ఒకప్పుడు సింహం లాంటి కారు... నేడు ఇంత దారుణమైన స్థితిలో ఉందా? అమ్మకాలు ఎందుకు పడిపోతున్నాయ్?

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ రెనాల్ట్ తాజాగా తన ప్రసిద్ధ మోడల్ క్విడ్ (kwid)కు సంబంధించి మే నెలలో నమోదు చేసిన సేల్స్ వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం, ఒకప్పుడు భారతీయ ఆమోదాన్ని పొందిన బడ్జెట్ ఫ్రెండ్లీ కారు రెనాల్ట్ క్విడ్ సేల్స్ పరంగా ఇబ్బంది పడుతుంది. SUVలా కనిపిస్తూ హ్యాచ్‌బ్యాక్‌కి లభించని స్టైల్‌తో కొంతకాలం క్రితం వరకు నగర వాసులకి మొదటి ఎంపికగా నిలిచింది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. ధరలు తగ్గినా, కస్టమర్ల ఆదరణ తగ్గిపోతోంది. 2025 మే నెలలో విడుదలైన తాజా అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, కేవలం 540 యూనిట్లే అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఇదే గడిచిన ఏడాది మే నెలతో పోలిస్తే భారీ తగ్గుదల.

ఆ సమయంలో 743 క్విడ్ కార్లు అమ్ముడయ్యాయి. అంటే విక్రయాల్లో సుమారుగా 27 శాతం మేర పడిపోయింది. ఇక్కడితో ఆగలేదు. మార్చి-ఏప్రిల్ మధ్య గమనించినా అదే తగ్గుదల కనిపించింది. ఏప్రిల్ 2025లో 595 కార్లు అమ్ముడవ్వగా, మేలో అది మరింత తక్కువైందంటే, కొనుగోలుదారుల ఆసక్తి మెల్లగా తగ్గిపోతుందని చెప్పవచ్చు. దీని వెనుక గల ప్రధాన కారణాలు ఉన్నాయి. మార్కెట్లోకి కొత్త వాహనాల రాక, మారుతున్న వినియోగదారుల అభిరుచులు వంటివి.

Renault Kwid

అలాగే, ఇంకా ప్రధానంగా క్విడ్ మోడల్‌కు అవసరమైన కొత్త అప్‌డేట్స్ లేకపోవడం వంటి పలు అంశాల కారణంగా క్విడ్ మార్కెట్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. సాధారణంగా భారతీయుల బడ్జెట్‌కి సరిపోయేలా ఉండే కారుల్లో రెనాల్ట్ క్విడ్ ఒక ప్రసిద్ధ పేరు. SUV లుక్స్‌తో హ్యాచ్‌బ్యాక్ స్టైల్‌ను మిళితం చేస్తూ, నగర ప్రయాణాల కోసం డిజైన్ చేసిన ఈ కారు ధర విషయానికి వస్తే మాత్రం నిజంగా ఆకర్షణీయంగానే ఉంటుంది.

ప్రస్తుతానికి, ఈ కారును రూ.4.70 లక్షల ప్రారంభ ధరతో(ఎక్స్-షోరూమ్) పొందవచ్చు. ఇది ఎంట్రీ-లెవల్ RXE 1.0 లీటర్ వేరియంట్ ధర. మరింత ఫీచర్లతో కూడిన టాప్ వేరియంట్ CLIMBER 1.0 AMT DT ధర రూ.6.45 లక్షలు. ఈ రెండు ధరల మధ్య ఫీచర్ల ఆధారంగా ధర విషయంలో వ్యత్యాసం ఉంది. ధర పరంగా అన్ని వర్గాల వినియోగదారులకు అందుబాటులో ఉన్నప్పటికి అమ్మకాల పరంగా క్విడ్ మాత్రం కష్టాల్లో ఉంది.

Kwid May 2025 Sales Recorded 27 Percent Down

ప్రతి నెలా అమ్మకాలు క్రమంగా పడిపోతున్నాయి. 2025 మే నెలకు వచ్చిన గణాంకాలు చూస్తే ఇది స్పష్టమవుతుంది. అసలు ధర తక్కువగా ఉండడమే కాకుండా, క్లాసిక్ SUV శైలి కూడా ఉన్నా, వినియోగదారుల అభిరుచులు మారిపోతుండటమే దీని వెనుక ప్రధాన కారణం. మార్కెట్లోకి మునుపెన్నడూ లేని పోటీ వస్తుండటం, అలాగే క్విడ్ మోడల్‌కు ఆధునిక ఫీచర్ల అప్‌డేట్ రాకపోవడం కూడా ఇందులో భాగమే.

రెనాల్ట్ క్విడ్ భారత్‌లో తొలి అడుగు వేసి సెప్టెంబర్‌తో దశాబ్దాన్ని పూర్తిచేసుకోబోతోంది. 2015 సెప్టెంబర్‌లో మార్కెట్లోకి ప్రవేశించిన ఈ కార్ అప్పట్లో సరికొత్త సంచలనం. తక్కువ ధరలో SUV లాంటి లుక్ ఉన్న కారు! అనే కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టింది. రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే, రెనాల్ట్ క్విడ్ మీద భారీ ఆసక్తి నెలకొంది. దీనికి కారణం, ఆకర్షణీయమైన SUV తరహా డిజైన్, తగిన ధర, ఫ్యూయల్ ఎఫిషియెన్సీ.

Renault Kwid May 2025 Sales

మార్కెట్లోకి కొత్తగా వచ్చినప్పటికీ, చాలా మందికి ఇది మొదటి కారుగా మారింది. కేవలం పెద్ద నగరాలే కాదు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా గణనీయమైన స్థాయిలో ఆదరణ పొందింది. ప్రారంభ సంవత్సరాల్లో క్విడ్ అమ్మకాలు రెనాల్ట్ కంపెనీకి ఊపిరినిచ్చాయి. కొన్ని నెలల పాటు ఇది అత్యధికంగా అమ్ముడైన చిన్న కార్లలో ఒకటిగా నిలిచింది. ఫ్యామిలీ కార్ కోసం చూస్తున్న వారికి, తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వచ్చిన పెద్ద అవకాశంగా మారింది.

More from DriveSpark

Article Published On: Wednesday, June 18, 2025, 10:50 [IST]
English summary
Renault kwid may 2025 sales recorded 27 percent down compared to previous
Read more on: #renault #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+