బంపర్ ఆఫర్: కొత్త కారు కొనడానికి ఇదే మంచి ఛాన్స్! మీ ఫేవరెట్ కార్లపై భారీ తగ్గింపు ఇస్తోన్న కంపెనీ
తక్కువ ధరలో అదిరిపోయే కార్లను కొనుగోలు చేయాలనే ఆలోచన చేస్తున్న వారికి రెనాల్ట్(Renault) కంపెనీ గుడ్‌న్యూస్ తీసుకొచ్చింది. కంపెనీ తన బెస్ట్ సెల్లింగ్ మోడళ్లైన క్విడ్, ట్రైబర్, కిగర్‌లపై ఆగస్టులో భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే అమ్మకాలను పెంచాలనే ఉద్దేశంతో, రెనాల్ట్ వినియోగదారులకు ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తోంది. వినియోగదారులను ఆకట్టుకోవడానికి సేల్స్ పెంచడానికి మోడళ్ల వారీగా కంపెనీ గరిష్ఠంగా రూ.90,000 వరకు ప్రయోజనాల వరకు అందిస్తుంది. ఇందులో కాష్ డిస్కౌంట్‌లు, ఎక్స్చేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ బెనిఫిట్స్ వంటి వాటితో పాటు ప్రత్యేకంగా ఎంపిక చేసిన వేరియంట్లపై అదనపు ఆఫర్లు కూడా ఉన్నాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు రెనాల్ట్ తీసుకున్న ఈ నిర్ణయం, పెరుగుతున్న మార్కెట్ పోటీ మధ్య మరింత సానుకూలతను తీసుకురానుంది.
ముఖ్యంగా చిన్న SUV కిగర్‌పై, ఫ్యామిలీ-ఫ్రెండ్లీ ట్రైబర్‌పై లభించే డిస్కౌంట్‌లు, ఆ కార్లను కొనాలనుకునే వారికిది సరైన టైమ్ అని చెప్పొచ్చు. రెనాల్ట్ క్విడ్ కారును కొనేందుకు ఈ ఆగస్టులో ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. కంపెనీ, ఎంపిక చేసిన వేరియంట్లపై గరిష్ఠంగా రూ.35,000 వరకు డిస్కౌంట్ బెనిఫిట్స్ ను అందిస్తోంది. ఇందులో ప్రత్యేకంగా మూడు రకాల ఆఫర్లు ఉన్నాయి, ఎంపిక చేసిన వేరియంట్లపై రూ.20,000 వరకు నగదు ప్రయోజనాలు లభిస్తున్నాయి.

ఇదే సమయంలో ఇప్పటికే ఒక వాహనం ఉన్న వినియోగదారులకు, అదే వాహనాన్ని మారుస్తే రూ.15,000 వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ లభిస్తుంది. ఇప్పటికే రెనాల్ట్ కస్టమర్ అయిన వారు, అవసరమైన లాయల్టీ డాక్యుమెంట్లు సమర్పించినట్లయితే, అదనంగా లాయల్టీ ఆఫర్ పొందవచ్చు. భారత మార్కట్లో దీని బేస్ వేరియంట్ ప్రారంభ ధర వచ్చేసి రూ.4.69 లక్షల ఎక్స్ షోరూమ్ ధర నుంచి ప్రారంభమవుతుంది.
రెనాల్ట్ కిగర్‌పై ఆగస్టు 2025 నాటికి అందిస్తున్న భారీ ప్రయోజనాలు వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ నెలలో రూ.90,000 వరకు గరిష్ఠ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి, ఇది కిగర్‌ను మార్కెట్లోని అత్యంత విలువైన కాంపాక్ట్ SUVలలో ఒకటిగా నిలబెడుతుంది. ఈ మొత్తంలో నేరుగా నగదు డిస్కౌంట్ ఎంపిక చేసిన వేరియంట్లపై రూ.40,000 వరకు నగదు తగ్గింపు లభిస్తుంది. ఇది వాహనం ధరను వెంటనే తగ్గిస్తుంది.

మీ పాత వాహనాన్ని ఎక్స్చేంజ్ చేస్తే లేదా స్క్రాపేజ్ పాలసీ ప్రకారం వదిలిస్తే రూ.50,000 వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ప్రయోజనాలను కలిపితే, రెనాల్ట్ కిగర్‌ను ఇప్పుడు కొనడం బడ్జెట్ పరంగా చాలా బాగా చక్కబెట్టిన డీల్. పలు వేరియంట్లలో లభిస్తున్న ఈ కారు బేస్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధరలు రూ.6.15 లక్షల నుంచి మొదలవుతుంది.
రెనాల్ట్ ట్రైబర్ విషయానికి వస్తే, రెనాల్ట్ ఇండియా ఈ ఆగస్టులో తన కాంపాక్ట్ 7-సీటర్ MPV పై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. కుటుంబం కోసం బడ్జెట్‌లో 7 సీటర్ కారును కొనేందుకు చూస్తున్నవారికి ఇది నిజంగా మంచి అవకాశం. ఎంపిక చేసిన వేరియంట్లపై రూ.35,000 వరకు నేరుగా తగ్గింపు, ఎక్స్ఛేంజ్/లాయల్టీ/స్క్రాపేజ్ ఆఫర్ల రూపంలో రూ.45,000 వరకు అదనపు ప్రయోజనాలు.మొత్తంగా కలిపితే, ట్రైబర్‌పై రూ.80,000 వరకు గరిష్ట ప్రయోజనాలు లభిస్తున్నాయి.

డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య ఏమిటంటే, పైన పేర్కొన్న ఆఫర్స్ గురించి మీ దగ్గరలోని రెనాల్ట్ షోరూమ్‌లలో సంప్రదించి పూర్తిగా తెలుసుకోగలరు. ఎందుకంటే కొన్ని సార్లు ఆఫర్స్ అనేవి నగరాలను, ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. కాబట్టి ఈ ఆఫర్స్‌ను ఉపయోగించకుని తక్కువ ధరలో కారును కొనడానికి ముందుగానే అన్ని వివరాలను తెలుసుకోగలరు.


Click it and Unblock the Notifications








