సెకండ్ హ్యాండ్ కార్లలో ఈ కారుని ఎగబడి కొన్నారు.. 2024లో 76 శాతం మంది పాత కార్లనే కొన్నారంటే నమ్ముతారా?

2024 సంవత్సవరం అనేక వాహన తయారీ సంస్థలు కూడా కొత్త మోడళ్లతో మార్కెట్‌లో పోటీ పెంచాయి. అయితే 2024 కొత్త వాహనాలకు మాత్రమే కాదు, పాత వాహనాలకు కూడా గిరాకీ బాగానే జరిగింది. కారులో ప్రయాణించాలనే ఆశ ఉన్నప్పటికీ.. కొత్త వాహనం కొనుగోలు చేసేందుకు సరిపడా డబ్బులు లేనప్పుడు అందరి చూపు సెకండ్ హ్యాండ్ కార్లవైపే ఉంటుంది. 2024 చివర్లో సెకండ్ హ్యాండ్ కార్లపై జీఎస్‌టీ పెంచుతున్నట్లు కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. అయినా కూడా ఈ రంగం గతేడాది మంచి వృద్ధినే కనబర్చిందని చెప్పవచ్చు. Spinney అనే హెహికిల్ సేల్స్ ప్లాట్‌ఫామ్ నివేదిక ప్రకారం.. గతేడాది 76శాతం మంది సెకండ్ హ్యాండ్ కారునే తమ మొదటి వాహనంగా ఎంచుకున్నారని తెలిపింది. అంతకుమందు ఏడాది 73శాతం మాత్రమే కాగా... 2024నాటికి ఈ సంఖ్య 3శాతం పెరిగింది.

గత కొన్నేళ్లుగా సెకండ్ హ్యాండ్ కారు మార్కెట్లో మారుతీ సుజుకీ హవా కొనసాగుతూ వచ్చింది. అయితే.. Spinney డేటా ప్రకారం.. గతేడాది సెకండ్ హ్యాండ్ కార్లలో మారుతీ స్థానాన్ని రెనాల్ట్ సంస్థ అధిగమించి టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ సంస్థ నుంచి అతి తక్కువ ధరలో లభించే క్విడ్ మోడల్ కారు యూజ్‌డ్ కార్లలో

Renault Kwid Top in Used Cars in 2024
ఎక్కువ మందిని ఆకర్షించింది.

రెనాల్ట్ సంస్థ కొత్త మోడళ్ల అమ్మకాల్లో కాస్త వెనుకబడినప్పటికీ... సెకండ్ హ్యాండ్ కార్లలో మాత్రం ఈ సంస్థ నుంచి క్విడ్ మోడల్ కారు 2024లో అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. ఇక హ్యాూందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, మారుతీ స్విఫ్ట్, బాలేనో కారు మోడళ్లు.. వరుసగా రెండు, మూడు, నాలుగో స్థానంలో నిలిచాయి. దీన్ని బట్టి చూస్తే.. హ్యాచ్‌బ్యాక్స్ కార్లను భారతీయులు ఎక్కువగా ఆదరిస్తున్నారని తెలుస్తోంది.

సైజు తక్కువగా ఉండడం, తక్కువ ధర, లో-మెయింటెనెన్స్ ఖర్చుల కారణంగా చాలా మంది హ్యాచ్‌బ్యాక్స్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీని తర్వాత కాంపాక్ట్ ఎస్‌యూవీల్లో కొన్ని మోడళ్లకు సెకండ్‌హ్యాండ్ మార్కెట్లో డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఫోర్డ్ సంస్థ నుంచి EcoSport మోడల్ కారు.. కాంపాక్ట్ ఎస్‌యూవీల్లో ఎక్కువ డిమాండ్ సొంతం చేసుకుంది. అంతకుముందు ఏడాది కంటే... 20 శాతం అధికంగా సేల్స్ సాధించింది.

Renault Kwid Top in Used Cars Details

సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేసేవాళ్లలో ఎక్కువ మంది 25-30 ఏళ్ల మధ్య వయసు యువకులే ఉంటున్నారు. ఈ వయసు వారిలో దాదాపు 60శాతం మంది లోన్ తీసుకుని వాహనాలు కొంటున్నారు. సెకండ్ హ్యాండ్ కార్లు కొనేవారి సగటు వయసు 2023లో 34 ఉండగా... 2024లో 32కి తగ్గింది. యూజ్‌డ్ కార్లలో పెట్రోల్ ఫ్యూయల్ ఆప్షన్‌గా ఉండే వాహనాలపై ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నారు.

2024లో అమ్ముడైన మొత్తం సెకండ్ హ్యాండ్ కార్లలో 82శాతం పెట్రోల్ మోడల్స్ కార్లే ఉన్నాయి. అదే సమయంలో డీజిల్ కార్ల అమ్మకాలు 12శాతానికి పడిపోయాయి. సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు వరుసగా 4శాతం, 2శాతానికి చేరాయి. సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు బెంగళూరు, దిల్లీ, హైదరాబాద్‌లో ఎక్కువగా జరుగుతున్నాయి. యువతలో కారు కొనేవాళ్ల సంఖ్య ఈ నగరాల్లో పెరుగుతుండడంతో సెకండ్ హ్యాండ్ కార్లకు ఈ నగరాలు హబ్‌లుగా మారుతున్నాయి.

Renault Kwid Mileage and Features

అంతేగాకుండా.. కొత్త కార్లు కొనేవాళ్లు తమ వాహనాలను గతేడాది ఎక్కువ సంఖ్యలో అప్గ్రేడ్ చేసుకున్నారు. 2023లో 12శాతం మంది తమ వాహనాలను అప్గ్రేడ్ చేసుకోగా... 2024లో ఈ సంఖ్య 83శాతానికి పెరిగింది. మరోవైపు.. స్పిన్నీ నివేదిక ప్రకారం.. కార్లను కొనుగోలు చేసే మహిళల సంఖ్య కూడా పెరుగుతోంది. స్పిన్నీ రిపోర్ట్ ప్రకారం.. గతేడాది సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసిన వారిలో 26శాతం మంది మహిళలే ఉన్నారు.

ఇది గత కొన్నేళ్లుగా కార్లను కొనుగోలు చేసి, పెరుగుతున్న మహిళల సంఖ్యను సూచిస్తోంది. 76శాతం మంది మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌ను ఎంచుకున్నారు. అంతేగాకుండా... వైట్, గ్రే, రెడ్ కలర్ ఆప్షన్లతో కార్లను ఎక్కువగా కొంటున్నారని స్పిన్నీ నివేదిక వెల్లడించింది. సెకండ్ హ్యాండ్ కార్లపై పన్ను పెరిగినప్పటికీ.. ఈ ఏడాది కూడా వీటి మార్కెట్ వృద్ధి కనబరిచే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, January 11, 2025, 14:42 [IST]
English summary
Renault kwid top used car in 2024 check top sales list here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+