మారుతి, టాటా, మహీంద్రా బహుపరాక్.. ముగ్గురు మొనగాళ్లతో మార్కెట్‌ను షేక్ చేయబోతున్న రెనాల్ట్
ఇండియన్ ఆటోమోటివ్ మార్కెట్లో మరోసారి తమ సత్తా చాటడానికి రెనాల్ట్ రెడీ అవుతుంది. ఎస్‌యూవీలు, హ్యాచ్‌బ్యాక్‌ల ప్రియులకు శుభవార్త చెబుతూ రెనాల్ట్ ఏకంగా మూడు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తోంది. వీటిలో రెండు పవర్‌ఫుల్ ఎస్‌యూవీలు కాగా, మరొకటి పూర్తి ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్. ఈ మూడు మోడళ్లు ఆల్ న్యూ రెనో డస్టర్, రెనో బోరియల్ 7 సీటర్ ఎస్‌యూవీ, రెనో క్విడ్ ఈవీ తమ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ మూడు మోడళ్ల ప్రత్యేకతలు, ఫీచర్ల వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.
1. ఆల్-న్యూ రెనో డస్టర్
ఇండియాలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎస్‌యూవీలలో కొత్త రెనాల్డ్ డస్టర్ ముందుంది. ఈ కొత్త మోడల్‌ను CMF-B ప్లాట్‌ఫారమ్‌పై తయారు చేస్తున్నారు. ఈ కొత్త ప్లాట్‌ఫారమ్ మెరుగైన డ్రైవింగ్ అనుభవాన్ని ఇవ్వగలదని భావిస్తున్నారు. కొత్త డస్టర్ డిజైన్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇందులో సన్నని LED హెడ్‌లైట్లు, మస్కులర్ వీల్ ఆర్చెస్, రగ్గడ్ స్కిడ్ ప్లేట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇంటీరియర్ విషయానికి వస్తే, కేబిన్‌ను ప్రీమియం మెటీరియల్స్, విశాలమైన లేఅవుట్‌తో అప్‌డేట్ చేశారు. 460 లీటర్ల కంటే ఎక్కువ బూట్ స్పేస్ ఉండడం వల్ల ఫ్యామిలీలకు, లాంగ్ డ్రైవ్‌లకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. పవర్‌ట్రైన్ పరంగా, ఈ ఎస్‌యూవీకి 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ లభిస్తుంది. ఇది 154 బీహెచ్‌పీ పవర్, 250 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఇప్పటికే ఉన్న, రాబోయే ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.
2. రెనో బోరియల్ 7 సీటర్ ఎస్‌యూవీ
కొత్త డస్టర్ తర్వాత రెనాల్ట్ నుంచి రాబోతున్న మరో పెద్ద వాహనం రెనో బోరియల్ 7 సీటర్ ఎస్‌యూవీ. ఇది 2026 రెండవ భాగంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మోడల్ కూడా CMF-B LS ప్లాట్‌ఫారమ్‌పైనే రూపొందుతోంది. బోరియల్‌లో కూడా స్లీక్ LED హెడ్‌లైట్లు, మస్కులర్ డిజైన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

బోరియల్ ఇంటీరియర్ ఫెసిలిటీలకు, లగ్జరీ అనుభూతికి ప్రాధాన్యత ఇస్తుంది. దీని కేబిన్‌లో డ్యూయల్ స్క్రీన్ డాష్‌బోర్డ్, 48-కలర్ యాంబియెంట్ లైటింగ్, హార్మన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఏడుగురు ప్రయాణీకులకు సౌకర్యవంతంగా కూర్చునే అవకాశం, అలాగే మంచి కార్గో కెపాసిటీ ఇందులో ఉంటుంది.
దీనిలో కూడా 154 బీహెచ్‌పీ ఎనర్జీ ఇచ్చే 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అందించవచ్చు. అలాగే, అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న 1.6 లీటర్ పెట్రోల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆప్షన్‌ను కూడా తీసుకురావాలని రెనో యోచిస్తున్నట్లు సమాచారం.

3. రెనో క్విడ్ ఈవీ
రెనో నుంచి రాబోయే మూడవ మోడల్ రెనో క్విడ్ ఈవీ. ఇది కంపెనీ నుంచి వస్తున్న కంప్లీట్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్. ఇందులో Y-ఆకారపు LED DRLలు, బ్లాక్ క్లాడింగ్, స్కిడ్ ప్లేట్లు వంటి ఎస్‌యూవీ-ఇన్ స్పైర్డ్ స్టైలింగ్ అంశాలు ఉంటాయి. ఈ ఈవీలో 26.8 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ఇది ఒకే ఛార్జ్‌పై దాదాపు 200-225 కిలోమీటర్ల దూరం ప్రయాణించగల కెపాసిటీ ఇవ్వగలదు.
క్విడ్ ఈవీలో 44 బీహెచ్‌పీ పవర్, 125 Nm టార్క్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటారు ఉంటుంది. పవర్ ఎక్కువగా ఉండే టాప్ ట్రిమ్‌లకు 64 బీహెచ్‌పీ పవర్ కూడా లభించే అవకాశం ఉంది. ఫీచర్ల పరంగా ఇందులో 10 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పవర్ విండోలు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి అనేక సౌకర్యవంతమైన ఫీచర్లు లభిస్తాయి. సరసమైన ధరలో ఎలక్ట్రిక్ కారు కావాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్ కానుంది.


Click it and Unblock the Notifications








