ఈ కారును కేవలం నాలుగున్నర లక్షలకు అమ్ముతున్నారు.. చిన్న కుటుంబాలకు బెస్ట్ ఆప్షన్
రెనాల్ట్ క్విడ్ (Renault Kwid) గత కొన్నేళ్లుగా భారత ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లో తనదైన ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. స్టైలిష్ లుక్స్, బడ్జెట్-ఫ్రెండ్లీ ధర, సరిపోయే మైలేజ్ కారణంగా చాలా మంది మొదటి కారు కొనుగోలుదారులు క్విడ్‌ను మంచి ఎంపికగా భావిస్తారు. ఇదే కారణంగా ఈ కారుకు మంచి డిమాండ్ కొనసాగుతూనే ఉంది. తాజాగా వెలువడిన సేల్స్ గణాంకాలు కూడా ఈ విషయాన్నే మరొకసారి నిరూపించాయి. సెప్టెంబర్ 2025లో కేవలం 512 యూనిట్లను మాత్రమే విక్రయించిన రెనాల్ట్ క్విడ్, తదుపరి నెలలో అమ్మకాల పరంగా మరింత పుంజుకుంది. అక్టోబర్ 2025లో మొత్తం 554 యూనిట్లను విక్రయించి, గత నెలతో పోలిస్తే 42 కార్ల అదనపు అమ్మకాలను నమోదు చేసింది.
ఈ చిన్న సంఖ్యే అయినా, ఎంట్రీ-లెవల్ సెగ్మెంట్‌లో ఇది మంచి పాజిటివ్ గ్రోత్‌గా పరిగణించబడుతుంది. మొత్తం మీద కేవలం 30 రోజుల్లో అమ్మకాలు 7.58 శాతం పెరగడం, రెనాల్ట్ క్విడ్‌కు మార్కెట్లో ఇంకా స్థిరమైన డిమాండ్ ఉందని మరోసారి స్పష్టంచేస్తున్నది. పెరుగుతున్న పోటీ మధ్య క్విడ్ ఇలా నిలకడగా సేల్స్ సాధించడం, ఈ కారుపై కస్టమర్ల నమ్మకం ఇంకా తగ్గలేదనే విషయాన్ని చూపిస్తుంది.

ధరలో అందుబాటులో ఉండడంతో పాటు, నగరాల్లో డ్రైవింగ్‌కు అనువుగా ఉండే డిజైన్ కూడా ఈ అమ్మకాలకు బలమైన కారణాలుగా మారాయి. అమ్మకాలలో వృద్ధి నమోదైనప్పటికీ, రెనాల్ట్ క్విడ్ మొత్తం మార్కెట్ పనితీరు మాత్రం ఇప్పటికీ సాపేక్షంగా బలహీనంగానే కొనసాగుతోంది. ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో ఇదే పరిస్థితి ఇతర మోడళ్లకు కూడా కనిపించడం ఆసక్తికర విషయం. దీనికి ప్రధాన కారణంగా భారతీయ కస్టమర్ల కొనుగోలు ధోరణిలో చోటుచేసుకున్న మార్పులే చెప్పాలి.
ఇప్పటివరకు చిన్నది, సులభంగా కొనగలిగేది అనే అభిప్రాయంగా ఎంట్రీ-లెవల్ కార్లకు మంచి డిమాండ్ ఉండేది. కానీ గత కొన్నేళ్లలో వినియోగదారుల ప్రాధాన్యతలు గణనీయంగా మారాయి. కొంచెం ఎక్కువ ఖర్చయినా, స్పేస్, సేఫ్టీ ఫీచర్లు, SUV-లాంటి రోడ్ ప్రెజెన్స్ ఉన్న కార్లను వారు ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు. చిన్న హ్యాచ్‌బ్యాక్‌లు అందించే పరిమిత స్పేస్, తక్కువ ప్రీమియం ఫీల్, ఇంకా గట్టి పోటీలోకి వచ్చిన కాంపాక్ట్ SUVలతో పోలిస్తే ఫీచర్లు లోపంగా ఉన్నాయి.

రెనాల్ట్ క్విడ్ భారత మార్కెట్లో ధర పరంగా ఇప్పటికీ అత్యంత అందుబాటులో ఉండే కార్లలో ఒకటి. ఎక్స్-షోరూమ్ ధరల ప్రకారం, బేస్ వేరియంట్ రూ.4.30 లక్షల వద్ద ప్రారంభమవుతుండగా, అత్యంత సౌకర్యాలతో వచ్చే టాప్ వేరియంట్ కూడా కేవలం రూ.5.99 లక్షల వరకే ఉంది. పెరుగుతున్న కార్ల ధరల నేపథ్యంలో ఈ ప్రైసింగ్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. పనితీరును పరిశీలిస్తే, క్విడ్‌లో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను అందిస్తోంది రెనాల్ట్.
ఈ ఇంజిన్ నగర ప్రయాణాలకు సరిపోయేలా, మంచి మైలేజ్‌ను ఇవ్వడంలో ప్రసిద్ధి. డ్రైవింగ్‌కు అనుగుణంగా కస్టమర్లు రెండు గేర్‌బాక్స్ ఎంపికలను ఎంచుకోవచ్చు, ఒకటి సాంప్రదాయ 5-స్పీడ్ మాన్యువల్, మరొకటి సులభమైన, ట్రాఫిక్ పరిస్థితుల్లో ఎంతో ఉపయోగకరమైన AMT ఆటోమేటిక్. రెనాల్ట్ క్విడ్ ధర పరంగా చిన్న కారైనా, ఫీచర్ల విషయానికి వస్తే మాత్రం పెద్ద కేటగిరీ కార్లను కూడా తలపించే స్థాయిలో ఉంటుంది.

సేఫ్టీ విషయానికి వస్తే, రెనాల్ట్ ఈ చిన్న కారులోనే పెద్ద కార్లకు దక్కే స్థాయి రక్షణను అందిస్తోంది. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ABS వంటి ఆధునిక ఫీచర్లు డ్రైవర్ నమ్మకాన్ని పెంచుతాయి. మరింత ముఖ్యంగా, 3-పాయింట్ సీట్ బెల్టులు, 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉండటం ఈ ధరలో దొరకడం నిజంగా గొప్ప విషయమే.


Click it and Unblock the Notifications








