కార్లపై ఉచిత చెకింగ్స్, స్పెషల్ ఆఫర్లు.. ఈ వేసవి క్యాంప్‌ను మిస్ అవకండి.. రెనాల్ట్ సర్వీస్ మేళా
వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న ఈ సమయంలో, వాహన యజములు తమ కార్లకు తగిన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం మరింతగా పెరిగింది. ఈ నేపథ్యంలో, భారతదేశంలో ప్రముఖ ఫ్రెంచ్ ఆటోమొబైల్ బ్రాండ్ అయిన రెనాల్ట్, తన వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి దేశవ్యాప్తంగా వేసవి శిబిరాన్ని ప్రారంభించింది. మే 19 నుండి మే 25, 2025 వరకు ఈ ప్రత్యేక సర్వీస్ క్యాంప్ దేశంలోని అన్ని రెనాల్ట్ అథారైజ్డ్ సర్వీస్ సెంటర్లలో నిర్వహించనున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రెనాల్ట్‌కు 580 టచ్‌పాయింట్లు ఉండటం వల్ల, ప్రతి వినియోగదారుడికి ఈ క్యాంప్ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఈ ప్రత్యేక ఆఫర్ ద్వారా రెనాల్ట్ కస్టమర్లు తమ వాహనాలను పూర్తిగా చెక్ చేయించుకోవచ్చు.
ముఖ్యంగా, బ్యాటరీ ఆరోగ్యం, బ్రేక్ ఫ్లూయిడ్ స్థాయి, ఇంజిన్ పనితీరు, AC ఫిల్టర్లు, కూలెంట్ స్థాయిలు, లైటింగ్ సిస్టమ్‌లను చెక్ చేయించుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా, విడిభాగాలు, యాక్సెసరీలపై ప్రత్యేక డిస్కౌంట్లు, ఉచిత బహుమతులు, ఆకర్షణీయమైన ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ క్యాంప్ ద్వారా రెనాల్ట్ తమ కస్టమర్ ఫస్ట్‌ను మరోసారి నిరూపిస్తూ, వినియోగదారుల మద్దతును మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎండలు దంచి కోడుతున్నాయి. దీంతో వాహనాలు కూడా ఎండ వేడి ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంది. దీంతో తమ కస్టమర్లు ఈ వేసవిలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొకూడదనే ఉద్దేశంతో రెనాల్ట్ ఇండియా ఈ ప్రత్యేక సమ్మర్ సర్వీస్ క్యాంప్‌ను ప్రకటించింది. ఈ కార్యక్రమం కేవలం వాహనాన్ని పరీక్షించడానికే కాదు, పలు రాయితీలు, బహుమతులతో వినియోగదారులకు నిజమైన సంతోషాన్ని అందించడానికే లక్ష్యంగా రూపొందించబడింది.
ఈ క్యాంప్‌లో భాగంగా, రెనాల్ట్ కార్లలోని ఎంపిక చేసిన విడిభాగాలు, లేబర్ ఛార్జీలు, విలువ ఆధారిత సేవలపై 15 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. అలాగే, ఇంజిన్ ఆయిల్ రీప్లేస్‌మెంట్ సేవలపై కూడా 10 శాతం తగ్గింపు అందించబడుతోంది. అంతేకాక, పొడిగించిన వారంటీ, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్‌లపై సైతం ఈ ఆఫర్లు వర్తించనున్నాయి. టైర్లపై ప్రత్యేక డిస్కౌంట్లు అందుబాటులో ఉండగా, ప్రతి కస్టమర్‌కు ఉచితంగా చిన్న గిఫ్ట్‌లు కూడా ఉన్నాయి.

మరొక ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే, కొన్ని ఎంపిక చేసిన యాక్సెసరీలపై 50 శాతం వరకు భారీ తగ్గింపులు ఉంటాయి. ఇక, MY రెనాల్ట్ యాప్‌లో ఇప్పటికే రిజిస్టర్ అయిన వినియోగదారులు అయితే, అదనంగా 5 శాతం డిస్కౌంట్ లభించే అవకాశాన్ని పొందవచ్చు. అదనంగా, కస్టమర్లకు ఉచిత కార్ టాప్ వాష్ కూడా లభిస్తుంది. మండు వేసవిలో రెనాల్ట్ కస్టమర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
ఈ సందర్భంగా రెనాల్ట్ ఇండియా ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ & మార్కెటింగ్) ఫ్రాన్సిస్కో హిడాల్గో మాట్లాడుతూ, మా దృష్టి కేవలం వాహనాలను విక్రయించడంలో లేదని, వినియోగదారులకు అసాధారణమైన అనుభవాన్ని కలిగించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే నిర్వహించబడుతున్న రెనాల్ట్ సమ్మర్ సర్వీస్ క్యాంప్, కార్లను ఉత్తమ పనితీరుతో ఉంచడమే కాకుండా, యాజమాన్యాన్ని సులభతరం చేయడంలో కంపెనీ నిబద్దతను సూచిస్తుందని అన్నారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు


Click it and Unblock the Notifications








