ఇది కదా ఫ్యామిలీ కారు అంటే! రూ.5 లక్షల్లోపే 220 కిలోమీటర్ల రేంజ్.. 6 ఎయిర్‌బ్యాగ్స్! టెస్ట్‌లో దొరికింది!
ప్రపంచ మార్కెట్‌లో తనదైన శైలిలో ఉండే రెనాల్ట్ (Renault), ఇప్పుడు భారత మార్కెట్‌లో కూడా కొత్త ఎలక్ట్రిక్ వాహనాలతో అడుగులు వేస్తోంది. అత్యంత లో-కాస్ట్ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో తన స్థానాన్ని బలపరచేందుకు, రెనాల్ట్ క్విడ్ EVను భారతదేశానికి పరిచయం చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఐసీఈ ఇంజిన్ విభాగంలో కైగర్, క్విడ్, ట్రైబర్ కార్లను విక్రయిస్తున్న కంపెనీ ఇప్పుడు ఈవీపై ప్రధానంగా ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ క్విడ్ కారును తీసుకురాబోతుంది. ఇది ఏ సాధారణ ఎలక్ట్రిక్ కారు కాదు, ఇది డాసియా స్ప్రింగ్ EV ఆధారంగా రూపొందించబడిన మోడల్. డాసియా బ్రాండ్‌ను యూరప్‌లో చాలా మంది విశ్వసనీయ బ్రాండ్‌గా పరిగణిస్తారు. అదే పునాదులపై ఇప్పుడు క్విడ్ EV రూపంలో రెనాల్ట్ భారత్‌కి తీసుకువస్తోంది.
ఇప్పటికే కొన్ని నెలల క్రితం, చెన్నై విమానాశ్రయం సమీపంలో ట్రక్కుపై పార్క్ చేసిన ఓ క్విడ్ EV ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డిజైన్ చూస్తే, అది అంతర్జాతీయ వేరియంట్‌కి దగ్గరగా ఉండటంతో ఈవీ ఎంట్రీపై ఉత్కంఠను పెంచింది. ఇప్పుడు మరోసారి, ఇది ప్రమోషనల్ డ్రైవ్ సందర్భంలో కెమెరా కంటికి చిక్కింది. రెనాల్ట్ రోడ్డుపై పరీక్షలు చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. అంటే, మార్కెట్‌లోకి రాక తొందరలోనే ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

వినియోగదారులకు ఇది మంచి న్యూస్ అనే చెప్పాలి. అసలే పెట్రోల్ ధరలు పెరుగుతున్న టైంలో స్మార్ట్, స్టైలిష్, బడ్జెట్ ఫ్రెండ్లీ EV కోసం ఎదురు చూస్తున్న వారికి క్విడ్ EV సాలిడ్ ఆప్షన్ కావొచ్చు. ఈ కారు శక్తివంతమైన 26.8 kWh బ్యాటరీ ప్యాక్‌తో రానుందని సమాచారం. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 220 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వగలదట. డైలీ కమ్యూట్, సిటీ రైడింగ్‌లకు ఇది అద్భుతమైన పరిష్కారం.
పైగా, పవర్ విషయంలోనూ ఇది తగ్గేదేలే అంటోంది , హ్యాచ్‌బ్యాక్ అయినప్పటికీ, ఇందులో ఉన్న పవర్‌ట్రెయిన్ మంచి హార్స్‌పవర్‌ను విడుదల చేయగలదని తెలుస్తోంది. భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల విస్తరణ వేగంగా జరుగుతుంటే, రెనాల్ట్ ఈ రంగంలోకి దిగడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే పాపులర్ హ్యాచ్‌బ్యాక్‌గా పేరు తెచ్చుకున్న క్విడ్, EV అవతారంలో భారత రోడ్లపై 220 కిలోమీటర్ల రేంజ్‌తో పరుగులు తీయబోతున్నది. దీని ధర రూ.5 లక్షల లోపు ఉండవచ్చు.

ఇంటీరియర్ డిజైన్ విషయానికి వస్తే, రెనాల్ట్ ఈసారి ఎక్కడా వెనకడుగు వేయదనిపిస్తోంది. 10 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, ఫోర్ పవర్ విండోస్, ఇంకా ఆటోమేటిక్ AC లాంటి అన్ని ఆధునిక ఫీచర్లను ఇందులో పొందుపరిచే అవకాశముంది.
EV మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని రెనాల్ట్ తీసుకొస్తున్న క్విడ్ EV చిన్న కారు అనిపించవచ్చు. కానీ, ఇందులో దాగి ఉన్న డిజైన్, భద్రతా అంశాలు అన్నీ పెద్ద కార్ల స్థాయిలోనే ఉంటాయని స్పష్టంగా తెలుస్తోంది. ఈ కారు 5-సీట్లతో వస్తోంది, అంటే కుటుంబం అంతా కలసి కూర్చొని కంఫర్టబుల్‌గా ప్రయాణించవచ్చు. అంతేకాదు, వెనక బాగంలో 308 లీటర్ల బూట్ స్పేస్‌ను కూడా అందిస్తుందనే వార్త వినిపిస్తోంది.

వారాంతపు ట్రిప్స్‌లో ఎక్కువ లగేజీ తీసుకెళ్లాలన్నా, రోజువారీ అవసరాలకైనా ఇది చక్కగా సరిపోతుంది. ఇక భద్రత విషయంలో, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్, ESC(ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్) వంటి ముఖ్యమైన ఫీచర్లతో పాటు, ఆధునిక లెవల్-1 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), రీయర్ వ్యూ కెమెరా వంటి వినియోగదారుని డ్రైవింగ్ సమయంలో మరింత అవగాహన కలిగించే ఫీచర్లు కూడా ఇందులో అందించాయని అంచనాలున్నాయి.


Click it and Unblock the Notifications








