మే నెల బంపర్ ఆఫర్.. ఒకేసారి లక్ష రూపాయలు ఆదా చేయండి.. రెనాల్ట్ కార్లపై సంచలన తగ్గింపులు!
ఫ్రెంచ్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ రెనాల్ట్ (renault) ఇండియాలో చాలా కాలంగా తన కార్లను విడుదల చేస్తుంది. ముఖ్యంగా దీని ప్రసిద్ద మోడళ్లలో డస్టర్ SUV గురించి తెలియను వారు ఉండరు. భారతీయ మార్కెట్లో ఈ కారుకు ఉన్న డిమాండ్ మాములుది కాదు. దీనిని ప్రక్కన పెడితే రెనాల్ట్ ఇండియా కిగర్, ట్రైబర్, క్విడ్ వంటి కార్లను దేశీయంగా విక్రయిస్తుంది. ప్రస్తుతం పోటీ పెరుగుతున్న నేపథ్యంలో కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడానికి కంపెనీ మే నెలకు సంబంధించి ప్రత్యేకంగా తగ్గింపు ఆఫర్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుత మోడల్ లైనప్‌పై ఆకర్షణీయమైన డిస్కౌంట్‌లను ప్రకటించింది.
మారుతున్న మార్కెట్ పోటీ కారణంగా తన కస్టమర్లకు మెరుగైన డీల్ ఇవ్వాలనే ఉద్దేశంతో కిగర్, ట్రైబర్, క్విడ్ వంటి మోడళ్లపై రూ. లక్ష వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ బెనిఫిట్స్‌లో నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు మరియు కార్పొరేట్ డిస్కౌంట్‌లతో పాటు, కొత్తగా చేర్చిన స్టాక్‌లపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. ఈ తగ్గింపులు అనేవి 2024 మోడల్ అలాగే, 2025 వాహనాలకు అందిస్తున్నారు.

రెనాల్ట్ తన బడ్జెట్ ఫ్రెండ్లీ హ్యాచ్‌బ్యాక్ క్విడ్ కారుపై ఈ నెలలో కంపెనీ లక్ష రూపాయల వరకు ఆదా చేసుకునే అవకాశాన్ని అందిస్తుంది. అయితే ఈ మొత్తాన్ని ఆదా చేయాలంటే, మీరు 2024 మోడల్‌ను ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీనిలో రూ.50,000 నగదు తగ్గింపు, రూ.40,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.10,000 కార్పొరేట్ ఆఫర్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి మొత్తంగా రూ.1,00,000 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు.
అలాగే, 2025 మోడల్‌కి కూడా తగ్గింపు ప్రయోజనాలు ఉన్నాయి. కంపెనీ దీనిపై రూ. 35,000 విలువైన డిస్కౌంట్ అందిస్తుంది. ఈ మొత్తంలో రూ.10,000 నగదు తగ్గింపు, రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.10,000 కార్పొరేట్ ఆఫర్ ఉన్నాయి. అయితే రెండు మోడళ్ల మధ్య ఫీచర్ల తేడా ఏమీ లేకపోవడంతో, ధరను బట్టి నిర్ణయం తీసుకోవాలనిపిస్తే, 2024 వెర్షన్ తక్కువ ధరలో లభిస్తున్నందున్న దీన్ని కొనుగోలు చేస్తే చాలా డబ్బులు ఆదా చేసుకోవచ్చు.

రెనాల్ట్ కాంపాక్ట్ SUV కైగర్‌ను కొనుగోలు చేయాలని అనుకున్న వారికి మే నెల మంచి అవకాశం అని చెప్పవచ్చు. రెనాల్ట్, 2024 మోడళ్లపై భారీగా రూ. 1 లక్ష వరకు డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ మొత్తంలో రూ. 50,000 వరకు క్యాష్ తగ్గింపు, రూ. 40,000 ఎక్స్ఛేంజ్ బోనస్, అదనంగా రూ. 10,000 విలువైన కార్పొరేట్ ఆఫర్ ఉన్నాయి. అంటే మొత్తం రూ. 1,00,000 వరకు ఆదా చేసుకునే వీలుంటుంది.
2025 కైగర్ విషయానికి వస్తే, మే నెలలో ఈ కారుపై మొత్తంగా రూ. 60,000 ప్రయోజనాలను అందిస్తుంది. దీనిలో రూ.25,000 నగదు తగ్గింపు, రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.10,000 కార్పొరేట్ ఆఫర్ ఉన్నాయి. అయితే RXE,RXL బేస్ వేరియంట్ లేదా మిడ్-స్పెక్ వేరియంట్‌లపై కంపెనీ ఎలాంటి ఆఫర్ ప్రకటించలేదు. ట్రైబర్ MPV కొనుగోలు చేయాలని అనుకునే వారు 2024 మోడళ్లపై గరిష్టంగా రూ. 1 లక్ష వరకు ఆదా చేసుకోవచ్చు.

రెనాల్ట్ 7-సీటర్ కుటుంబ కారైన ట్రైబర్‌పై అందిస్తున్న మొత్తం తగ్గింపులో రూ. 50,000 నగదు తగ్గింపుతో పాటు రూ. 40,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 10,000 కార్పొరేట్ ఆఫర్‌ను పొందవచ్చు. అలాగే, 2025 మోడళ్లపై రూ.60,000 వరకు డిస్కౌంట్ ఉంది. ఈ మొత్తంలో రూ.25,000 నగదు తగ్గింపు, రూ. 25,000 ఎక్స్ఛేంజ్ బోనస్, అలాగే రూ. 10,000 కార్పొరేట్ ఆఫర్ లభిస్తాయి.
ఇవి మాత్రమే కాకుండా కంపెనీ అన్ని కార్లపై గ్రామీణ ప్రాంత వినియోగదారుల కోసం ప్రత్యేక పథకాలను కూడా ప్రవేశపెట్టింది. రైతులు, పంచాయతీ అధికారులు వంటి లబ్ధిదారులకు రూ. 4,000 విలువైన అదనపు ప్రయోజనాలను అందిస్తోంది. అంతేకాకుండా, కంపెనీ ఎక్స్ఛేంజ్, లాయల్టీ బెనిఫిట్స్‌ను కూడా ఇస్తుంది. పైన పేర్కొన్న తగ్గింపు డీల్స్ గురించి ముందుగా దగ్గరలోని షోరూమ్‌లో తెలుసుకోగలరు.


Click it and Unblock the Notifications








