మళ్లీ వస్తోంది.. ఒకప్పుడు మార్కెట్‌ను షేక్ చేసిన కారు! ప్రభావం మొదలవ్వగానే సేల్స్ జంప్!
ఫ్రాన్స్‌కు చెందిన ప్రతిష్టాత్మక ఆటోమొబైల్ బ్రాండ్ రెనాల్ట్ (Renault) మరోసారి భారత మార్కెట్లో తన సత్తాను చాటుకుంది. దేశంలో క్విడ్, కిగర్, ట్రైబర్ వంటి బడ్జెట్-ఫ్రెండ్లీ, ప్రాక్టికల్ కార్లను అందిస్తూ, ఈ కంపెనీ మధ్య తరగతి కుటుంబాల నమ్మకాన్ని గెలుచుకుంది. నగరాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ రెనాల్ట్ కార్లకు మంచి ఆదరణ ఉంది. కారణం.. సరసమైన ధర, తక్కువ మెయింటెనెన్స్, స్టైలిష్ డిజైన్, కుటుంబ అవసరాలను తీర్చే స్పేస్. తాజాగా విడుదలైన నవంబర్ నెల విక్రయ గణాంకాలు రెనాల్ట్‌కి మరో మైలురాయిగా నిలిచాయి. ఈ నెలలో కంపెనీ మొత్తం 3,662 యూనిట్లను కొనుగోలుదారులకు డెలివరీ చేసింది. గత సంవత్సరం ఇదే నెలలో 2,811 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.
ఈ సంఖ్యలను పోలిస్తే, అమ్మకాల పరిమాణం సంవత్సరం ప్రాతిపదికన 30.27% గణనీయంగా పెరిగింది. తక్కువ ఖర్చుతో మంచి పర్ఫార్మెన్స్ అందించే రెనాల్ట్ వాహనాలపై వినియోగదారుల విశ్వాసం మళ్లీ పెరుగుతున్నదని ఈ వృద్ధి స్పష్టంగా చూపిస్తోంది. భారతీయ కుటుంబాలు ప్రాధాన్యం ఇచ్చే అంశాలైన మైలేజ్, భద్రత, విశాలమైన కేబిన్, ఆకర్షణీయమైన డిజైన్ అందించడం రెనాల్ట్ మోడళ్లకీ సక్సెస్ రీజన్‌గా చెప్పవచ్చు. మొత్తం మీద, నవంబర్ నెల రెనాల్ట్‌కు అత్యంత విజయవంతమైనది.

సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వచ్చిన GST సవరణలు రెనాల్ట్‌కు నిజమైన గేమ్‌చేంజర్‌గా మారాయి. పన్ను తగ్గింపుల కారణంగా కార్ల ధరలు మరింత పోటీ స్థాయికి చేరుకోవడంతో, కొనుగోలుదారులు రెనాల్ట్ వైపు మరింత ఆకర్షితులయ్యారు. ఇదే సమయంలో, కంపెనీ కిగర్, ట్రైబర్ మోడళ్లను కొత్త రూపాల్లో, మెరుగైన ఫీచర్లు, ఫ్రెష్ స్టైలింగ్‌తో మార్కెట్‌లో విడుదల చేయడం కూడా అమ్మకాలపై నేరుగా పాజిటివ్ ప్రభావం చూపింది.
ఈ రెండు ప్రధాన కారణాలు.. ధరల తగ్గింపు, కొత్త మోడల్ అప్‌డేట్స్ సంయుక్తంగా పనిచేయడంతో రెనాల్ట్ నవంబర్ అమ్మకాల్లో గణనీయమైన పెరుగుదల నమోదు చేసింది. ప్రత్యేకంగా చూస్తే, ట్రైబర్ మళ్లీ కుటుంబాల ఫేవరిట్‌గా నిలిచి 2,064 యూనిట్లు అమ్ముడవ్వగా, సబ్-కాంపాక్ట్ SUV అయిన కిగర్ 1,151 యూనిట్లతో మంచి స్పందన పొందింది. ఎంట్రీ-లెవల్ సెగ్మెంట్‌లో స్థిరంగా కొనసాగుతున్న క్విడ్ కూడా 447 యూనిట్లు అమ్ముడవుతూ తన డిమాండ్‌ను నిలబెట్టుకుంది.

రెనాల్ట్ ట్రైబర్ ప్రసిద్ధ MPV మోడల్ రూ. 5.76 లక్షల నుండి రూ. 8.60 లక్షల (ఎక్స్-షోరూమ్) అందించబడుతుంది. 7 సీట్ల సౌకర్యంతో కుటుంబ ప్రయాణాలు మరింత సులభంగా, కంఫర్ట్‌గా ఉంటాయి. 1-లీటర్ సహజ పెట్రోల్ ఇంజన్‌తో వచ్చే ట్రైబర్ సిటీ రైడింగ్ నుంచీ హైవే డ్రైవింగ్ వరకు సమర్థవంతమైన పనితీరును అందిస్తుంది. సుమారు 20 కి.మీ మైలేజ్ ఇవ్వడం కూడా దీని బలమైన ప్రత్యేకతల్లో ఒకటి.
రెనాల్ట్ కిగర్ కూడా మంచి స్పందన పొందుతోంది. దీని ధర రూ. 5.76 లక్షల నుండి రూ. 10.34 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండడం వల్ల సబ్-కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో ఇది అత్యంత ప్రాక్టికల్, అఫోర్డబుల్ ఎంపికగా నిలిచింది. ఇది 5 సీటర్ కారు. ఇందులో 1.0-లీటర్. నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0-లీటర్. టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి. ఇది 19 నుండి 20 కి.మీ. మైలేజీని ఇస్తుంది.

రెనాల్ట్ క్విడ్ ఫ్లాగ్‌షిప్ హ్యాచ్‌బ్యాక్. దీని ధర రూ. 4.30 లక్షల నుండి రూ. 5.99 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. SUV-స్టైల్ బోల్డ్ డిజైన్, 5 సీట్లు, దూర ప్రయాణాలకు సరిపోయే కంఫర్ట్ లెవెల్ ఈ కారును చిన్న కుటుంబాల ప్రథమ ఎంపికగా నిలబెట్టాయి. 1-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే క్విడ్, 21-22 కి.మీ మైలేజీ అందించడం కూడా వినియోగదారులను మరింత ఆకర్షిస్తోంది.


Click it and Unblock the Notifications








