3 ఏళ్లు.. 1 లక్ష కి.మీల వారంటీ.. ఇది మామూలు ఆఫర్ కాదు భయ్యా.. 2025లో ఈ కార్ల కోసం కచ్చితంగా ఎగబడతారు
దేశీయంగా కార్ల వాడకం విపరీతంగా పెరిగింది. దీంతో తయారీదారులు పోటీ పడి మరి పలు కొత్త కొత్త మోడళ్లను విడుదల చేస్తూ ఎక్కువ మంది కస్టమర్లను తమ కార్లను కొనుగోలు చేసేలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణంగా కంపెనీలు పండుగల సమయంలో తమ కార్లపై వివిధ తగ్గింపు ఆఫర్లను అందిస్తూ సేల్స్ పెంచుకోవాలని చూస్తారు. లేదంటే ఇయర్ ఎండ్ సమయంలో తమ పాత స్టాక్‌ను క్లియర్ చేసుకోడానికి బ్యాంక్ ఆఫర్స్, క్యాష్‌బ్యాకులు, డిస్కౌంట్స్, ఎక్స్చేంజ్ వంటివి అందించి కస్టమర్లను ఆకర్షిస్తుంటారు. అయితే ఇవే కాకుండా ఇంకా పలు విధాలుగా కస్టమర్లకు పలు ప్రయోజనాలను ఆఫర్ చేస్తూ కూడా సేల్స్‌ను పెంచుకోవాలని చూస్తారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ కంపెనీ రెనాల్ట్ (Renault) కొత్త ఏడాది (2025)లో కస్టమర్లను ఆకర్షించి తన సేల్స్‌ను మెరుగుపర్చుకోడానికి అదిరిపోయే ఆఫర్‌ను తీసుకొచ్చింది.
ఫ్రెంచ్‌కు చెందినటువంటి దిగ్గజ కార్ల కంపెనీ రెనాల్ట్ ఇండియాలో కూడా చాలా ఏళ్లుగా తన వాహనాలను విక్రయిస్తుంది. భారతీయ వాహన పరిశ్రమలో పోటీ వాతావరణం మరింత పెరిగిన తరుణంలో కస్టమర్లను తన వైపు తిప్పుకోవడానికి తన వాహనాలపై 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిమీ వారంటీ ప్లాన్‌ను అందిస్తున్నట్లు అదిరిపోయే ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఇది కొత్త ఏడాది సందర్భంగా జనవరి 1, 2025 నుంచి ప్రారంభమైంది.

ఈ సరికొత్త ఆఫర్‌తో కొత్త కస్టమర్ల సంఖ్య మరింత పెరుగుతుందని కంపెనీ భారీ అంచనాలు పెట్టుకుంది. జనవరి 1 నుంచి కొత్తగా రెనాల్ట్ కార్లను కొనుగోలు చేసే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. అన్ని కార్లకు 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిలోమీటర్ల వారంటీని కంపెనీ ఇస్తుంది. రెనాల్ట్ కార్లలో మెకానికల్, మెటీరియల్, తయారీ లోపాలు, ఎలక్ట్రికల్ వైఫల్యాలకు సంబంధించిన అన్నింటిని ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా పరిష్కరిస్తారు.
సాధారణంగా ఇలాంటి సమస్యలకు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ కొత్త ఏడాదిలో ప్రజల్లో అత్యుత్తమైన కార్ల కంపెనీగా మరింత పేరు సంపాదించడానికి, ఎక్కువ మంది కార్లను కొనుగోలు చేయడానికి ఏ వాహన తయారీ కంపెనీ అందించని విధంగా రెనాల్ట్ అదిరిపోయే ఆఫర్‌ను తెచ్చింది. ప్రస్తుతం కంపెనీ ఇండియాలో క్విడ్ (Kwid), కైగర్ (Kiger), ట్రైబర్ (Triber) అనే మూడు మోడల్స్‌ను మాత్రమే విక్రయిస్తుంది.

ఆఫర్‌లో భాగంగా కాంప్లిమెంటరీ కింద కస్టమర్లు 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ , యాక్సిడెంటల్ టోయింగ్ కవరేజీని కూడా పొందవచ్చు. కంపెనీ ఈ వారంటీ ప్లాన్‌ను తిరిగి పొడిగించుకునే అవకాశాన్ని కూడా అందిస్తుంది. వారంటీని 4 సంవత్సరాలు లేదా 1,00,000 కిమీలు, 5 సంవత్సరాలు లేదా 1,20,000 కిమీలు, 6 సంవత్సరాలు లేదా 1,40,000 కిమీలు, 7 సంవత్సరాలు లేదా అపరిమిత కిమీలు పొగించుకునే అవకాశాన్ని కూడా రెనాల్ట్ ఆఫర్ చేస్తుంది.
పొడిగించిన వారంటీ ప్లాన్‌లను అందించడానికి ప్రధాన కారణం తన కస్టమర్లకు అంతరాయం లేని సేవలు అందిండమే దీని ఉద్దేశం. దీంతో రెనాల్ట్ కంపెనీ 2025 ఏడాదిలో మెరుగైన అమ్మకాలను సాధించి ఇతర కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వబోతుంది. ఇదిలా ఉంటే రెనాల్ట్ కొత్త డస్టర్‌ను 2025లో దేశంలో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. అంచనాల ప్రకారం, ఇది 5 సీటర్, 7 సీటర్ ఆప్షన్లలో లభించవచ్చు.

రెనాల్ట్ కంపెనీకి డస్టర్ మోడల్ అత్యంత కీలకం. ఎందుకంటే దేశీయ మార్కెట్లో టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, మహీంద్రా వంటి దిగ్గజ కార్ల తయారీ కంపెనీలను దాటుకుని సేల్స్ పరంగా మెరుగైన గణంకాలు సాధించాలంటే డస్టర్ ఎక్కువ మంది కస్టమర్లకు చేరాల్సి ఉంటుంది. ఈ మోడల్‌తో మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకురాగలమని రెనాల్ట్ భావిస్తుంది.


Click it and Unblock the Notifications








