మార్కెట్ దుమ్ము దులిపేందుకు రాయల్‌గా దిగుతున్నాడు..750సీసీతో ఈ సారి దబిడిదిబిడే
అడ్వెంచర్ రైడింగ్ అంటే ఇష్టపడే మన ఇండియన్ బైకర్స్‌కి రాయల్ ఎన్‌ఫీల్డ్ ఒక స్పెషల్ బ్రాండ్. గతంలో వచ్చిన హిమాలయన్ 411 గానీ, ఇప్పుడు మార్కెట్‌ను దున్నేస్తున్న హిమాలయన్ 450 గానీ ఎంతటి ఫాలోయింగ్ తెచ్చుకున్నాయో అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ అడ్వెంచర్ హంగామాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లడానికి, ఎన్‌ఫీల్డ్ ఏకంగా 750cc సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇటలీలో జరిగిన 2025 EICMA మోటోషోలోనే ఈ పవర్‌ఫుల్ మోడల్‌ను ప్రదర్శించారు. అప్పటి నుంచి ఈ 750cc బీస్ట్ కోసం ఇండియాలో బైక్ లవర్స్ చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
ఇక ఎక్కువ కాలం ఎదురుచూడాల్సిన పనిలేదు. ఆటోమొబైల్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750 అతి త్వరలో మన ఇండియన్ రోడ్స్‌పైకి రానుంది. ఈ ఫ్లాగ్‌షిప్ బైక్‌ను గోవాలో జరిగే 2025 మోటోవర్స్ (MotoVerse) ఈవెంట్‌లో ప్రదర్శించబోతున్నారు.

ఈవెంట్ సరిగ్గా నవంబర్ 21 నుంచి 23 వరకు జరుగుతుంది. అంటే మరో కొన్ని రోజుల్లోనే ఈ భారీ అడ్వెంచర్ బైక్ మన ముందుకు రాబోతోంది. అయితే, దీని ప్రైస్ ట్యాగ్, పూర్తి లాంచ్ వివరాలు మాత్రం వచ్చే ఏడాది మొదట్లో ప్రకటించే అవకాశం ఉంది.
కొత్త ప్లాట్‌ఫామ్, డబుల్ పవర్
ఈ హిమాలయన్ 750 రాయల్ ఎన్‌ఫీల్డ్ చరిత్రలోనే ఒక ముఖ్యమైన మైలురాయి. ఇది కంపెనీ కొత్తగా డెవలప్ చేసిన 750cc, ప్యారలల్-ట్విన్ ప్లాట్‌ఫామ్ మీద తయారవుతున్న మొట్టమొదటి బైక్. ఇది గ్లోబల్ మార్కెట్‌లో ఉన్న మిడిల్-వెయిట్ అడ్వెంచర్ బైకులకు గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. 450cc హిమాలయన్‌తో పోలిస్తే, ఇది మరింత శక్తివంతమైనదిగా, ప్రీమియం ప్యాకేజీగా నిలవనుంది.
ఇంజిన్, టెక్నికల్ స్పెసిఫికేషన్స్అధికారికంగా వివరాలు ప్రకటించకపోయినా.. ఈ హిమాలయన్ 750 లో 750cc, ప్యారలల్-ట్విన్ ఇంజిన్ ఉంటుందని గట్టిగా వినిపిస్తోంది. ఈ ఇంజిన్ సుమారు 53-55 హార్స్‌పవర్ పవర్, 65-70 Nm టార్క్ జనరేట్ చేయగలదని అంచనా. ఈ ఇంజిన్‌కు స్లిప్పర్ అసిస్ట్ క్లచ్‌తో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేసి ఉంటుంది. ఈ పవర్ ఫిగర్స్‌తో ఎంత కఠినమైన ఆఫ్-రోడ్ ట్రాక్‌లనైనా ఇది సునాయాసంగా ఎదుర్కోగలదు.

డిజైన్, ఫీచర్స్, ధర అంచనా
డిజైన్ పరంగా కొత్త 750cc హిమాలయన్ దాదాపు 450cc మోడల్‌ను పోలి ఉంటుంది. కానీ చాలా మస్కులర్‌గా కనిపిస్తుంది. ఇందులో సెమీ-ఫెయిరింగ్, పెద్ద ఫ్యూయల్ ట్యాంక్, ఎత్తుగా ఉండే టెయిల్ సెక్షన్, పైకి లేపిన ఎగ్జాస్ట్ సిస్టమ్ ఉంటాయి. ఫీచర్ల విషయానికి వస్తే.. రౌండ్ LED హెడ్‌లైట్లు, LED టెయిల్ లైట్లు, ఇంకా గూగుల్ మ్యాప్స్ మిర్రరింగ్, మ్యూజిక్ కంట్రోల్ ఉండే రౌండ్ డిజిటల్ క్లస్టర్ ఉంటాయి.
టెక్నాలజీ పరంగా, క్రూయిజ్ కంట్రోల్‌తో కూడిన రైడ్-బై-వైర్ థ్రాటిల్, బై-డైరెక్షనల్ క్విక్-షిఫ్టర్, మరియు స్విచ్ ఆన్/ఆఫ్ చేయగలిగే డ్యూయల్-ఛానల్ ABS వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సస్పెన్షన్ కోసం ముందు భాగంలో అడ్జస్టబుల్ USD (అప్‌సైడ్ డౌన్) ఫోర్కులు, వెనుక భాగంలోనూ అడ్జస్టబుల్ సస్పెన్షన్ సిస్టమ్, ఇంకా స్పోక్ వీల్స్ ఉండే అవకాశం ఉంది.
ధర విషయానికి వస్తే దీని ఆన్-రోడ్ ధర సుమారు రూ.5 లక్షల కంటే ఎక్కువ ఉండే ఛాన్స్ ఉందని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఈ 750cc హిమాలయన్ రాకతో, అడ్వెంచర్ టూరింగ్ చేయాలనుకునే బైకర్ల కల నెరవేరుతుందని చెప్పొచ్చు. ఈ కొత్త 750cc బైక్ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో కేటీఎం 790 డ్యూక్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications








