రూ.5.76 లక్షలకే 7 మంది ప్రయాణించగల కారు.. అతి తక్కువ ధరలో బెస్ట్ ఆప్షన్.. గత నెల సేల్స్ ఎన్నంటే?

భారతీయ కుటుంబాలకు తక్కువ ఖర్చుతో 7 సీట్ల కారును కొనాలంటే ముందుగా గుర్తుకు వచ్చే మోడల్ రెనాల్ట్ ట్రైబర్. 2019లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కారు, ప్రారంభం నుంచి బెస్ట్-వాల్యూ 7-సీటర్‌గా మంచి గుర్తింపు సంపాదించింది. అయితే కాలక్రమేణా పోటీ పెరగడం, పాత లుక్ కారణంగా ట్రైబర్ అమ్మకాలు కొంత మందగించడం ప్రారంభమైంది. కానీ పరిస్థితి చాలా వేగంగా మారింది. గత జూలైలో రెనాల్ట్ ట్రైబర్‌కి పూర్తిగా అప్డేట్ చేసిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేయడంతో ఈ MPV మళ్లీ మార్కెట్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. కొత్త డిజైన్, అప్‌గ్రేడ్ చేసిన ఫీచర్లు, ఇంటీరియర్ మెరుగుదలలతో పాటు ఆకర్షణీయమైన ధర శ్రేణి పట్ల కస్టమర్ల స్పందన బాగానే వచ్చింది.

ఇదంతటితో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన GST తగ్గింపు, దీపావళి సీజన్‌లో ఆటో మార్కెట్‌లో ఏర్పడిన సానుకూల వాతావరణం కలిసి ట్రైబర్ అమ్మకాలపై భారీగా ప్రభావం చూపాయి. తాజాగా సేల్స్ రిపోర్ట్ ప్రకారం, రెనాల్ట్ అక్టోబర్ 2025లో మొత్తం 3,170 ట్రైబర్ కార్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో అమ్మకాలు 2,111 యూనిట్లకు పరిమితమైన విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈసారి సేల్స్‌లో 1,059 యూనిట్ల పెరుగుదల నమోదైందని తెలుస్తోంది.

Renault Triber October 2025 Sales Growth Report

అక్టోబర్ 2024తో పోల్చితే 50 శాతం అమ్మకాల వృద్ధి సాధించడం రెనాల్ట్ ట్రైబర్‌కి మళ్లీ పాపులారిటీ పెరుగుతోందని స్పష్టంగా చెబుతోంది. పనితీరు విషయానికి వస్తే, రెనాల్ట్ ట్రైబర్ తన సెగ్మెంట్‌లో సరళమైన కానీ నమ్మకమైన డ్రైవ్‌ను అందించే 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. నగర ప్రయాణాలకు అనువుగా ఉండే ఈ ఇంజన్, 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఎంపికలతో లభించడం మరో పెద్ద ప్లస్ పాయింట్.

ఫ్యామిలీ యూజ్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ MPV, డ్రైవింగ్‌లో ఎక్కువ సాఫ్ట్‌నెస్‌ కోరుకునే వాళ్లకు AMT వెర్షన్ మంచి అనుభవాన్ని ఇస్తుంది. మాన్యువల్ వెర్షన్ మాత్రం మరింత నియంత్రణ మరియు మైలేజ్‌ను ఆశించే డ్రైవర్లకు అనుకూలంగా ఉంటుంది. ధరల విషయానికి వస్తే, ట్రైబర్ యొక్క బేస్ వేరియంట్ భారత మార్కెట్లో కేవలం రూ. 5.76 లక్షల ఎక్స్-షోరూమ్ ధర నుంచి ప్రారంభమవుతుంది.

Renault Triber October 2025 Sales Growth Report

7-సీటర్ కేటగిరీలో ఇంత తక్కువ ధరలో అందుబాటులో ఉండటం ట్రైబర్‌కు మరో ప్రధాన బలం. ఫీచర్లు, స్పేస్, ధర అనే మూడు కీలక అంశాలు కలిసి ఈ కారును బడ్జెట్‌ ఫ్యామిలీ సెగ్మెంట్‌లో ఆకర్షణీయ మోడల్‌గా నిలబెడుతున్నాయి. రెనాల్ట్ ట్రైబర్ టాప్ వేరియంట్ కూడా కేవలం రూ. 8.60 లక్షల ఎక్స్-షోరూమ్ ధరలోనే లభిస్తోంది. ఇవి అన్నీ రెనాల్ట్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న చెన్నై ధరలు కావడం గమనించాలి.

ఈ ధర శ్రేణిలో 7-సీటర్ కాన్ఫిగరేషన్‌ను అందించడం మార్కెట్లో చాలా అరుదైన విషయం. అందుకే రెనాల్ట్ ట్రైబర్, మారుతి సుజుకి ఎర్టిగా వంటి పాపులర్ MPVలకు బలమైన మరియు సరసమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. స్పేస్, ప్రాక్టికాలిటీ, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు మరియు భద్రతా లక్షణాలతో కుటుంబాల కోసం పర్ఫెక్ట్ ఎంట్రీ-లెవల్ 7-సీటర్‌గా ట్రైబర్ తన స్థానాన్ని మరింత బలపరుస్తోంది.

Renault Triber October 2025 Sales Growth Report

లక్షణాల విషయానికి వస్తే, రెనాల్ట్ ట్రైబర్ తన ధరకు మించి విలువను ఇచ్చే ఫీచర్లతో నిలిచే మోడల్. కారు ఇంటీరియర్‌లో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందించబడింది, ఇది రోజువారీ ప్రయాణాల్లో వినోదం మరియు కనెక్టివిటీని మరింత సులభతరం చేస్తుంది. అద‌నంగా, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు మరియు ఆటోమేటిక్ వైపర్‌లు వంటి స్మార్ట్ ఫీచర్లు వర్షాకాలం, రాత్రి ప్రయాణాల్లో డ్రైవర్‌కు అదనపు సౌలభ్యాన్ని ఇస్తాయి.

More from DriveSpark

Article Published On: Saturday, November 15, 2025, 14:37 [IST]
English summary
Renault triber october 2025 sales growth report detals inside
Read more on: #renault #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+