బ్రహ్మాస్త్రాన్ని దింపుతున్న రెనాల్ట్.. ఒకే ట్రిపులో రెండు ఫ్యామిలీలు వెళ్ళొచ్చు! తక్కువ ధరలో కొత్త కారు
ఫ్రెంచ్ ఆటోమేకర్ రెనాల్ట్(Renault) భారత మార్కెట్లో గత కొంతకాలంగా పెద్దగా ప్రభావం చూపలేకపోతుంది. అయితే రెనాల్ట్ పూర్తిగా వెనుకబడిందనుకోలేం. ఎందుకంటే, సంస్థకు ఇంకా కొన్ని నమ్మకమైన మోడళ్ల రూపంలో బలమైన బేస్ ఉంది, ముఖ్యంగా క్విడ్, ట్రైబర్, కైగర్ రూపంలో మార్కెట్‌ను కలిగి ఉంది. అయితే ఇప్పుడు, తమ వ్యాపార లాభాన్ని మరింత పెంచుకోవడానికి మరో కొత్త అడుగు వేయబోతుంది. తన ప్రసిద్ధ మోడల్ ట్రైబర్ (Triber) ను మరో కొత్త అవతరాంలో తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. రాబోయే రోజుల్లో ట్రైబర్‌కి పూర్తిగా ఒక ఫ్రెష్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లాంచ్ కాబోతోంది. ఈ MPV ఇటీవల కొత్త రూపంతో రోడ్లపై పరీక్షించబడుతూ పలుమార్లు కెమెరాలకు కనిపించింది. కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వకపోయినా, ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం కొత్త ట్రైబర్‌ను ఈ నెల 23న అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది.
ఇందులో అప్‌డేటెడ్ గ్రిల్, కొత్త హెడ్‌లాంప్స్, మెరుగైన ఇంటీరియర్ టచ్‌లు, మోడర్న్ ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే అందుబాటు ధరకు ఏడు మందికి సీట్‌లతో మంచి ప్రాక్టికల్ ఎంపికగా నిలిచిన ట్రైబర్ ఇప్పుడు మరింత ఆధునిక రూపంలోకి మారుతుంది. ఇటువంటి అప్‌డేట్‌తో రెనాల్ట్ మరలా మార్కెట్‌లో తన స్థానం సాధించాలన్న నమ్మకంతో ఉంది. రెనాల్ట్ ఈ మోడల్‌పై భారీ ఎత్తున అంచనాలు పెట్టుకుంది.

రెనాల్ట్ ట్రైబర్ 2019లో తొలిసారి భారత మార్కెట్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి, ఈ కారు మెరుగైన స్థలం, 7-సీటర్ సౌలభ్యం, ఇంకా హ్యాచ్‌బ్యాక్‌కు దగ్గరగా ఉండే ధరతో వినియోగదారులను ఆకట్టుకుంది. అప్పట్లో దీని ప్రారంభ ధర రూ. 6.14 లక్షలు మాత్రమే ఉండడం విశేషం. ధర కూడా చాలా వరకు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండటంతో చాలా మంది కస్టమర్లు ఈ కారును కొనడానికి ఆసక్తి చూపించారు.
ఈ నేపథ్యంలో కంపెనీ అమ్మకాలు పడిపోతున్న తరుణంలో పోటీ ఎక్కువగా ఆటో పరిశ్రమలో తన స్థానాన్ని మెరుగుపర్చుకోవడానికి ట్రైబర్‌ను తన ఆయుధంగా వాడుకుని దీనికి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకురావడానికి సిద్ధమైంది. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత... ట్రైబర్ మళ్లీ కొత్త రూపంతో రీ-ఎంట్రీకి రెడీ అవుతోంది. అయితే ఈసారి కేవలం రూపం కాదు, ఇందులో ఉండబోయే ఫీచర్లు, టెక్నాలజీ అన్నీ మరింత ఆధునికంగా ఉండనున్నాయి.

పాత దానితో పోలిస్తే కొత్త మోడల్‌లో మరిన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ఉండటం కారణంగా గత వర్షన్‌తో పోలిస్తే కొద్దిగా పెరుతుందని కూడా అంచనా. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ డిజైన్ పరంగా స్పష్టమైన మార్పులతో రాబోతున్నది. ముందుగా చూస్తే, కొత్త గ్రిల్ డిజైన్ ఇప్పుడు మరింత షార్ప్‌గా, ప్రెజెన్స్‌ను కలిగించేలా మారింది. బంపర్ ఆవుట్‌లైన్, ఆకృతి కూడా కొత్తగా రూపుదిద్దుకుంది. ఇక ఫాగ్ లైట్లు కారు ముందు భాగానికి అగ్రెసివ్ టచ్‌ను ఇస్తాయి.
హెడ్‌లైట్ డిజైన్ మరింత స్టైలిష్‌గా మారి, కారు ముఖాన్ని కొత్తగా ఆవిష్కరించనుంది. వీల్స్ పరంగా చూస్తే, కొత్త డిజైన్‌లో అల్లాయ్ వీల్స్‌ను అందించనున్నట్లు సమాచారం. ఇవి కారు స్పోర్టీ లుక్‌కు మరింత ఎలివేట్ చేయగలవు. ఇంటీరియర్ విషయానికొస్తే, ఇప్పటి ట్రైబర్‌లో ఉన్న 8 అంగుళాల టచ్ స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ మొబైల్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే వంటి ఫీచర్లు ఇప్పటికే మంచి ఫీడ్‌బ్యాక్ తెచ్చాయి.

కొత్త వెర్షన్‌లో ఆధునిక ఫీచర్లు కలిపి రావొచ్చు. క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ క్యామెరా, ఇంకా అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు కూడా అందుబాటులోకి రావొచ్చు అనే అంచనాలు ఉన్నాయి. రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ రూపంలో కొత్తగా మారుతోన్నా... ఆ కారులో ఉన్న ఇంజిన్ విషయంలో మాత్రం పెద్దగా మార్పులు చేయకపోవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అంటే, ప్రస్తుత మోడల్‌లో అందిస్తున్న 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌నే కంపెనీ కొనసాగించే అవకాశముంది.


Click it and Unblock the Notifications








