రెనాల్ట్ బంపర్ ఆఫర్: కొత్త కారు కొనాలంటే ఇదే సరైన టైమ్! ఒక్కో వేరియంట్ పై భారీ తగ్గింపు
ప్రతినెలా వాహన తయారీదారులు తమ సేల్స్‌ను పెంచుకోవడానికి కస్టమర్లను ఆకర్షించడం కోసం కార్లపై భారీ ఎత్తున తగ్గింపులు, డిస్కౌంట్స్, ఎక్స్చేంజ్ ఆఫర్స్ వంటివి అందిస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా జులై 2025ను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు, రెనాల్ట్ తన కార్లపై ఆకర్షణీయమైన ఆఫర్‌లను ప్రకటించింది. దీని ద్వారా కొత్తగా కారును కొనుగోలు చేయాలనే ఆలోచన చేస్తున్న వారిని తమ వైపు ఆకట్టుకోవడానికి వీలవుతుంది. దీంతో రెనాల్ట్ సేల్స్ పెరగడం వలన మంచి లాభం చేకూరుతుంది. రెనాల్ట్ తన MY2025 లైన్‌అప్‌లో ఆకర్షణీయమైన తగ్గింపులు ఇస్తుంది. కొన్ని ఎంపిక చేసిన వేరియంట్‌లపై గణనీయమైన నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు ప్రకటించింది. ఈ ఆఫర్లు ప్రధానంగా ఎంట్రీ-లెవల్ మోడళ్లను, అలాగే కాంపాక్ట్ విభాగంలో ఉన్న వాహనాలను టార్గెట్ చేస్తున్నాయి.
ప్రముఖ కార్ల తయారీదారుగా గుర్తింపు పొందిన రెనాల్ట్, ఇప్పటికే మార్కెట్లో తనకంటూ స్థిరమైన స్థానం సంపాదించింది. అయితే, పోటీ రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. అందుకే, కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు, అలాగే ఇప్పటికే తమ వాహనాలపై ఆసక్తి చూపుతున్న వారికి మరింత సౌలభ్యం కల్పించేందుకు, ఈ ప్రత్యేక ఆఫర్లను తీసుకువచ్చింది. నగదు తగ్గింపులు కేవలం కొంత మాత్రమే కాకుండా, సరైన ఎక్స్ఛేంజ్ డీల్‌తో కలిపితే తక్కువ అమౌంట్‌తో కారు సొంతం చేసుకోవచ్చు.

రెనాల్ట్ ఈ ఆఫర్లను పరిమితకాలం మాత్రమే అందిస్తోంది. కాబట్టి, కొత్త వాహనం కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నవారు త్వరలోనే షోరూమ్‌ను సంప్రదించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం మంచిది. మరింత ముఖ్యంగా, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, నగదు తగ్గింపులు వంటి ప్రయోజనాలు కొత్త కొనుగోలుదారుల ఆర్ధిక భారం కొంతవరకు తగ్గించడంలో సహాయపడతాయి. రెనాల్ట్ ట్రైబర్, కిగర్, క్విడ్ మోడళ్ల వారీగా కంపెనీ అందిస్తున్న ఆఫర్స్ గురించి కింద తెలుసుకుందాం.
రెనాల్ట్ ట్రైబర్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ జూలై నెల మరింత ఆసక్తికరంగా మారింది. సౌకర్యవంతమైన సీటింగ్ కాన్ఫిగరేషన్‌కి ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ కాంపాక్ట్ MPV, ఇప్పుడు దాని ఎంపిక చేసిన MY2025 వేరియంట్‌లపై రూ.50,000 విలువైన తగ్గింపు ఆఫర్‌తో లభిస్తోంది. ఈ మొత్తంలో రూ.25,000 వరకు నగదు తగ్గింపు, ప్రస్తుతం ఉన్న వాహనాన్ని ఎక్స్ఛేంజ్ చేసినప్పుడు మరొక రూ.25,000 వరకు అదనపు బోనస్ లభిస్తుంది.

ఇది కారు ధరను కాస్త తక్కువ చేసి కొనుగోలును సులభతరం చేస్తుంది. ట్రైబర్ అనేది కేవలం బడ్జెట్ ఫ్రెండ్లీ కారే కాదు, విశాలమైన ఇంటీరియర్, ఫ్లెక్సిబుల్ సీటింగ్ లేఅవుట్‌కి పేరుగాంచింది. సిటీలో రోజు ప్రయాణాల నుంచి, వీకెండ్ ఫ్యామిలీ ట్రిప్ వరకు, విభిన్న అవసరాలకు ఇది అద్భుతంగా సరిపోతుంది. ఇప్పుడు ఇంత భారీ ఆఫర్‌తో, ఈ కాంపాక్ట్ MPV మరింత చేరువయ్యేలా మారుతోంది.
రెనాల్ట్ MY2025 కిగర్ కొనుగోలు చేయాలని చూస్తున్నవారికి ఇది నిజంగా ఊరట కలిగించే వార్త. ఈ జులైలో కంపెనీ కిగర్ పై రూ.80,000 వరకు ఆదా చేసుకునే అవకాశాన్ని అందిస్తుంది. ఈ మొత్తంలో రూ.40,000 వరకు నగదు తగ్గింపు, పాత వాహనాన్ని ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.40,000 వరకు అదనపు బోనస్ కూడా లభిస్తుంది. అంటే కొత్త SUVను తక్కువ పెట్టుబడితో ఇంటికి తీసుకురావచ్చన్న మాట.

MY2025 రెనాల్ట్ క్విడ్ జులైలో తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. కారుపై మొత్తంగా రూ.25,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో రూ.10,000 నగదు తగ్గింపు ఉంది. పాత కారును ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.15,000 అదనపు బోనస్ పొందే అవకాశం ఉంటుంది. ఈ ఆఫర్ మొదటి కారును కొనే వినియోగదారులపై ఆర్థిక భారం కొంత మేర తగ్గిస్తుంది. ఈ ఆఫర్స్ పూర్తి వివరాల కోసం దగ్గరలోని షోరూమ్‌లో సంప్రదించగలరు.


Click it and Unblock the Notifications








