టర్ తొలి అడుగు.
భారత మార్కెట్‌లో 2012లో డస్టర్ మొదటి తరం మోడల్ విడుదలైంది. దాని అద్భుతమైన ఫీచర్లు, బలమైన డిజైన్ కారణంగా ఈ కారు దాదాపు 2 లక్షలకు పైగా అమ్ముడైంది. అంతర్జాతీయంగా కూడా 18 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. డస్టర్ అమ్మకాలు నిలిచిపోయిన తర్వాత, ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్ మరింత పెరిగింది.

ప్రస్తుతం భారత మార్కెట్‌లో అమ్ముడవుతున్న మొత్తం కార్లలో ఈ సెగ్మెంట్ వాటా 25 శాతం ఉంది. ఈ పోటీని ఎదుర్కోవడానికి రెనో.. డస్టర్‌ను CMF-B ప్లాట్‌ఫామ్‌పై తయారు చేస్తోంది. ఈ కొత్త మోడల్‌ను చెన్నైలోని ఒరగడంలో ఉన్న రెనో ప్లాంట్‌లో తయారు చేయనున్నారు.
కొత్త డస్టర్ కారు లోపల (ఇంటీరియర్) అనేక అప్‌గ్రేడ్ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 10.1 అంగుళాల ఓపెన్ ఆర్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్ ఉంటుంది. డ్రైవర్ కోసం 7 అంగుళాల డిజిటల్ క్లస్టర్ (స్పీడోమీటర్ వంటివి) కూడా ఇస్తున్నారు.

సెంటర్ కన్సోల్ కాస్త ఎత్తుగా ఉండటం, ఆటోమేటిక్ వేరియంట్‌లకు ఎలక్ట్రానిక్ గేర్ సెలెక్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్, లెదర్ స్టీరింగ్ వీల్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌లు వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి.
సేఫ్టీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, లెవెల్ 2 ADAS (లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ వార్నింగ్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటివి) వంటి కీలక ఫీచర్లు ఉన్నాయి.

భారత మార్కెట్‌లో రెనాల్ట్ సంస్థకు ఒకప్పుడు గొప్ప పేరు తెచ్చింది ఎస్‌యూవీ డస్టర్. కొన్ని కారణాల వల్ల కంపెనీ దీని అమ్మకాలను నిలిపివేసింది. అయితే, మళ్లీ ఈ కారు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే. రెనాల్ట్ కొత్త డస్టర్ కంపెనీ అమ్మకాలను గణనీయంగా పెంచుతుందని కంపెనీ భావిస్తోంది.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం : భారతదేశంలో డస్టర్‌కు ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. చాలా మంది కస్టమర్లు ఈ కొత్త కారు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ కొత్త ఫీచర్లు అద్భుతమైన టెక్నాలజీతో డస్టర్ కారు.. మార్కెట్లో మారుతి, కియా, హ్యుందాయ్ వంటి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. ఈ కారు మార్కెట్లో ఒక చిన్న విప్లవాన్ని తీసుకువచ్చే అవకాశం ఉందని ఆటోమొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications








