సామాన్యులకు గుడ్‌న్యూస్.. ఇక పెట్రోల్, డీజిల్ ఖర్చు అక్కర్లేదు.. బెస్ట్ మైలేజ్ ఇచ్చే CNG కార్లు వచ్చేశాయ్
భారతదేశంలో సాంప్రదాయ పెట్రోల్, డీజిల్ కార్లతో పాటు CNG లకు డిమాండ్ పెరుగుతుంది. ప్రతి ఏడాది పలు కార్ల తయారీదారుల సేల్స్ వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే వీటికి మార్కెట్లో ఏ మేరకు ఆదరణ లభిస్తుందో తెలిసిపోతుంది. ప్రధానంగా CNG కార్ల నిర్వహణ చాలా వరకు తక్కువగా ఉంటుంది. మైలేజ్ విషయంలో అయితే మరో ఆలోచనే అవసరం లేదు. కస్టమర్లకు సంతృప్తి పరిచేలా కిలో ఇంధనానికి పెట్రోల్, డీజిల్ కార్ల కంటే కూడా ఎక్కువగా ఇస్తాయి. ప్రస్తుతం వీటి ధరలు భారీగా ఉండటంతో ప్రజల చూపు CNG లపై పడింది. అందుకే మార్కెట్లో లభిస్తున్న ఈ సెగ్మెంట్ వాహనాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న కార్లలో ఈ కిట్‌లను అమర్చి తయారీదారులు విడుదల చేస్తున్నారు. దీంతో తాజాగా రెనాల్ట్ ఇండియాలో కాంపాక్ట్ SUV కైగర్, కాంపాక్ట్ MPV ట్రైబర్, క్విడ్ కార్లను CNG వెర్షన్‌లో లాంచ్ చేసింది.
ఫ్రెంచ్‌కు చెందిన వాహన తయారీ సంస్థ అయిన రెనాల్ట్ (Renault) ఇండియాలో మంచి మార్కెట్‌ను కలిగి ఉంది. ముఖ్యంగా దాని ప్రసిద్ధ మోడల్ డస్టర్ (Duster) దేశంలో అత్యంత డిమాండ్ ఉన్న కార్ల జాబితాలో స్థానం పొందింది. చాలా మంది ఈ కారును కొనుగోలు చేశారు. ఈ రేంజ్‌లో డిమాండ్ ఉన్న రెనాల్ట్ డస్టర్‌ను నిలిపివేయగా అప్పటి నుంచి అమ్మకాల పరంగా తీవ్ర ఇబ్బంది పడుతుంది.

ఇదే సమయంలో ఇతర కార్ల తయారీదారులు మాత్రం తమ అమ్మకాలతో దూసుకుపోతున్నారు. దీంతో కంపెనీ తనకు బాగా కలిసివచ్చిన మూడు కార్లు క్విడ్ (Kwid), కైగర్ (Kiger), ట్రైబర్ (triber)లలో ప్రత్యేకంగా CNG కిట్‌లను అమర్చి తాజాగా విడుదల చేసింది. ఇవి ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న మోడళ్లు. కంపెనీ తన సేల్స్‌ను పెంచుకోడానికి మారుతీ, టాటా, హ్యుందాయ్‌లతో పోటీ పడటానికి ఈ పని చేసింది.
భవిష్యత్తు ప్రణాళికలో భాగంగా రెనాల్ట్ Cng కార్లను విడుదల చేసింది. దీంతో ప్రత్యర్థులకు ఇకపై గట్టి పోటీ ఎదురుకానుంది. ఫ్యాక్టరీలో అమర్చిన CNG కిట్‌తో క్విడ్, కైగర్, ట్రైబర్ మోడళ్లను మొదటగా ఇండియాలో ఎంపిక చేసిన రాష్ట్రాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీ, గుజరాత్, యూపీ, హర్యానా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో వీటిని కొనుగోలు చేయడానికి వీలవుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో అందుబాటులో లేవు.

తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతానికి క్విడ్, కైగర్, ట్రైబర్ Cng వెర్షన్లు లభించడం లేదు. కానీ ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌ను బట్టి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రధాన నగరాలతో పాటు పట్టణాల్లో కూడా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ఇవి లభిస్తున్న రాష్ట్రాల్లోని ప్రజలు ఈ కార్లను కొనుగోలు చేయడానికి అదనంగా రూ.75,000 చెల్లించాల్సి ఉంది. ఇది స్టాండర్డ్ వేరియంట్ షోరూమ్ ధర కంటే ఎక్కువ.
అలాగే, కైగర్, ట్రైబర్ కార్లకు అయితే స్టాండర్డ్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర కంటే రూ.79,500 ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఈ CNG రెట్రోఫిటెడ్ కార్లపై మూడేళ్ల వారంటీని రెనాల్ట్ అందిస్తుంది. Cng కిట్‌తో వీటి మైలేజ్ భారీగా పెరుగుతుంది. పాత మోడళ్లలో ఉన్నట్లుగానే డ్రైవింగ్ అనుభూతి వీటిలో కూడా ఉంటుందని కంపెనీ తెలిపింది. Cng తో వీటి మైలేజ్ దాదాపు 30 కిమీలకు పైనే వస్తుందని తెలుస్తోంది.

డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య ఏమిటంటే: భారతదేశంలో SUVలతో పోలిస్తే సెడాన్‌ల అమ్మకాలు తగ్గముఖం పడుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 10 సెడాన్ మోడల్స్ బడ్జెట్ ధరలో కొనుగోలుకు ఉన్నాయి. సెడాన్ కార్ల అమ్మకాలు నెల నెలా తగ్గుతున్నప్పటికి మారుతి సుజుకి డిజైర్ అమ్మకాలు మాత్రం సానుకూలంగానే ఉన్నాయి. ఇతర కంపెనీలు తమ సెడాన్ విక్రయాలను పెంచడంపై దృష్టి సారించాయి. రానున్న రోజుల్లో వీటి సేల్స్ కూడా పెరిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








