కేవలం రూ.6 లక్షలకే 7 సీటర్ కారు! పిల్లలు, పెద్దలు అందరినీ ఎక్కించుకునే మోడల్ వచ్చేస్తోంది

భారతదేశంలో 7-సీట్ల MPV కార్లు ఎప్పుడూ డిమాండ్‌లో ఉంటాయి. అలాంటి సెగ్మెంట్‌లో అత్యంత ఆకర్షణీయమైన కార్లలో పేరుగాంచిన రెనాల్ట్ ట్రైబర్ (Renault Triber) ఇప్పుడు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ మధ్య నెలలుగా అమ్మకాల పరంగా వెనకపడుతున్న ట్రైబర్, నెలకు సగటున కేవలం 1,500 యూనిట్లే అమ్ముడవుతుండటంతో రెనాల్ట్ తన ప్లాన్‌లో కీలక మార్పులు తెస్తోంది. అదే క్రమంలో, 2025 సంవత్సరానికి సంబంధించిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను కంపెనీ సిద్ధం చేసింది.ఇప్పటికే రోడ్లపై పరీక్షలు పూర్తిచేసుకున్న ఈ అప్‌డేటెడ్ ట్రైబర్, జూలై 23న అధికారికంగా విడుదల కాబోతోంది. ఈ కొత్త వెర్షన్‌లో బయట విభిన్నమైన డిజైన్ మార్పులతో పాటు, లోపల కొత్త ఫీచర్లు, సురక్షితమైన టెక్నాలజీ అప్‌డేట్లు ఉండే అవకాశం ఉంది.

మునుపటి మోడల్‌కు లభించిన ఆదరణను మళ్లీ సంపాదించుకునేందుకు రెనాల్ట్ ఈ ఫేస్‌లిఫ్ట్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. ప్రత్యేకించి ఫ్యామిలీ ఆడియన్స్, క్యాబ్ యూజర్స్‌ను టార్గెట్ చేస్తూ, ఇది మంచి అమ్మకాలను అందుకోవాలని భావిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ గ్రూప్ పూర్తి అనుబంధ సంస్థ అయిన రెనాల్ట్ ఇండియా కొత్త లోగోను తన అన్ని కార్లలో అందించనున్నట్లు ప్రకటించింది.

Renault Triber

కొత్త లోగో ఇప్పటికే రెనాల్ట్ ఇండియా మార్కెటింగ్ ప్రచారాలలో భాగంగా ఉంది. ఇప్పుడు కొత్త లోగోను ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌‌కు అందించనున్నారు. భారతదేశంలో కొత్త లోగోను కలిగి ఉన్న మొదటి రెనాల్ట్ కారు ఇదే అవుతుంది. 2025 రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌కు సంబంధించి టీజర్‌ను రెనాల్ట్ ఇండియా అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేసింది. ఈ టీజర్‌‌లో కారు ముందు, వెనుక భాగం డిజైన్‌కి సంబంధించిన ముఖ్యమైనవి కనిపిస్తున్నాయి.

ప్రత్యేకంగా వెనుక పరిశీలిస్తే, టెయిల్‌గేట్‌పై Triber బ్యాడ్జింగ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు వాడిన ఫాంట్, అక్షరాల శైలి ప్రస్తుతం అమ్ముడవుతున్న ట్రైబర్ మోడల్‌తో పోలిస్తే స్పష్టంగా భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి చూస్తుంటే, రెనాల్ట్ 2025 ట్రైబర్‌ను మోడరన్ డిజైన్, కొత్త టచ్‌లతో మార్కెట్లోకి తెస్తుందనే భావన స్పష్టంగా ఉద్భవిస్తుంది. రేపు విడుదల కాబోతున్న ఈ మోడల్‌పై ఇప్పటికే ఆటో వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Triber New Facelift Version Launch

2025 రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్‌కు సంబంధించి ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం, ఈ కొత్త మోడల్ లోపలి భాగంలో కొన్ని కీలకమైన మార్పులతో రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న ట్రైబర్ మోడల్‌తో పోలిస్తే, ఈసారి మరింత పెద్దదైన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించనున్నారని ఊహిస్తున్నారు. ఇక డ్రైవర్‌కు అవసరమైన సమాచారం అందించే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా అప్‌డేట్ చేయబడి ఉండే అవకాశం ఉంది.

అంతేకాకుండా, 360 డిగ్రీ కెమెరా వంటి అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు ఇందులో రావచ్చు. అయితే మెకానికల్ పరంగా మాత్రం పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఇప్పటి మోడల్‌నే కొనసాగించే అవకాశం ఉంది. అంటే, ఇందులో 1.0 లీటర్, 3-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కొనసాగుతుంది. ఇది 72 bhp పవర్, 96 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఉండే అవకాశం ఉంది.

ప్రస్తుతం రెనాల్ట్ ట్రైబర్‌ రూ. 6.15 లక్షల ప్రారంభ ధర వద్ద లభిస్తుంది. అదే సమయంలో, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 8.98 లక్షల వరకు ఉంది. ఈ ధరలు అన్నీ ఎక్స్-షోరూమ్ రేట్లే. అయితే ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్ మోడల్ ధర కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. 2025 ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధరను రూ. 6.25 లక్షలుగా, టాప్ వేరియంట్‌ను రూ. 9.50 లక్షల వరకూ ఉండవచ్చు.

More from DriveSpark

Article Published On: Tuesday, July 22, 2025, 16:40 [IST]
English summary
Renault triber new facelift version launch on july 23rd teaser video here
Read more on: #renault #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+