బడ్జెట్‌లో ఫ్యామిలీ కోసం బెస్ట్ కారు కావాలా? రూ.6 లక్షలకే వస్తున్న 7-సీటర్ కారు.. జనాలు ఎగబడి కొంటున్నారు
భారత మార్కెట్లో ఎంపీవీ (MPV) కార్లకు డిమాండ్ మామూలుగా ఉండదు. కుటుంబ ప్రయాణాలకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ సెగ్మెంట్‌లో ప్రస్తుతం చాలా కార్లు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. వీటిలో రెనాల్ట్ ట్రైబర్ (Renault Triber) కూడా ఒకటి. ఇది మారుతీ సుజుకీ ఎర్టిగాతో దేశీయంగా పోటీ పడుతుంది. తాజాగా రెనాల్ట్ ట్రైబర్ ఫిబ్రవరి 2025 నెల అమ్మకాల వివరాలు కంపెనీ వెల్లడించింది. దీని ప్రకారం, గత నెలలో ఈ కారును 1,545 మంది కొనుగోలు చేశారు. ఇది గత ఏడాది అంటే 2024 ఇదే నెలలో మొత్తం 1,456 యూనిట్ల అమ్మకాలను మాత్రమే నమోదు చేసింది. ఏడాది లెక్కన చూసినట్లయితే ఇది 5.76 శాతం వృద్ధి చెందడం విశేషం. దీని ఆకట్టుకునే రూపం, అదిరిపోయే క్యాబిన్ సౌకర్యాలతో భారతీయ ప్రజలకు బాగా ఇష్టమైన ఎంపీవీగా నిలిచింది.
ఇటీవలే భారత మార్కెట్లో రెనాల్ట్ ట్రైబర్ 2025 వెర్షన్‌ను విడుదల చేశారు. పాత దానితో పోలిస్తే, దీనిలో అదనంగా మరిన్ని సదుపాయాలు అందించారు. గత నెలలో సేల్స్ పెరగడానికి ఈ కొత్త వెర్షన్ కూడా ఒక కారణం అయి ఉండవచ్చు. త్వరలో, రెనాల్ట్ ట్రైబర్ కొత్త తరం మోడల్‌ను కూడా అమ్మకానికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తర్వాతి రోజుల్లో ఈ మోడల్ అమ్మకాలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.

రాబోయే కొత్త తరం ట్రైబర్ 2025 ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల ద్వారా వచ్చిన సమాధానం. ఇదిలా ఉంటే ప్రస్తుం మార్కెట్లో కొనుగోలుకు అందుబాటులో ఉన్న ట్రైబర్ విషయానికి వస్తే, దీని బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 6.10 లక్షలుగా ఉంది. అదే దీని టాప్ వేరియంట్ ధర వచ్చేసి రూ. 8.75 లక్షలు మాత్రమే. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు.
ఆన్‌రోడ్ స్వల్పంగా ఎక్కువగా ఉంటుంది. ఇది 7 సీటర్ కారు. దీనిలో పెద్ద కుటుంబం గల వారు సులభంగా ప్రయాణించవచ్చు. దేశీయంగా పెద్ద ఫ్యామిలీ వినియోగదారులు కలిసి ఒకే కారులోల కలిసి హాయిగా టూర్స్ లాంటి వాటికి వెళ్లడానికి అనువుగా ఉంటుంది. పైగా లాంగ్ జర్నీ చేసిన ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా ఉండేలా సీటింగ్ చాలా కంఫర్ట్‌గా అనిపిస్తుంది.

ఇన్ని ఫెసిలిటీలు ఉన్న కారు ధర కూడా అందరికీ అందుబాటులో ఉండటం కలిసి వచ్చే అంశం. భారత మార్కెట్లో అమ్ముడవుతున్న కొన్ని 5 సీటర్ హ్యాచ్‌బ్యాక్ కార్ల కంటే కూడా రెనాల్ట్ ట్రైబర్ తక్కువ ధరకే కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అందుకే జనాలు హ్యాచ్‌బ్యాక్ ధరలోనే లభిస్తున్న ట్రైబర్‌ను తమ ఎంపిక చేసుకున్నారు. ఈ కారు విస్తృతమైన లెగ్‌రూమ్, యూజర్ ఫ్రెండ్లీ ఇంటీరియర్‌తో ఆకట్టుకుంటుంది.
వార్షికంగా రెనాల్ట్ ట్రైబర్ అమ్మకాలు స్థిరంగా పెరుగుతుండటం, కంపెనీకి మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఫ్యామిలీ వినియోగదారులు ఈ కారును ఆదరించడంపై సంతోషం వ్యక్తం చేస్తుంది. రాబోయే రోజుల్లో కొత్త ఫీచర్లతో అప్‌డేటెడ్ వెర్షన్ కూడా రానుందని అంచనా. దీని వల్ల అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








