రెండు ఫ్యామిలీలకు సరిపోయే కారు.. కేవలం రూ.6 లక్షలకే ఇస్తున్నారు! టాప్ 10లో రెనాల్ట్ ఎంపీవీ

ఇండియాలో కుటుంబ ప్రయాణాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. అందరు కలిసి ఒకే కారులో సౌకర్యంగా వెళ్లడానికి అనువుగా ఉండే కార్లను కొనుగోలు చేయడానికి చాలా మంది ఆసక్త చూపిస్తారు. ఎక్కువ మంది కలిసి వెళ్లడానికి ఎంపీవీ (మల్టీ పర్పస్ వెహికల్) బాగా సెట్ అవుతాయి. అందుకే పెద్ద ఫ్యామిలీ గల వారు ఈ సెగ్మెంట్ మోడళ్లను కొంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఇలాంటి కార్లు చాలా ఉన్నాయి. వాటిలో ప్రముఖ కార్ల తయారీ కంపెనీ రెనాల్ట్‌కు చెందిన ట్రైబర్ కూడా ఒకటి. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు కలిగి ఉన్న MPV కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్. మార్కెట్లో లభ్యమయ్యే చాలా MPV మోడళ్ళు ధర పరంగా కొంచెం ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ మోడల్ మాత్రం అందుబాటులోనే లభిస్తుంది.

సాధారణంగా MPV కార్లు భారీగా అనిపిస్తాయి, కానీ ట్రైబర్ స్మార్ట్ డిజైన్‌తో కాంపాక్ట్‌గా కనిపిస్తూ, సిటి రోడ్లపై కూడా సులువుగా డ్రైవ్ చేయగలిగేలా ఉంటుంది. ట్రైబర్ ఎంట్రీ-లెవల్ వేరియంట్ RXE మోడల్ ధర కేవలం రూ. 6,14,995 మాత్రమే ఉంది. ఇదే సమయంలో, అధునాతన ఫీచర్లతో కూడిన టాప్ వేరియంట్ RXZ AMT డ్యూయల్ టోన్ మోడల్ ధర రూ. 8,97,995 వరకు ఉంటుంది. ఈ ధరలు చెన్నై ఎక్స్-షోరూమ్.

Renault Triber Sales Report

మరోవైపు, రెనాల్ట్ ట్రైబర్‌కు ప్రధాన పోటీగా ఉన్న మారుతీ సుజుకీ ఎర్టిగా, ధర పరంగా గణనీయంగా ఎక్కువ. ఎర్టిగా బేస్ మోడల్ ధరనే రూ. 8.97 లక్షల నుండి ప్రారంభమవుతుంది, ఇది ట్రైబర్ టాప్ వేరియంట్ ధరతో సమానంగా ఉంది. పైగా, ఎర్టిగా టాప్ వేరియంట్ ధర రూ. 13.26 లక్షల వరకు చేరుకుంటుంది, ఇది మధ్య తరగతి కొనుగోలుదారులకు కొంత భారమయ్యే అవకాశం ఉంది.

రెండు మోడళ్ల మధ్య తేడాలను చూసినట్లయితే తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు, సౌకర్యవంతమైన ప్రయణ అనుభూతిని అందించడంలో రెనాల్ట్ ట్రైబర్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అయితే గత ఆర్థిక సంవత్సరం అంటే ఎఫ్‌వై2024-25లో రెనాల్ట్ ట్రైబర్ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. తాజాగా విడుదలైన అమ్మకాల నివేదిక ప్రకారం, ట్రైబర్ 19,905 యూనిట్ల విక్రయాలను మాత్రమే నమోదు చేసింది.

Renault Triber

గత ఆర్థిక సంవత్సరం 2023-24తో పోల్చితే రెనాల్ట్ ట్రైబర్ అమ్మకాలు కొంత తగ్గినట్టే కనిపిస్తున్నాయి. గత సంవత్సరం ట్రైబర్ అమ్మకాలు 22,446 యూనిట్లకు పరిమితమయ్యాయి, ఇది 11 శాతం తక్కువ. ఈ తగ్గుదల కారణంగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10, 7-సీటర్ కార్ల జాబితాలో ట్రైబర్ 10వ అంటే చివరి స్థానాన్ని మాత్రమే దక్కించుకుంది.

అంతేకాక, అదే జాబితాలో మారుతీ సుజుకీ ఎర్టిగా అగ్రస్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ట్రైబర్‌తో పోలిస్తే ఎర్టిగా ధర కొంచెం ఎక్కువైనా, మైలేజ్, పనితీరు, విశ్వసనీయత వంటి పలు అంశాల్లో తన బలాన్ని నిరూపించుకుంది. ఫీచర్ల పరంగా మెరుగైన ఫినిషింగ్, మరింత శక్తివంతమైన ఇంజిన్, మెరుగైన డ్రైవింగ్ అనుభవం వంటివి ఎర్టిగాను మరింత ఆకర్షణీయంగా మార్చడంలో కీలకంగా వ్యవహరించాయి.

Triber Financial Year 2024-25 Sales 11 Percent Down

అందుకే ధర కొంచెం ఎక్కువ అయినప్పటికి దేశీయ వినియోగదారులు ఎర్టిగా కారును కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించారు. దీని కారణంగా మారుతీ సుజుకీ ఎర్టిగా అత్యధిక అమ్మకాలతో అగ్రస్థానాన్ని ఆక్రమించగలిగింది, ట్రైబర్ మాత్రం తక్కువ ధరలో అందుబాటులో ఉన్నప్పటికీ పోటీకి తక్కువగా సేల్స్‌ను నమోదు చేసింది. రెనాల్ట్ తన ప్రసిద్ధ మోడల్ అమ్మకాలను పెంచడానికి అప్‌డేట్ చేసిన ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను ఆగస్టులో అమ్మకానికి విడుదల చేసే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, April 28, 2025, 15:20 [IST]
English summary
Renault triber financial year 2024 25 sales 11 percent down more details
Read more on: #renault #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+