బడ్జెట్ రెడీ చేసుకోండి.. థ్రిల్లింగ్ రైడ్ ఇచ్చే రెనాల్ట్ డస్టర్ వస్తుంది! మార్కెట్లో ఇక యుద్ధం తప్పదు

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ రెనాల్ట్ (Renault) నుంచి ఒక ప్రసిద్ధ మోడల్ డస్టర్ (duster) మార్కెట్లోకి ఎప్పుడు విడుదల అవుతుందా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. 2025 మోడల్ త్వరలో లాంచ్ అవుతుందని గత కొంత కాలంగా సోషల్ మీడియాలో పలు వార్తలు కూడా వస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఇది ఇంత వరకు మార్కెట్లోకి విడుదల కాలేదు. అయితే డస్టర్ కారు కోసం ఎదురుచూస్తున్న వారు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. తాజాగా అందిన ఒక సమాచారం ప్రకారం, ఈ కారు 2025 ఏడాదిలోనే లాంచ్ కాబోతుందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో బయటకు వచ్చింది. Acco Drive తమ పేజీలో రెనాల్ట్ డస్టర్ ఈ ఏడాదిలోనే అందుబాటులోకి వస్తుందని వీడియోలో పేర్కొన్నారు. గతంలో ఈ కారు చాలా సార్లు కెమెరాలకు చిక్కింది.

రేపు, మాపు అంటూ కంపెనీ కాలం గడుపుతుంది, తప్ప దీని అసలు లాంచ్ తేదీని మాత్రం ఇప్పటి వరకు వెల్లడించలేదు. ఇప్పుడు ఈ వార్తతో చాలా మంది కస్టమర్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో డస్టర్ కారుకు విపరీతమైన డిమాండ్ ఉంది. దీని కఠినమైన బాడీ, అదిరిపోయే పెర్ఫామెన్స్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. పాత తరం డస్టర్‌ దేశంలో చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది.

Renault New 2025 Duster Interior

అమ్మకాల్లో కూడా మంచి సంఖ్యలను నమోదు చేస్తుంది. ఈ నేపథ్యంలో దీనిని మరింత అప్‌డేట్ చేసి మూడవ తరం డస్టర్‌ను భారతదేశంలో లాంచ్ చేయాలని రెనాల్ట్ కంపెనీ గతంలో నిర్ణయించింది. 2025 కొత్త డస్టర్ 7-సీటర్ ఇటీవల కాలంలో రోడ్లపై టెస్ట్ రైడ్‌లు చేస్తున్న సమయంలో చాలా సార్లు కెమెరాలకు చిక్కింది. ఈ కారు ఇప్పటికే యూరప్‌లో అమ్మకానికి అందుబాటులోకి రాగా, అక్కడి ప్రజలు దీనిని పెద్ద ఎత్తున ఆదరించారు.

దీని ఆకట్టుకునే రూపం, ఇంజిన్ పనీతీరు, బాడీ బిల్డప్ అన్ని కూడా డస్టర్‌కు ప్రధాన హైలెట్ అని చెప్పవచ్చు. ఇండియాలో విడుదల కాబోతన్న కొత్త డస్టర్‌‌‌ను CMF-B LS ప్లాట్‌ఫారమ్‌ ఆధారంగా రూపొందించారు. ముఖ్యంగా ఈ కారు ముందు డిజైన్ ఆకట్టుకుంటుంది. కొత్తగా కనిపిస్తున్న గ్రిల్, Y- ఆకారపు LED హెడ్‌లైట్, కొత్త బంపర్, LED DRLలు, ఎయిర్ ఇన్‌టేక్‌లు వంటివి కారు అందాన్ని పెంచుతున్నాయి.

Renault New 2025 Duster Side

రూఫ్ కూడా కఠినంగా ఉంది. కొత్త బ్లాక్-అవుట్ అల్లాయ్ వీల్స్ కారుకు కొత్త రూపాన్ని ఇస్తున్నాయి. ఇది 4,343 mm పొడవు, 1656 mm ఎత్తు , 2657 mm వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. ఎక్స్‌టీరియర్ మాత్రమే కాకుండా ఇంటీరియర్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. లోపల వైర్‌లెస్ ఛార్జింగ్ పోర్ట్‌, USB,స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఫ్రీ-ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటివి ఉన్నాయి.

2025 లో కొత్తగా వస్తున్న రెనాల్ట్ డస్టర్ 5-సీటర్, 7-సీటర్ ఆప్షన్‌ను కలిగి ఉంటుందని కూడా సమాచారం ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా రెనాల్ట్ డస్టర్ మైల్డ్-హైబ్రిడ్, స్ట్రాంగ్-హైబ్రిడ్ వేరియంట్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని ఇండియాకు తీసుకువచ్చే ఉద్దేశం కంపెనీకి లేదని తెలుస్తుంది.

2025 Duster Will Launch Soon India

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, January 31, 2025, 13:30 [IST]
English summary
Renault new 2025 duster will launch soon in india here details check
Read more on: #renault #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+