టాటా-మారుతికి షాక్! అతి తక్కువ ధరకే కొత్త కారు లాంచ్.. మొత్తం మార్కెట్‌ షేక్ అయ్యే మోడల్ వచ్చేసింది!

ఫ్రెంచ్ కార్ల తయారీ దిగ్గజం రెనాల్ట్ గ్రూప్‌కు చెందిన అనుబంధ సంస్థ రెనాల్ట్ ఇండియా (Renault India), భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. ఈరోజు కొత్తగా అప్‌డేట్ చేసిన రెనాల్ట్ కిగర్ ఫేస్‌లిఫ్ట్ (Renault Kiger Facelift 2025)ను అధికారికంగా ఆవిష్కరించింది. కొత్త తరహా డిజైన్‌, అధునాతన సాంకేతికత, మెరుగైన భద్రతా ప్రమాణాలతో రూపొందించబడిన ఈ కారు, వినియోగదారులకు మరింత ప్రత్యేకమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించనుంది. ధరల విషయానికి వస్తే, 2025 రెనాల్ట్ కిగర్ ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధరను రూ.6.29 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఈ ధరతో ఇది భారత మార్కెట్లో లభిస్తున్న అత్యంత సరసమైన SUVలలో ఒకటిగా నిలుస్తోంది. మరింత ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారి కోసం, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.11.29 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించబడింది.

రీథింక్ పెర్ఫార్మెన్స్ కింద అభివృద్ధి చేయబడిన రెండవ కారు ఈ కొత్త కిగర్, శక్తివంతమైన పనితీరుతో, ఆకట్టుకునే డిజైన్, స్మార్ట్ టెక్నాలజీ, అత్యాధునిక భద్రతా ఫీచర్లు కలిగిన కారు. వినియోగదారుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని వివిధ వేరియంట్లలో ఈ SUV, రెనాల్ట్‌కి భారత మార్కెట్లో మరింత బలాన్ని తీసుకురావడం ఖాయం. కొత్త రెనాల్ట్ కిగర్ ఫేస్‌లిఫ్ట్ 2025 డిజైన్, సాంకేతికత, పనితీరు, భద్రత పరంగా అప్‌డేట్‌లతో ముందుకు వచ్చింది.

Renault kiger Facelift 2025 Model Launched In India Here Price And All Features

ఈ మోడల్‌లో ఎక్స్‌టీరియర్ మరింత ఆకట్టుకునేలా మార్పులు చేశారు. స్ట్రైకింగ్ ఫ్రంట్ గ్రిల్, పూర్తిగా కొత్త హుడ్ డిజైన్, రిడిజైన్ చేసిన ఫ్రంట్, రియర్ బంపర్లు, లేటెస్ట్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, టెయిల్‌ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్ వంటివి దీనిలో అమర్చబడ్డాయి. అదనంగా, 16 అంగుళాల డైమండ్ కట్ ఎవేజన్ అల్లాయ్ వీల్స్, స్కిడ్ ప్లేట్స్ స్పోర్టీ లుక్‌ను కలిగిస్తాయి. ఇంటీరియర్ విషయానికి వస్తే, మరింత ప్రీమియం ఫీల్‌ను అందించేలా అప్‌డేట్ చేశారు.

కొత్త డ్యుయల్-టోన్ డ్యాష్‌బోర్డ్, వెంటిలేటెడ్ లెదరెట్ సీట్లు, మెరుగుపరిచిన సీటు అప్‌హోల్స్‌ట్రీతో పాటు సౌండ్‌ను నిరోధకతను పెంచడం వల్ల క్యాబిన్‌లో ప్రశాంతమైన, లగ్జరీ అనుభవం లభిస్తుంది. సాంకేతిక పరిజ్ఞాన పరంగా కూడా ఇది మరింత కొత్తగా మారింది. మల్టీ-వ్యూ కెమెరా, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, రెయిన్-సెన్సింగ్ వైపర్స్, వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, 20.32 సెం.మీ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. ప్రీమియం 3D ARKAMYS సౌండ్ సిస్టమ్ కూడా ఉంది.

Renault kiger Facelift 2025 Model Launched In India Here Price And All Features

వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, PM2.5 ఎయిర్ ఫిల్టర్, డ్రైవర్స్ సైడ్ విండో ఆటో అప్/డౌన్ యాంటీ-పించ్‌, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, భద్రత పరంగా ఇది 21 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లతో వస్తోంది. 6 ఎయిర్‌బ్యాగ్స్, ESP(ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్ వంటి అధునాతన ఫీచర్లు అన్ని వేరియంట్లలోనూ అందుబాటులో ఉన్నాయి.

కొత్త రెనాల్ట్ కిగర్ ఫేస్‌లిఫ్ట్ 2025 భారత మార్కెట్లో నాలుగు ట్రిమ్‌లలో అథెంటిక్, ఎవల్యూషన్, టెక్నో, ఎమోషన్‌లలో అందుబాటులోకి వచ్చింది . ధరల పరంగా ఇది మరింత ఆకర్షణీయంగా ఉంది. NA పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లలో అథెంటిక్ ధర రూ.6.29 లక్షలు, ఎవల్యూషన్ రూ.7.09 లక్షలు, టెక్నో రూ.8.19 లక్షలు, ఎమోషన్ రూ.9.14 లక్షలుగా నిర్ణయించారు. ఇక టర్బో వేరియంట్లు రూ.9.99 లక్షల (ఎక్స్‌ట్రానిక్ టెక్నో) నుంచి ప్రారంభమవుతాయి.

Renault kiger Facelift 2025 Model Launched In India Here Price And All Features

మాన్యువల్ ఎమోషన్ రూ.9.99 లక్షలకే లభించగా, టాప్-స్పెక్ ఎక్స్‌ట్రానిక్ CVT ఎమోషన్ ధరను రూ.11.29 లక్షలుగా నిర్ణయించారు. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు. ఈ ధరలతో కిగర్ మార్కెట్లో అత్యంత సరసమైన సబ్-కాంపాక్ట్ SUVలలో ఒకటిగా నిలిచింది. పనితీరు విషయానికి వస్తే, ఫేస్‌లిఫ్టెడ్ కిగర్ రెండు పెట్రోల్ ఇంజన్లను కలిగి ఉంది. మొదటిది 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్, ఇది 72 bhp పవర్, 96 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

దీన్ని 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో పొందవచ్చు. హై-స్పెక్ వేరియంట్లలో 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంది, ఇది 100 bhp పవర్, 160 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీన్ని 5-స్పీడ్ మాన్యువల్ లేదా CVT ట్రాన్స్‌మిషన్ ఎంపికతో పొందే అవకాశం ఉంది. 2025 కిగర్ డీలర్ అమర్చిన CNG కిట్ కూడా లభిస్తోంది, అది 3 సంవత్సరాల వారంటీతో వస్తోంది.

More from DriveSpark

Article Published On: Sunday, August 24, 2025, 19:12 [IST]
English summary
Renault kiger facelift 2025 model launched in india here price and all features
Read more on: #renault #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+