దేశప్రజల మనసు గెలిచిన చిన్న కారు.. రూ.5 లక్షల్లో వస్తోంది.. ఒక్కసారిగా భారీగా పెరిగిన కస్టమర్లు
భారత మార్కెట్లో తక్కువ ధరలో కొత్త కారు కొనాలని అనుకున్నప్పుడు, చాలామంది వినియోగదారుల మనసులో గుర్తుకు వచ్చే మోడళ్లలో ఒకటి రెనాల్ట్ క్విడ్ (Renault Kwid). ఈ కారు రూపకల్పన, ఫీచర్లు, ధర అన్నీ కలిపి దీన్ని చిన్న కుటుంబాలకు సరైన కాంపాక్ట్ కారుగా నిలబెట్టాయి. SUV లుక్‌తో, సిటీ డ్రైవింగ్‌కి సరిపడే సైజుతో వచ్చిన ఈ కారు, తక్కువ ఖర్చుతో ఎక్కువ విలువ అందిస్తుందనే పేరును సంపాదించింది. తాజాగా విడుదలైన సెప్టెంబర్ 2025 అమ్మకాల నివేదిక ప్రకారం, రెనాల్ట్ క్విడ్ తన అమ్మకాలలో బాగా పుంజుకుంది. ఆ నెలలో మొత్తం 512 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గత నెలతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల. ఎందుకంటే ఆగస్టు 2025లో కేవలం 235 యూనిట్లు మాత్రమే విక్రయించబడ్డాయి.
అంటే ఒక్క నెలలోనే 277 యూనిట్ల వృద్ధి నమోదైంది. శాతం పరంగా చూస్తే ఇది దాదాపు 54.10 శాతం అమ్మకాల పెరుగుదల. ఈ పెరుగుదల వెనుక కొన్ని ముఖ్యమైన కారణాలు కూడా ఉన్నాయి. మొదటగా, పండుగ సీజన్ ప్రారంభం కావడంతో వినియోగదారులు కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం ప్రారంభించారు. అలాగే రెనాల్ట్ ఇండియా డీలర్లు అందిస్తున్న ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, ఫెస్టివ్ ఆఫర్లు కూడా కొనుగోలు దారులను ఆకట్టుకున్నాయి.

తక్కువ EMI ఆఫ్షన్లు, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వినియోగదారులను క్విడ్ వైపు తిప్పాయి. రెనాల్ట్ క్విడ్‌ను చాలా మంది చిన్న కుటుంబ కారుగా మాత్రమే కాకుండా, మొదటి కారు (first car)గా కూడా ఎంచుకుంటున్నారు. సిటీ డ్రైవింగ్‌లో సులభమైన డ్రైవింగ్, తక్కువ ఇంధన వినియోగం, బడ్జెట్ ఫ్రెండ్లీ మెయింటెనెన్స్‌తో ప్రసిద్ధి చెందింది. అదనంగా, SUV తరహా గ్రౌండ్ క్లియరెన్స్, ఆకర్షణీయమైన డిజైన్ దీన్ని తన కేటగిరీలో ప్రత్యేకంగా నిలబెట్టాయి.
ఈ కారు గురించిన ఇతర వివరాలు చూసినట్లయితే, మార్కెట్లో రెనాల్ట్ క్విడ్ ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర కేవలం రూ. 4.30 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర కూడా కేవలం రూ. 5.99 లక్షలు. తక్కువ ధర కారణంగా నాల్ట్ క్విడ్ భారత మార్కెట్లో విక్రయించబడే అత్యంత సరసమైన కార్లలో ఒకటిగా నిలిచింది. తక్కువ ధర ఉన్నా కూడా, క్విడ్ ఫీచర్ల విషయంలో మాత్రం ఎలాంటి రాజీ పడలేదు.

ఈ హ్యాచ్‌బ్యాక్ 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌లో పనిచేస్తుంది. ఇది 68 ps పవర్, 91 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు 5 స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ఆప్షన్లు జత చేశారు. క్విడ్ చిన్న కారు అయినప్పటికీ, అందులో అందించిన ఫీచర్లు మాత్రం పెద్ద కార్లను తలదన్నేవి. ఈ కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో కంపెనీ వినియోగదారుల సౌకర్యం, టెక్నాలజీ, భద్రత అన్నింటినీ సమతౌల్యంగా కలిగి ఉంది.
ఫీచర్ల విషయానికి వస్తే, రెనాల్ట్ క్విడ్‌లో కీలెస్ ఎంట్రీ సదుపాయం ఉంది, దీని ద్వారా కారు లాక్ లేదా అన్‌లాక్ చేయడం చాలా సులభం. డ్రైవర్, ప్రయాణికులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల ORVMలు (వెనుక అద్దాలు) ఇవ్వబడ్డాయి. అదనంగా, నాలుగు పవర్ విండోలు, మాన్యువల్ AC వెంటిలేషన్ సిస్టమ్ లాంటి బేసిక్ కానీ అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

లోపల 20.32 సెం.మీ (8 అంగుళాల) టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్‌తో వస్తుంది. దీని ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్, మ్యూజిక్, కాలింగ్ ఫీచర్లు సులభంగా ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా, LED డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ డ్రైవర్‌కు ఆధునిక లుక్‌తో పాటు అవసరమైన సమాచారం స్పష్టంగా అందిస్తుంది.


Click it and Unblock the Notifications








