బడ్జెట్ రెడీ చేసుకున్నారా..? రూ.6.1 లక్షలకే రెనాల్ట్ ఫ్యామిలీ కారు.. సరికొత్త అప్‌గ్రేడ్ ఫీచర్స్‌తో లాంచ్
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ రెనాల్ట్(Renault) భారతీయ మార్కెట్లో ప్రసిద్ధ కార్లను చాలా కాలంగా విక్రయిస్తుంది. కస్టమర్ల ఇష్టాలకు అనుగుణంగా అధునాతన ఫీచర్స్‌తో కార్లను విడుదల చేస్తూ, మెరుగైన మార్కెట్ వాటాను కలిగి ఉంది. కంపెనీ తాజాగా 2025 ట్రైబర్ (Triber), కిగర్ (Kiger) మోడళ్లను విడుదల చేసింది. పాత మోడళ్లు ఇప్పటికే మార్కెట్లో కొనుగోలుకు అందుబాటులో ఉండగా, వాటిని కంపెనీ అప్‌డేట్ చేసి తీసుకొచ్చింది. ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా కస్టమర్లు పూర్తి సంతృప్తి పొందేలా వారికి ఇష్టమైన చాలా కొత్త ఫీచర్స్ ఈ కొత్త అప్‌డెటెడ్ కార్లలో అందించారు. రెండు ఇంజిన్లలో కూడా స్వల్పంగా మార్పులు చేశారు. E-20 ప్రమాణాలకు అనుగుణంగా ఇంజిన్లలో మార్పులు ఉన్నాయి. మిగతా ఫీచర్స్‌లలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదని తెలుస్తుంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్ల చాలా కార్లను కొత్తగా మార్చి అదిరిపోయే ఫీచర్స్‌తో అప్‌డేట్ చేసి తిరిగి తీసుకొచ్చారు.
2025 ట్రైబర్ (Triber), కిగర్ (Kiger) మోడళ్లు భారతీయ వినియోగదారులను కచ్చితంగా ఆకట్టుకుంటాయని రెనాల్ట్ భారీగా ఆశలు పెట్టుకుంది. ఈ రెండు కార్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో ఈ 2025 కొత్త మోడళ్లతో ఇంకా కొత్త కస్టమర్లను ఆకర్షించవచ్చని కంపెనీ భావిస్తోంది. పాత మోడళ్ల కంటే మరింత ప్రీమియంగా వీటిని తయారు చేశారు. ఇటీవల కాలంలో భారీతయ ఆటోమొబైల్ పరిశ్రమలో పోటీ ఎక్కువ అయింది.

మిగతా వాహన తయారీదారులు వేగంగా తమ పాత కార్లను కొత్తగా అప్‌డేట్ చేసి విడుదల చేస్తున్న తరుణంలో ఈ కార్లను కంపెనీ సరికొత్తగా తీసుకొచ్చింది. రెనాల్ట్ ట్రైబర్ బేస్ వేరియంట్ ధర రూ.6.1 లక్షలు. ఇది 7-సీటర్ MPV. పెద్ద కుటుంబం అంతా కూడా ఒకేసారి కలిసి ఈ కారులో ప్రయాణించవచ్చు. ఫ్యామిలీ కార్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇది పెద్ద కుటుంబం గల వారికి సెట్ అవుతుంది.
ట్రైబర్ టాప్ వేరియంట్ ధర రూ.8.75 లక్షలుగా ఉంది. ఇది ఎక్స్-షోరూమ్ ధర. ఆన్‌రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. అదే, మరో కారు రెనాల్ట్ కిగర్‌ను చూసినట్లయితే ఇది SUV మోడల్. దీని బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 6.1 లక్షల నుండి మొదలుకుని టాప్ వేరియంట్ ధర రూ.10.1 లక్షల వరకు ఉంటుంది. ఇది ఎక్స్-షోరూమ్ ధర, ఆన్‌రోడ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది.

కొత్త అప్‌డేట్స్ విషయానికి వస్తే, 2025 ట్రైబర్ (Triber), కిగర్ (Kiger) కార్లలో సెంట్రల్ లాకింగ్ డోర్లు, పవర్డ్ విండోలను అందించారు. 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా ఇచ్చారు. ఇప్పుడు బేస్ వేరియంట్లలో కూడా యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి సపోర్ట్ ఉంటుంది. రెండు కార్లలోని RXT వేరియంట్లలో 15-అంగుళాల హైపర్ స్టైల్ స్టీల్ వీల్స్ ఉంటాయ. ఇవి కార్ల ఎక్స్‌టీరియర్ అందాన్ని పెంచడంలో కీలకంగా ఉన్నాయి.
ముఖ్యంగా రెనాల్ట్ కిగర్‌లో టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అయ్యే RXZ వేరియంట్‌లో రిమోట్ ఇంజిన్ స్టార్ట్ ఆప్షన్‌ను కూడా అందించారు. పాత మోడళ్లతో పోలిస్తే మేజర్ మార్పులు ఏవి లేనప్పటికి పాత ఫీచర్స్ చాలా వరకు కొత్తగా మారి కస్టమర్లకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








