ఎంత బాగుందో చూడండి.. మధ్యతరగతికి సరిపోయే కొత్త కైగర్ ధర, ఫీచర్స్ అన్ని వివరాలు!
ఫ్రెంచ్ కార్ల తయారీ దిగ్గజం రెనాల్ట్ గ్రూప్ అనుబంధ సంస్థగా ఉన్న రెనాల్ట్ ఇండియా, భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో నిన్న కొత్తగా అప్‌డేట్ చేసిన రెనాల్ట్ కైగర్ ఫేస్‌లిఫ్ట్ 2025 (Renault Kiger Facelift 2025)ను అధికారికంగా ఆవిష్కరించింది. ఇది కొత్త తరహా డిజైన్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. సేఫ్టీ పరంగా కూడా బలమైన SUVగా దీన్ని తీర్చిదిద్దారు. ధర పరంగా కూడా కిగర్ ఫేస్‌లిఫ్ట్ అందుబాటులో ఉండటం, ప్రస్తుత పోటీ మార్కెట్లో దీన్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. మొత్తంగా, స్టైల్, టెక్నాలజీ, భద్రత, పనితీరుల సమ్మేళనం కావాలనుకునే వారికి ఇది ఒక మంచి ఎంపికగా నిలవనుంది. తక్కువ ధరలో కొత్త కారును కొనుగోలు చేయాలని ఆలోచనలో ఉన్నవారు దీనిని హాయిగా ఎంచుకోవచ్చు. వినియోగదారుల కోసం ఈ కారు గురించిన పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది.
డిజైన్ అండ్ కలర్స్: డిజైన్ పరంగా నిజంగా ఆకర్షణీయంగా మారింది. సొగసైన లుక్‌తో ప్రతి యాంగిల్ నుంచి స్టైలిష్‌గా కనిపిస్తుంది. ముందు భాగంలో వినూత్నమైన LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌లు, కొత్త 2D రెనాల్ట్ డైమండ్ లోగో, ఆకర్షణీయమైన LED DRLలు, LED ఫాగ్ ల్యాంప్‌లు దీని ప్రీమియం ఫీల్‌ను మరింత పెంచుతున్నాయి. వెనుక భాగంలో ఉండే LED టెయిల్ లైట్లు స్పష్టమైన విజిబిలిటీతో పాటు SUVకి స్పోర్టీ టచ్ ఇస్తాయి.

అల్లాయ్ వీల్స్ 16-అంగుళాల డ్యూయల్-టోన్ డిజైన్ SUVకి బలమైన, స్టైలిష్ స్టాన్స్‌ను అందిస్తోంది. కలర్స్ విషయానికి వస్తే, రేడియంట్ రెడ్, కాస్పియన్ బ్లూ, ఐస్ కూల్ వైట్, మూన్‌లైట్ సిల్వర్, స్టీల్త్ బ్లాక్, పెర్ల్ వైట్ వంటి కలర్ ఆప్షన్లు కస్టమర్ అభిరుచులను అనుగుణంగా ఉన్నాయి. మొత్తంగా, లేటెస్ట్ డిజైన్, ఫీచర్లు, విభిన్న కలర్ ఆప్షన్లతో కొత్త కైగర్ మార్కెట్లో స్టైలిష్ SUVలలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడానికి సిద్ధమవుతోంది.
ధర అండ్ వేరియంట్లు: కొత్త రెనాల్ట్ కైగర్ ఫేస్‌లిఫ్ట్ నిజంగా పోటీదారులకు గట్టి సవాల్ విసురుతోంది. రూ.6.29 లక్షల ప్రారంభ ధరతో లభ్యమవుతుండగా, టాప్ వేరియంట్ ధర రూ.11.2 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఈ ధర పరిధి, బడ్జెట్-ఫ్రెండ్లీ కస్టమర్ల నుండి ప్రీమియం SUV అనుభవం కోరుకునే వారికి వరకు అందరినీ ఆకర్షించేలా ఉంది. వేరియంట్ల విషయానికి వస్తే, ఇది మొత్తం 6 విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉంది.

ఇది ప్రారంభ ఫీచర్లతో సరసమైన ధరలో అథెంటిక్‌లో అందుబాటులో ఉంటుంది. తరువాత అదనపు కంఫర్ట్, టెక్నాలజీ కోసం ఎవల్యూషన్, మిడ్-లెవల్ వేరియంట్‌గా టెక్నో, స్పోర్టీ పెర్ఫార్మెన్స్ కోరుకునేవారికి ఎమోషన్ టర్బో , ఇక చివరగా స్మూత్ ఆటోమేటిక్ డ్రైవింగ్ అనుభవం అందించే టాప్-ఎండ్ వేరియంట్ టెక్నో టర్బో CVT లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
ఇంజిన్: ఇది రెండు రకాల పవర్‌ట్రెయిన్ ఆప్షన్లను కలిగి ఉంది. రోజువారీ నగర డ్రైవింగ్‌కి సరైన పవర్‌తో కూడిన 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, శక్తివంతమైన డ్రైవింగ్ అనుభవం కోరుకునేవారికి 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంది. ట్రాన్స్‌మిషన్ విషయానికి వస్తే, వినియోగదారుల అవసరాలను బట్టి 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్, CVT గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది.

రెనాల్ట్ కైగర్ ఫేస్‌లిఫ్ట్ ఫ్యూయల్ సామర్థ్యం కూడా ఆకర్షణీయంగానే ఉంది. ఇది 19.83 నుండి 20.38 kmpl వరకు మైలేజీ అందిస్తుంది. మరో విషయం ఏమిటంటే, అదనంగా, డీలర్‌షిప్-ఫిటెడ్ CNG కిట్ ఎంపికతో కూడా ఇది లభిస్తోంది. ఈ అన్ని లక్షణాల వల్ల, రెనాల్ట్ కైగర్ ఫేస్‌లిఫ్ట్ పెర్ఫార్మెన్స్, ఎకానమీ, ఈకో-ఫ్రెండ్లీ ఆప్షన్ల కలయికగా ఈ SUV మార్కెట్లో ప్రత్యేక స్థానం సంపాదిస్తోంది.
ఫీచర్స్: ఈ కారులో ఐదు మంది ప్రయాణంచవచ్చు. ఇది 455-లీటర్ల పెద్ద బూట్ స్థలాన్ని కూడా కలిగి ఉంది. క్యాబిన్‌లో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, వెనుక AC వెంట్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, సేఫ్టీకి 6 ఎయిర్‌బ్యాగ్స్, ESC, TPMS వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








