కారు కొనాలనుకుంటే ఇదే మంచి టైమ్! ఊహించలేనంత తగ్గింపు ఇస్తోన్న కంపెనీ.. రెనాల్ట్ భారీ ఆఫర్ అదిరింది!
ఫ్రెంచ్ ఆటోమొబైల్ తయారీ సంస్థ రెనాల్ట్ ఇండియా (Renault India) పేరుతో భారతదేశంలో చాలా కాలంగా తన కార్లను విక్రయిస్తుంది. ఈ కంపెనీకి చెందిన క్విడ్, కిగర్, ట్రైబర్ వంటి ప్రజాదరణ పొందిన మోడళ్లతో, రెనాల్ట్ దేశీయ మార్కెట్లో తనదైన ముద్ర వేసుకుంది. అమ్మకాలను ఇటీవల కాలంలో పెంచుకుంటున్న రెనాల్ట్ తాజాగా ఎక్కువ కస్టమర్లను సాధించడానికి ఏప్రిల్‌లో, కంపెనీ తన కార్లపై అద్భుతమైన డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ నెలలో రూ.65,000 వరకు ఆదా చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ ఆఫర్లు కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి అనుకూలంగా ఉంటాయి. వాటి గురించిన పూర్తి వివరాలను కింది కథనంలో తెలుసుకోండి.
Renault kwid: స్టైలిష్, తక్కువ ధరలో లభించే రెనాల్ట్ క్విడ్ హ్యాచ్‌బ్యాక్‌పై భారీ తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. తన ఆకర్షణీయమైన డిజైన్, మైలేజ్, అధునాతన ఫీచర్లతో ప్రసిద్ధి చెందింది. ఈ కారు 2025 మోడళ్లపై మొత్తం రూ.25,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అదే 2024 మోడళ్లపై మాత్రం మరింత ఎక్కువగా 55,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఏప్రిల్ నెల ఆఫర్ కాబట్టి లిమిటెడ్ కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో కొత్త క్విడ్ హ్యాచ్‌బ్యాక్ ధర రూ.4.70 లక్షల నుండి రూ.6.45 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది. క్విడ్ వివిధ వేరియంట్లలో లభిస్తుంది, కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఎంచుకునే వెసులుబాటు కల్పిస్తుంది. ఇది 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో, 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. దీని మైలేజీ లీటరుకు 21.46 నుండి 22.3 కి.మీల వరకు వస్తుంది.
ఇది చిన్న కారైనా, ఇందులో ఐదుగురు ప్రయాణికులు కంఫర్ట్‌గా కూర్చొనగలిగేలా ఇంటీరియర్ డిజైన్ చేయబడింది. లోపల 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, భద్రత పరంగా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ మొదలగునవి ఉన్నాయి. సిటీ డ్రైవింగ్‌కి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. స్టైల్, సురక్షితత, మైలేజీ అన్నీ ఒకేచోట కావాలనుకునే వారికోసం, కొత్త క్విడ్ ఒక ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తోంది.

Renault kiger: రెనాల్ట్ కిగర్ SUV పై కంపెనీ మరోసారి ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. 2025 మోడల్ కిగర్ కార్లపై సుమారు రూ. 35,000 వరకు ఆర్థిక ప్రయోజనాలు లభించనున్నాయి. కానీ ఇంకా పెద్దగా తగ్గింపులు ఆశించే వారు 2024 మోడళ్లవైపు చూస్తే మంచిదే. గత ఏడాది విడుదలైన మోడళ్లపై కంపెనీ రూ. 65,000 వరకు ఆఫర్లు అందిస్తోంది.
ఆధునిక డిజైన్, ఫీచర్లతోపాటు, అద్భుతమైన ప్రదర్శనను కనబరచే కిగర్ ధర భారతీయ మార్కెట్లో ఈ స్టైలిష్ SUV ధర రూ. 6.10 లక్షల ప్రారంభ ధర నుంచి లభిస్తుంది. అత్యధికంగా రూ. 11.23 లక్షల వరకు ఎక్స్-షోరూమ్ ధరగా ఇది అందుబాటులో ఉంది. ఇది 1-లీటర్ నేచురల్, 1-లీటరు టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌లో లభిస్తుంది. ఇది లీటరుకు 18.24 నుండి 20.5 kmpl మైలేజీని అందిస్తుంది.

Renault Triber: రెనాల్ట్ ట్రైబర్ భారత దేశంలో ప్రసిద్ధి ఎంపీవీగా ఉంది. ఈ కారు 2024 మోడళ్లపై కంపెనీ రూ. 60,000 వరకు తగ్గింపు ప్రయోజనాలు అందుబాటులో ఉంది. 2025 మోడళ్లపై రూ. 30,000 వరకు తగ్గింపులు ఉన్నాయి. దీని ప్రారంభ ధర విషయానికి వస్తే, ఇది రూ. 6 లక్షల నుంచి రూ. 8.97 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
కొత్త ట్రైబర్ కారు తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ మంది ప్రయాణికులకు సరిపోయే మెరుగైన ఎంపికగా నిలుస్తోంది. 1 లీటర్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉన్న ఈ కారు, డ్రైవింగ్ ఎఫిషియన్సీతో పాటు మైలేజీ పరంగా కూడా ఆకట్టుకుంటోంది. ఇది సిటీలో 18.2 కి.మీ. మైలేజ్ ఇవ్వగా, లాంగ్ డ్రైవ్ రూట్‌లో 20 కి.మీ. వరకు మైలేజ్ అందించగలదు.


Click it and Unblock the Notifications








