రూ.6.29 లక్షల కారు ఎక్కువగా కొంటున్నారు.. ఈ ధరకు మంచి ఫీచర్స్, మైలేజ్, విదేశీ లుక్ ఉన్న వేరే ఏదీ మీకు దొరకదు
ఫ్రెంచ్ ఆటోమేకర్ రెనాల్ట్‌కు భారతీయ మార్కెట్‌తో ఉన్న అనుబంధం చాలాకాలంగా కొనసాగుతోంది. క్విడ్‌తో చిన్న కారు సెగ్మెంట్‌లో, డస్టర్‌తో SUV విభాగంలో కంపెనీ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంది. అయితే, భారతదేశంలో కాంపాక్ట్ SUVలకు పెరుగుతున్న డిమాండ్‌ను గమనించిన రెనాల్ట్, ఆ అవకాశాన్ని సరిగ్గా అందిపుచ్చుకుంది. అందుకే 2021లో రెనాల్ట్ కైగర్ అనే కొత్త మోడల్‌ను పరిచయం చేసింది. ఇది డిజైన్, ఫీచర్స్, పనితీరు అన్నింటినీ సమతూకంగా కలిపిన మోడల్‌గా నిలిచింది. ప్రారంభంలో క్విడ్‌ను కొందరు చిన్న SUV అంటూ ఎగతాళి చేసినప్పటికీ, కైగర్ మాత్రం సాధారణ వినియోగదారుల అవసరాలకు పూర్తిగా సరిపోయే విధంగా రూపుదిద్దుకుంది. అందమైన స్పోర్టీ డిజైన్, ఆధునిక ఇంటీరియర్, విస్తారమైన కేబిన్ స్పేస్, ఆకర్షణీయమైన ధర కారణంగా ఇది యువత నుంచి కుటుంబాల వరకూ అందరినీ ఆకట్టుకుంది.
ఇటీవలి కాలంలో విడుదలైన సెప్టెంబర్ 2025 అమ్మకాల గణాంకాలు కూడా కైగర్ ప్రాచుర్యాన్ని మరింత బలపరిచాయి. గత నెలలో రెనాల్ట్ కైగర్ ఫేస్‌లిఫ్ట్ మొత్తం 1,166 యూనిట్ల అమ్మకాలు సాధించింది. ఇది గత సంవత్సరం ఇదే కాలంలో నమోదైన 988 యూనిట్లతో పోలిస్తే 18.02 శాతం వృద్ధి అని చెప్పాలి. ఈ పెరుగుదల రెనాల్ట్ బ్రాండ్‌పై వినియోగదారుల విశ్వాసాన్ని, అలాగే కైగర్‌పై పెరుగుతున్న ఆదరణను స్పష్టంగా తెలియజేస్తుంది.

డిజైన్ పరంగా చూస్తే, కైగర్ ఫ్రంట్‌లో LED DRLs, డ్యూయల్-టోన్ ఎక్స్‌టీరియర్ ఫినిషింగ్, మస్క్యులర్ బాడీ లైన్‌లతో ఆధునికతను ప్రతిబింబిస్తుంది. ఇంజిన్ ఆప్షన్‌లలో 1.0 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్, టర్బో పెట్రోల్ వేరియంట్లు అందుబాటులో ఉండడం వల్ల, ఇది పనితీరు, మైలేజ్ పరంగా బెస్ట్‌గా చూపిస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా కైగర్ అప్‌డేట్ కావడం వల్ల ఇది వినియోగదారుల మనస్సు గెలుచుకుంది.
మార్కెట్లో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత, రెనాల్ట్ కైగర్‌కు ఫేస్‌లిఫ్ట్ ఇచ్చింది. ట్రైబర్ తర్వాత రెనాల్ట్ రీథింక్ బ్రాండ్ ట్రాన్స్ఫర్మేషన్ స్ట్రాటజీ కింద విడుదల చేయబడుతున్న రెండవ మోడల్ ఇది. రెనాల్ట్ తాజాగా విడుదల చేసిన కైగర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వాటి ధరలు వరుసగా రూ. 6.29 లక్షలు, రూ. 7.09 లక్షలు, రూ. 8.19 లక్షలు, రూ. 9.14 లక్షలు(ఎక్స్-షోరూమ్).

టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే వేరియంట్ల ధరలు రూ. 9.99 లక్షల నుండి ప్రారంభమవుతాయి, ఇక మాన్యువల్ ఎమోషన్ వేరియంట్ ధర రూ. 9.99 లక్షలు, టాప్-స్పెక్ ఎక్స్‌ట్రానిక్ CVT ఎమోషన్ ధర రూ.11.29 లక్షలు వరకు ఉంది. 2025 ఎడిషన్‌లో కంపెనీ ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ రెండు విభాగాల్లోనూ గణనీయమైన అప్‌గ్రేడ్‌లు చేసింది. దీని లోపల కొత్త రంగు థీమ్స్, మెరుగైన ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్రీమియం మెటీరియల్స్ వాడారు.
మైలేజ్ విషయానికి వస్తే, కైగర్ నిజంగా తన శ్రేణిలో మైలేజ్ పులి అని చెప్పుకోవచ్చు. నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ లీటరుకు 19.83 కి.మీ వరకు మైలేజ్‌ను అందిస్తే, మరింత శక్తివంతమైన టర్బో పెట్రోల్ ఇంజిన్ లీటరుకు 20.38 కి.మీ ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇది పనితీరు, ఇంధన వినియోగం రెండింటినీ సమతూకంగా కలిపిన ప్యాకేజ్ అని చెప్పాలి.



Click it and Unblock the Notifications








