కమ్ముకున్న కారు చీకట్లను చీల్చుకుంటూ.. దీపావళి వెలుగులో కొత్త ఊపిరి తీసుకున్న రెనాల్ట్
ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ (Renault) భారతీయ విభాగం రెనాల్ట్ ఇండియా, అక్టోబర్ 2025 నెలలో నమోదు చేసిన సేల్స్ వివరాలను విడుదల చేసింది. దీని ప్రకారం ఈ నెలలో మెరుగైన గణంకాలను నమోదు చేసింది. కంపెనీ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఆ నెలలో మొత్తం 4,672 రెనాల్ట్ కార్లు భారత మార్కెట్లో అమ్ముడయ్యాయి. ఇది గత ఏడాది ఇదే నెలలో నమోదైన 3,861 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే గణనీయమైన వృద్ధి, అంటే 21% సంవత్సరాంతర వృద్ధి సాధించినట్లే. ఈ పెరుగుదల వెనుక ప్రధాన కారణాల్లో ఒకటి, కంపెనీ ఇటీవల మార్కెట్లోకి తీసుకొచ్చిన కొత్త ట్రైబర్ (Triber), కైగర్ (Kiger) మోడళ్లకు లభించిన భారీ ఆదరణ.
ఈ రెండు కార్లు మధ్యతరగతి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని డిజైన్ చేయబడినవే కావడంతో, తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు అందించటం వీటి విజయానికి కీలకంగా మారింది. అలాగే, కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన GST 2.0 సంస్కరణలు కూడా ఆటోమొబైల్ రంగంపై సానుకూల ప్రభావం చూపాయి. ముఖ్యంగా చిన్న కార్లపై పన్ను తగ్గింపు కారణంగా వినియోగదారులు మరింత ఉత్సాహంగా కొత్త వాహనాలను కొనుగోలు చేయడం ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో రెనాల్ట్ కూడా ఈ మార్పుల ఫలితాన్ని అనుభవిస్తూ, తన అమ్మకాల సంఖ్యను గణనీయంగా పెంచుకోగలిగింది. మొత్తం మీద, రెనాల్ట్ ఇండియా కోసం అక్టోబర్ నెల బలమైనదిగా నిలిచింది. GST సవరణల అనుకూల వాతావరణం, కొత్త మోడళ్ల విజయవంతమైన ఆవిష్కరణ, పండుగ సీజన్‌లో పెరిగిన డిమాండ్ ఇవన్నీ కలిసి రెనాల్ట్‌కు మార్కెట్లో మరోసారి బలమైన స్థానం తీసుకురావడానికి దోహదపడ్డాయి.
నెల వారీగా చూసినట్లయితే, రెనాల్ట్ ఇండియా అక్టోబర్ 2025లో మంచి అమ్మకాల ఊపును కొనసాగించింది. సెప్టెంబర్ 2025లో కంపెనీ దేశవ్యాప్తంగా 4,265 యూనిట్లను విక్రయించగా, అక్టోబర్ నెలలో అమ్మకాలు 9.54% వృద్ధి సాధించి 4,672 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ వృద్ధికి ప్రధాన కారణంగా పండుగ సీజన్ సమయంలో వచ్చిన భారీ కస్టమర్ స్పందన, కంపెనీ అందించిన ఆకర్షణీయ ఆఫర్లు, అప్‌డేటేడ్ కార్ మోడళ్ల పట్ల పెరిగిన ఆసక్తి అని చెప్పవచ్చు.

దేశవ్యాప్తంగా ఉన్న రెనాల్ట్ డీలర్‌షిప్‌లకు కస్టమర్ల రద్దీ గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా, వాహన్ విడుదల చేసిన తాజా రిటైల్ డేటా ప్రకారం, అక్టోబర్ నెలలో 5,041 రెనాల్ట్ కార్లు రిటైల్ స్థాయిలో విక్రయించబడ్డాయి, ఇది గత నెలతో పోలిస్తే మరింత బలమైన వృద్ధి. అలాగే, గత సంవత్సరం ఇదే కాలంలో నమోదైన అమ్మకాలతో పోలిస్తే 12.7% పెరుగుదల కనిపించింది.
ఈ గణాంకాలు రెనాల్ట్ తన మార్కెట్లో తిరిగి బలమైన స్థితిని సాధిస్తున్నదని సూచిస్తున్నాయి. కొత్త మోడళ్లు, మెరుగైన ఫీచర్లు, అందుబాటులో ఉన్న ధరల కలయిక కస్టమర్‌లలో విశ్వాసాన్ని మరింతగా పెంచాయి. భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో స్థిరమైన స్థానం సంపాదించడానికి గత కొన్ని సంవత్సరాలుగా రెనాల్ట్ కృషి చేస్తోంది.

మధ్యస్థాయిలో ఉన్న SUVలు, ఫ్యామిలీ కార్ల విభాగంలో పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ, రెనాల్ట్ తన నూతన మోడళ్లతో తిరిగి బలమైన గుర్తింపును పొందుతోంది. ముఖ్యంగా, కొత్త ట్రైబర్, కైగర్ మోడళ్లను ప్రవేశపెట్టడం ఈ వృద్ధికి కీలక పాత్ర పోషించింది. జూలైలో ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్, ఆగస్టులో కైగర్ ఫేస్‌లిఫ్ట్, అలాగే సెప్టెంబర్‌లో క్విడ్ 10వ వార్షికోత్సవ ఎడిషన్ వంటి మోడళ్లను వరుసగా ప్రవేశపెట్టడం ద్వారా కంపెనీ తన ఉనికిని బలోపేతం చేసింది.
ఈ మూడు లాంచ్‌లు మార్కెట్లో రెనాల్ట్‌కు మంచి ఊపును తెచ్చాయి. ఇక, కంపెనీ జనవరి 2026లో నెక్స్ట్ జనరేషన్ రెనాల్ట్ డస్టర్‌ను ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. ఈ మోడల్ రెనాల్ట్‌కు గేమ్‌చేంజర్‌గా మారే అవకాశం ఉంది. మొత్తం మీద, ఈ సరికొత్త వ్యూహాలతో రెనాల్ట్ భారత మార్కెట్లో తన స్థానాన్ని తిరిగి బలపరచుకుంటోంది.


Click it and Unblock the Notifications








