రెనాల్ట్ డస్టర్ మళ్లీ వస్తోంది.. కొత్త రూపం ఇదే! 7 సీటర్ SUV కోసం బడ్జెట్ సిద్ధం చేసి పెట్టుకోండి

భారతీయులకు రెనాల్ట్ (Renault) అంటే సాధారణంగా వెంటనే గుర్తొచ్చే పేరు డస్టర్ (Duster).ఒకప్పుడు భారతదేశపు SUV మార్కెట్‌ను ఊపేసిన ఈ మోడల్, నిజంగా రెనాల్ట్ బ్రాండ్‌కు ఊపునిచ్చింది. కియా, ఎంజిలాంటి బ్రాండ్‌లు ఇంకా మార్కెట్లోకి రాకముందే, రెనాల్ట్ భారతీయుల మనసుల్లో ఈ కారుకు బలమైన డిమాండ్ ఉండేది. డస్టర్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోడ్లపై ఇప్పటికీ కొన్నిసార్లు కనపడుతుంటే దాన్ని అలాగే చూస్తిండిపోతాం. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా అప్‌డేట్‌లు లేకపోవడం, పోటీ బ్రాండ్‌ల హావ పెరగడం వల్ల డస్టర్ మార్కెట్‌లో నుంచి మెల్లగా మాయమయ్యింది. ఈ మోడల్ తరువాత రెనాల్ట్‌కు ఉన్న పేరు కాస్త తగ్గిపోయింది. అమ్మకాల పరంగా కంపెనీ గత కొన్ని సంవత్సరాలుగా పెద్దగా మెరుగ్గా రాణించలేకపోయింది. అ

అయితే ఈ ఫ్రెంచ్ ఆటోమేకర్ ఇప్పుడు భారత మార్కెట్‌పై మరింత దృష్టిసారించి, భవిష్యత్‌కి ప్రణాళికలు సిద్ధం చేసింది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, రెనాల్ట్ ఇండియా వచ్చే మూడు సంవత్సరాల్లో ఐదు కొత్త మోడళ్లను భారత మార్కెట్‌లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలవబోయేది కొత్త తరం డస్టర్ కూడా ఉంది. ఈసారి డస్టర్ మళ్లీ మారింది. మరింత కొత్త ముస్తాబై రాబోతుంది.

duster 7 Seater car Named As Boreal

ఈ డస్టర్ ఇప్పుడు రెండు వేరియంట్లలో రావచ్చు. మొదటిది 5 సీటర్, రెండోది 7 సీటర్. అంటే కేవలం ఫ్యామిలీకి కాకుండా, SUV లవర్స్‌కి కూడా ఇది మంచి ఆప్షన్‌గా నిలవనుంది. ఈ రీఎంట్రీతో రెనాల్ట్ ఒకసారి మళ్లీ తన పాత వైభవాన్ని తిరిగి పొందాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. మార్కెట్ పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ, డస్టర్ పేరుతో వచ్చే బ్రాండ్‌ను ఉపయోగించుకోవడానికి కంపెనీ సిద్దమైంది.

ఈ రెండు మోడళ్లూ ఇప్పటికే విదేశీ మార్కెట్లలో విడుదలైన డాసియా బిగ్‌స్టర్ SUVపై ఆధారపడి రూపొందించబడ్డాయి. అంటే డిజైన్, ప్లాట్‌ఫార్మ్, SUV బలమైన శరీర నిర్మాణం విషయాల్లో డాసియా స్టైల్‌ను కొనసాగించనున్నారు. ఈ క్రమంలో, రెనాల్ట్ ఒక కీలక విషయాన్ని అధికారికంగా వెల్లడించింది, 7-సీటర్ డస్టర్ వెర్షన్‌కు 'రెనాల్ట్ బోరియల్ (Renault Boreal)' అనే పేరును నిర్ణయించింది. బోరియల్ SUVను యూరప్ వెలుపల అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్నారు.

Duster 7 Seater car Named As Boreal details

ఇప్పుడు భారత్ వంటి ప్రాధాన్యత కలిగిన అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా ఇది కస్టమర్లకు కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రాబోతుంది. అంటే, భారతీయ మార్కెట్‌లోను ఈ 7-సీటర్ SUV 'బోరియల్' పేరుతోనే రాబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు సేల్స్‌లో సంచలనాలకు కేంద్ర బిందువు అయిన రెనాల్ట్ డస్టర్‌ ఈ విధంగా తిరిగి రావడం ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆసక్తికరంగా మారింది.

రెనాల్ట్ ఇప్పటికే ప్రకటించిన ప్రకారం, ఈ కొత్త తరం డస్టర్‌ను 2026 మధ్య నాటికి భారత మార్కెట్‌లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉంది. డస్టర్ SUV చాలా మందికి సిటీ రైడ్, రఫ్ రోడ్స్, ఔట్‌డోర్ టూరింగ్ కోసం ఫేవరెట్ మోడల్‌గా గుర్తుంది. ఈ SUV తిరిగి రావాలని భారతీయ ఆటో అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ వార్త చాలా సంతోషించే విషయం అని చెప్పవచ్చు.

Renault New duster 7 Seater

రెనాల్ట్ తన పాత మోడళ్లను కొత్తగా అప్‌డేట్ చేస్తూనే, కొత్త ఎలక్ట్రిక్ వాహనంతో పాటు, బ్రాండ్ బలమైన హైబ్రిడ్ ఇంజిన్‌ కలిగిన కార్లను కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తుంది. రెనాల్ట్ కంపెనీ భారతీయ ప్యాసింజర్ కార్ల విభాగంలో 5 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుని తన కొత్త మోడళ్ల అభివృద్ధిపై పనులు చేస్తుంది. డస్టర్‌ను తీసుకురావడం ద్వారా ప్రస్తుత పరిస్థితులను అధిగమించడంలో ఇది సహయపడుతుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, April 30, 2025, 17:35 [IST]
English summary
Renault new duster 7 seater car named as boreal it will be launch soon in india
Read more on: #renault #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+