రూ. 4.5 లక్షలకే 23 కి.మీల మైలేజ్ ఇచ్చే కారు.. చిన్న కుటుంబాలు మరో ఆలోచన లేకుండా కొనచ్చు!

ఇండియాలో చిన్న కుటుంబాల కార్లకు ఎప్పుడు ఆదరణ ఉంటుంది. దశాబ్దాల కాలంగా ఎస్‌యూవీలు, ఎంపీవీ మోడళ్లు విడుదల అవుతున్నప్పటికి కూడా హ్యాచ్‌బ్యాక్ కార్లకు మాత్రం డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. తక్కువ ధరలో లభించడం, అలాగే మంచి మైలేజ్‌తో పాటు మెరుగైన పెర్ఫామెన్స్ అందించడం వంటి పలు కారణాలతో ఈ సెగ్మెంట్ కార్లను దేశంలో అధికంగా కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మంచి ఆదరణ కలిగి ఉన్న కార్లలో రెనాల్ట్ క్విడ్ (renault kwid) ఒకటి. ఇది చిన్న కుటుంబ వినియోగదారులకు అత్యంత అనువైన మోడల్. తాజాగా ఈ కారులో 2024 డిసెంబర్ నెలలో ఎన్ని సేల్స్ నమోదు చేసిందో ఆ వివరాలు వెల్లడయ్యాయి. రెనాల్ట్ నుంచి వచ్చిన డేటా ప్రకారం, గత ఏడాది డిసెంబర్‌లో ఈ కారును 628 మంది కొనుగోలు చేశారు.

అదే దాని ముందు నెల నవంబర్‌లో మాత్రం కేవలం 546 మంది మాత్రమే కొనుగోలు చేశారు. ఒక నెల రోజుల వ్యవధిలోనే ఇది 13.06 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. ఈ హ్యాచ్‌బ్యాక్ ఇండియాలు పేదలు, మధ్యతరగతి వారు కొనగలిగే విధంగా రూ.4.70 లక్షల ప్రారంభ ధరతో లభిస్తుంది. ఇది ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర. అదే దీని టాప్ వేరియంట్‌ను ఎంచుకున్నట్లయితే ఇది రూ.6.45 లక్షలుగా ఉంది.

Renault Kwid Hatchback

ఇవన్నీ కూడా ఎక్స్ షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికి రెనాల్ట్ క్విడ్ సాధారణ ప్రజలకు కొనుగోలు చేసే విధంగా అందుబాటు ధరలోనే లభిస్తుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌లో పనిచేస్తుంది. ఇది 68 ps పవర్, 91 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు 5 స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

రెనాల్ట్ క్విడ్ హ్యాచ్‌బ్యాక్‌‌లో RXE, RXL(O), RXT, క్లైంబర్ అనే పలు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది కీలెస్ ఎంట్రీ, 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల ORVMలు, మాన్యువల్ AC వెంటిలేషన్, నాలుగు పవర్ విండోలు, ప్రయాణికుల భద్రత కోసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), వెనుక పార్కింగ్ సెన్సార్లు వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.

Renault Kwid Hatchback December 2024 Sales

ఈ కారు పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ 28 లీటర్లుగా ఉంది. కారు చూడటానికి చిన్నగా అనిపించినప్పటికీ కూడా లోపల లగేజీని పెట్టుకోవడానికి 279 లీటర్ల బూట్ స్సెస్ ఉంది. మైలేజ్ విషయానికి వస్తే దాదాపు 23 కి.మీల వరకు వస్తుంది. రెనాల్ట్ క్విడ్ హ్యాచ్‌బ్యాక్‌‌ మెరుగైన ఇంజిన్ పనితీరును కనబర్చడంలో ముందు స్థానంలో ఉంది. దీని ఎక్స్‌టీరియర్ డిజైన్ కూడా చాలా ఆకట్టుకునే విధంగా ఉంటుంది.

అల్లాయ్ వీల్స్ కారు బయట అందాన్ని పెంచుతుంది. ఇంటీరియర్ కూడా ఇతర కార్లతో పోలిస్తే సరికొత్తగా అనుభూతిని ఇస్తుంది. రెనాల్ట్ క్విడ్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో మారుతీ సుజుకీ ఎస్-ప్రెస్సో, ఆల్టో కె10, హ్యుందాయ్ ఎక్స్‌టర్, టాటా పంచ్ వంటి మోడళ్లకు గట్టి ప్రత్యర్థిగా నిలుస్తుంది.

Renault Kwid Design

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, January 27, 2025, 11:52 [IST]
English summary
Renault kwid hatchback sales 13 percent growth rate in december 2024
Read more on: #renault #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+