రూ.5.73 లక్షలకే కారు వస్తుంది! అది కూడా అన్ని ఫీచర్స్‌తో.. ఇంత మంచి మోడల్‌ను ఎంత మంది కొన్నారో తెలుసా?
దిగ్గజ వాహన తయారీ కంపెనీ రెనాల్ట్ (Renault) చాలా కాలంగా భారత్‌లో సత్తా చాటడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. దేశంలోని మధ్య తరగతి, సంపన్న వర్గాల వారిని లక్ష్యంగా చేసుకుని పలు మోడళ్లను విక్రయిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా తన ప్రసిద్ధ మోడల్ క్విడ్ (kwid)కు సంబంధించిన అమ్మకాల వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం, జూన్ 2025 నెలలో కేవలం 449 యూనిట్లు మాత్రమే విక్రయించగలిగింది. ఇది గడిచిన ఏడాది ఇదే నెలలో నమోదైన 603 యూనిట్లతో పోలిస్తే దాదాపుగా 26 శాతం తగ్గుదల అని చెప్పవచ్చు. అంటే గత ఏడాదితో పోలిస్తే అమ్మకాల్లో 154 యూనిట్ల తగ్గుదల ఉంది. కేవలం నగర ప్రయాణాలకు సరిపడే కారుగా మాత్రమే కాకుండా, స్టైలిష్‌గా ఉండాలని కోరుకునే కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఉన్న ఈ కారును గత నెలలో తక్కువ మంది ఎంచుకున్నారు.
రెనాల్ట్ క్విడ్(Renault Kwid) భారత మార్కెట్లోకి సెప్టెంబర్ 2015లో అడుగుపెట్టింది. అప్పటివరకు చిన్న కార్ల విభాగంలో ఆధిపత్యం చూపుతున్న ఇతర మోడళ్లకు గట్టి పోటీనివ్వగలిగేలా, కొత్త డిజైన్, ఆకర్షణీయమైన ధర, మంచి మైలేజ్ అంశాలతో ఇది వచ్చింది. ఆ సమయంలో రెనాల్ట్ క్విడ్ మార్కెట్‌లో మంచి ఆదరణ పొందింది. దీని విశిష్టమైన SUV-లాంటి డిజైన్, పెద్ద బూట్ స్పేస్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ వంటి ఫీచర్లు చిన్న కారు విభాగంలో ఆకట్టుకున్నాయి.

కేవలం కొన్ని సంవత్సరాల్లోనే ఇది దేశవ్యాప్తంగా విస్తరించింది. దాంతో నవంబర్ 2021 నాటికి క్విడ్ అమ్మకాలు 4 లక్షల యూనిట్లను దాటాయి. ఇది దాదాపు ఆరు సంవత్సరాల్లో సాధించిన మైలురాయి. అయితే, కాలక్రమేణా మార్కెట్‌లో కొత్త పోటీదారుల ప్రవేశించడం, మరింత అధునాతన టెక్నాలజీ, వినియోగదారుల అభిరుచుల్లో మార్పు వల్ల అమ్మకాలు మందగించడం మొదలయ్యాయి. గత కొంతకాలంగా, ఈ మోడల్ తన మొదటి రోజుల్లో ఉన్న ఉత్సాహాన్ని నిలుపుకోవడంలో విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది.
అయినా, భారత ఆటోమొబైల్ రంగంలో క్విడ్ ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది. ఇది చిన్న కార్ల విభాగాన్ని కొత్తగా దిశగా తీసుకెళ్లిన మోడల్‌గా గుర్తింపు పొందింది. క్విడ్ గతంలో మార్కెట్‌ను ఊపేసిన చిన్న కారుగా వెలుగొందినా, ప్రస్తుతం పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా మారిపోయింది. ఇది కేవలం ఏడాది కాలంతో పోల్చినా కాక, గత నెలతో పోల్చినా స్పష్టంగా కనిపిస్తోంది. మే 2025లో రెనాల్ట్ క్విడ్ అమ్మకాలు 540 యూనిట్లుగా నమోదయ్యాయి.

జూన్ 2025లో ఈ సంఖ్య 449 యూనిట్లకు పరిమితమైంది. ఒక్క నెల వ్యవధిలోనే 16.85 శాతం తగ్గుదల చోటుచేసుకుంది. ఈ వరుస తగ్గుదలలు రెనాల్ట్ క్విడ్ మార్కెట్‌లో తన పూర్వ వైభవాన్ని కోల్పోతుందనే విషయాన్ని స్పష్టంగా సూచిస్తున్నాయి. వినియోగదారులు ఇప్పుడు మరింత అప్‌డేటెడ్ ఫీచర్లు, మెరుగైన భద్రతా ప్రమాణాలు, ఆకర్షణీయమైన డిజైన్‌తో కూడిన మోడళ్లవైపు మళ్ళుతున్న నేపథ్యంలో, క్విడ్ ఇప్పటిపట్లకు మార్పులు చేయకపోతే ఈ క్షీణత కొనసాగే అవకాశం ఉంది.
రెనాల్ట్ క్విడ్ ధర పరంగా చూసినట్లయితే ఇది అందరికి అందుబాటులో ఉండేలా రూపొందించబడింది. భారత మార్కెట్లో దీని ప్రారంభ ధర కేవలం రూ. 4.70 లక్షలు (ఎక్స్-షోరూమ్), ఆన్‌రోడ్ రూ.5.73 లక్షలు. ఇక టాప్ వేరియంట్ ధర రూ. 6.45 లక్షలు. కానీ తక్కువ ధర ఉన్నా కూడా, క్విడ్ ఫీచర్ల విషయంలో మాత్రం ఎలాంటి రాజీ పడలేదు.

కుటుంబ వినియోగదారులకు అనుకూలంగా ఉండే ఈ కారులో LED డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 20.32 సెం.మీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్, భద్రతా పరంగా అత్యుత్తమ సేఫ్టీ ప్రమాణాలు ప్రమాద సమయంలో లోపల కూర్చున్న వారిని రక్షించడానికి ఇవ్వబడ్డాయి. ఇంకా రివర్స్ పార్కింగ్ కెమెరా సెన్సార్లు వంటి అధునాతనమైనవి కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








