దేశంలో అత్యంత తక్కువ ధరకే 7 సీటర్ ఎస్‌యూవీ.. రెండు ఫ్యామిలీలు ఇబ్బంది లేకుండా వెళ్లవచ్చు!
భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ప్రత్యేక బ్రాండ్ సొంతం చేసుకున్న ఫ్రెంచ్ కంపెనీ రెనాల్ట్.. ఈ ఏడాది పక్కా ప్లాన్స్‌తో రాబోతోంది. ఇప్పటికే.. ఈ సంస్థ నుంచి క్విడ్ హ్యాచ్‌బ్యాక్, సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ అయిన కైగర్ (kiger), ట్రైబర్ ఎంపీవీతో అమ్మకాల్లో తన జోష్ చూపెట్టింది. ఈసారి ఈ సంస్థ తమ కార్లను అప్డేట్ చేసి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. న్యూ జనరేషన్ ట్రైబర్ ఎంపీవీ, కైగర్ ఎస్‌యూవీలను ఈ ఏడాది రెండో అర్ధభాగంలో లాంచ్ చేయనుంది. అలాగే ఇదే సంస్థ నుంచి మరో మోడల్ అయిన డస్టర్ ఎస్‌యూవీని 2026లో లాంచ్ చేయాలని తమ షెడ్యూల్ సెట్ చేసుకుంది. మరి ఈ అప్డేటెడ్ కార్లలో ఉండే విశేషాలేంటో చూసేద్దాం.
ప్రస్తుతం ఉన్న 3-రో ట్రైబర్ ఎంపీవీ దేశంలోనే అతి తక్కువ ధరకు లభించే ఎంపీవీగా పేరు సంపాదించింది. కొద్దిపాటి మార్పులతో ఈ ఎంపీవీని అప్గ్రేడ్ చేసి తీసుకురానుంది రెనాల్ట్ సంస్థ. అయితే ఈ కారు సిల్వెట్ (silhouette) లో పెద్దగా మార్పులేవీ ఉండకపోయినప్పటికీ.. ఈ కారు లోపలి వైపు, బయటివైపు కొంచెం కొత్త స్టైల్‌లో రానుంది. రెనాల్ట్ ఎస్కేప్ ఎంపీవీ మోడల్ కారు తరహాలో దీని డిజైన్ ఉండబోతుంది.

ఈ అప్డేటెడ్ ఎంపీవీలో ఫీచర్లను కూడా కాస్త ఎక్కువగానే జోడించి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇందులో లార్జ్ టచ్ స్క్రీన్, కనెక్టెడ్ కార్-టెక్, మెరుగైన బ్యాటరీ సేఫ్టీ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. పవర్‌ట్రెయిన్ విషయంలో మరింత మెరుగ్గా తయారు చేసి ఈ కారును తీసుకురానుంది రెనాల్ట్ సంస్థ. ప్రస్తుతం ఉన్న ఎంపీవీ కంటే... మరింత శక్తిమంతమైన, ఫ్యూయల్ ఎఫీషియంట్ ఇంజిన్‌తో దీన్ని అప్గ్రేడ్ చేయనుంది.
ఇక న్యూ జెనరేషన్ రెనాల్ట్ కైగర్ విషయానికి వస్తే.. ఇందులో భారీ మార్పులే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీని డిజైన్‌ను రెనాల్డ్ కార్డియన్ ఎస్‌యూవీ తరహాలో రూపొందించనున్నట్లు సమాచారం. ఈ కారుకు కొత్త ఫ్రంట్ ప్రొఫైల్, రీడిజైన్డ్ లైటింగ్ సెటప్ అమర్చనున్నారు. అంతేగాకుండా కొత్తగా డిజైన్ చేసిన అలాయ్ వీల్స్ ఇందులో ఉండబోతున్నాయి. అలాగే కొత్త ఇన్పోటెయిన్మెంట్ సిస్టంతో సహా కొత్త ఫీచర్లతో దీన్ని ప్రవేశపెట్టనున్నారు.

ఈ కొత్త కైగర్ మోడల్‌లో మెకానికల్ ఛేంజెస్ అయితే ఉండట్లేదనే చెప్పవచ్చు. ఈ కారు.. 1.0 నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.0 లీటర్ టర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో రానుంది. ట్రాన్సిమిషన్ ఆప్షన్ల విషయానికి వస్తే.. మ్యాన్యువల్, ఆటోమేటెడ్ గేర్ బాక్స్ లతో ఉండనుంది.
ఇక రెనాల్ట్ సంస్థ నుంచి భారత మార్కెట్లో చాలా మందికి ఫేవరెట్‌గా నిలిచిన ఎస్ యూవీ డస్టర్ మోడల్. ఈసారి ఈ మోడల్‌ను మళ్లీ ఇండియాలో తిరిగి ప్రవేశపటెట్టనున్నారు. అయితే.. ఇది కాస్త లేటుగా 2026లో ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. ఈ కొత్త డస్టర్ మోడల్.. Renault CMF-B platform ఆధారంగా రానుంది. దీని డిజైన్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా మార్పులు ఉండబోతున్నాయి.
ఈ కొత్త డస్టర్ మోడల్ కారు.. పెట్రోల్, హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో రానుంది. అలాగే దీన్ని 7 సీటర్ వర్షన్‌గా తీసుకురానున్నారు. ఇది అతి తక్కువ ధరలో లభించనుంది. ట్రైబర్, కైగర్, డస్టర్‌కు సంబంధించి ఈ న్యూ జనరేషన్ మోడళ్లను భారత వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తీసుకురానుంది రెనాల్ట్ సంస్థ. అలాగే సేల్స్ పెంచుకుని ప్రత్యర్థి సంస్థలకు గట్టి పోటీ ఇవ్వాలని నిర్ణయించుకుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








