రాకెట్ స్పీడ్, బిజినెస్ క్లాస్ ఫీచర్లు..మార్కెట్లోకి దర్జాగా దిగబోతున్న స్కోడా నయా కార్

భారత మార్కెట్లో తమ ఇండియా 2.0 వ్యూహంతో విజయం సాధిస్తున్న చెక్ రిపబ్లికన్ వాహన తయారీ సంస్థ స్కోడా..ఇప్పుడు పెర్ఫార్మెన్స్ ప్రియుల కోసం ఒక కొత్త సంచలనాన్ని తీసుకురాబోతోంది. ఆటోమొబైల్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న, స్కోడా చరిత్రలోనే ప్రత్యేక స్థానం ఉన్న ఒక్టావియా ఆర్ఎస్ (Octavia RS) కొత్త పెర్ఫార్మెన్స్ ఎడిషన్‌ను అక్టోబర్ 17న భారతదేశంలో లాంచ్ చేయనుంది.

రాకెట్ లాంటి స్పీడు, విమానంలోని బిజినెస్ క్లాస్‌ను తలపించే ఫీచర్లతో రాబోతున్న ఈ కొత్త సెడాన్ గురించి, దాని స్పెసిఫికేషన్లు, ధర, బుకింగ్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

Rocket Speed Business Class Features All-New Skoda Octavia RS Launching Soon

భారత మార్కెట్లో కుషాక్, స్లావియా, కైలాక్ వంటి మోడళ్లతో ఇప్పటికే విజయం సాధించిన స్కోడా, ఇప్పుడు తన అత్యంత ప్రతిష్టాత్మక మోడల్ ఒక్టావియా RS పెర్ఫార్మెన్స్ ఎడిషన్‌ను తీసుకురాబోతోంది. ఈ కారు అక్టోబర్ 17న లాంచ్ కానుంది. ఈ లెజెండరీ సెడాన్‌ను కొనుగోలు చేయాలనుకునే ఆసక్తిగల కస్టమర్‌లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా రూ.2.50 లక్షలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

ఒక్టావియా RS, 2004లో భారతదేశంలో మొట్టమొదటి టర్బోచార్జ్డ్ పెట్రోల్ ప్యాసింజర్ కారుగా ప్రవేశపెట్టబడింది. అప్పటినుండి ఇది పెర్ఫార్మెన్స్‌కు పర్యాయపదంగా మారింది.

Rocket Speed Business Class Features All-New Skoda Octavia RS Launching Soon

కొత్త స్కోడా ఒక్టావియా RSలో 2.0 లీటర్ టీఎస్‌ఐ పెట్రోల్ ఇంజన్‌ను అందించారు. ఈ శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 261 బీహెచ్‌పీ శక్తిని, 370 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 7 స్పీడ్ డీఎస్‌జీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది. ఫ్రంట్ వీల్ డ్రైవ్ మోడ్‌లో లభిస్తుంది.

పెర్ఫార్మెన్స్ లెక్కల విషయానికి వస్తే, ఈ సెడాన్ కేవలం 6.4 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లుగా ఉంటుంది. ఇందులో స్పోర్ట్స్ ఎగ్జాస్ట్, స్పోర్ట్స్ సస్పెన్షన్, ప్రోగ్రెసివ్ స్టీరింగ్ వంటి పెర్ఫార్మెన్స్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

Rocket Speed Business Class Features All-New Skoda Octavia RS Launching Soon

కారు లోపలి భాగం విమానంలోని బిజినెస్ క్లాస్‌ను తలపించేలా ఉంటుంది. ఇంటీరియర్ మొత్తం ఎరుపు హైలైట్స్‌తో కూడిన ఆల్-బ్లాక్ థీమ్‌లో ఉంటుంది. ఫీచర్లలో ప్రధానంగా 12.9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటివి ఉన్నాయి.

ముఖ్యంగా, ముందు స్పోర్ట్ సీట్లలో మసాజ్, హీటింగ్, కూలింగ్, మెమరీ ఫంక్షన్‌లు వంటి లగ్జరీ ఫీచర్లు లభిస్తాయి. వీటితో పాటు వైర్‌లెస్ మొబైల్ కనెక్టివిటీ, హెడ్-అప్ డిస్‌ప్లే, వర్చువల్ పెడల్‌తో కూడిన ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఎక్స్‌టీరియర్‌లో ఎల్‌ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌ల్యాంప్‌లు, 19 అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్, ఎరుపు బ్రేక్ కాలిపర్‌లు కారుకు స్పోర్టీ లుక్ ఇస్తాయి.

Rocket Speed Business Class Features All-New Skoda Octavia RS Launching Soon

స్కోడా ఎప్పుడూ భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. కొత్త ఒక్టావియా RSలో 10 ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎంసీబీ, టీపీఎంఎస్ వంటి అత్యున్నత స్థాయి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లలో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, 360-డిగ్రీ కెమెరా వంటివి లభిస్తాయి. ఈ పెర్ఫార్మెన్స్ సెడాన్ ధర సుమారు రూ.50 లక్షల వరకు ఉండవచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Friday, October 10, 2025, 17:10 [IST]
English summary
Rocket speed business class features all new skoda octavia rs launching soon
Read more on: #skoda #new lauch #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+